Monday, July 27, 2026
Home Blog Page 6

Vijay special | ఆ సీఎం డిఫ‌రెంట్‌.. లంచ్ బాక్స్‌తో ఆఫీస్‌కు!

Vijay special | ముఖ్య‌మంత్రి అంటే ఎప్పుడో ఓ సారి స‌చివాల‌యం వ‌స్తుండ‌డం చూసుంటాం.. అదీ వారి ఇష్ట‌మైన టైంలో.. కానీ ఈ సీఎం మాత్రం డిఫ‌రెంట్‌.. కాదు కాదు ..సంథింగ్ స్పెష‌ల్‌. అంద‌రి కంటే ముందుగానే ఆఫీస్ చేరుకుంటున్నారు. ఉన్న‌తాధికారుల‌నూ స‌మ‌య పాల‌న పాటించేలా చేస్తున్నారు. అంతేకాదండోయ్‌.. లంచ్ బాక్స్‌తో ఇన్‌టైంలో కార్యాల‌యానికి రీచ్ అవుతున్నారు. ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఆయ‌న ఎవ‌రో ఇప్ప‌టికే మీకు గుర్తొచ్చి ఉండాలే.. అవునండీ ఆయ‌నే త‌మిళ‌నాడు న్యూ చీఫ్ మినిస్ట‌ర్ జోస‌ఫ్ విజ‌య్‌(Vijay) .
తెర‌పైనే కాదు.. రియ‌ల్ హీరో లా..
సినీరంగం నుంచి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన ఈ ద‌ళ‌ప‌తి పార్టీ పెట్టిన‌ రెండేళ్ల‌లోనే ఎన్నిక‌ల్లో విజిలేసి ‘విజ‌య‌’ మోత మోగించారు. సంచ‌ల‌న ఫ‌లితాల‌తో ప్ర‌భంజ‌నం సృష్టించారు. మ‌హామ‌హుల‌ను మ‌ట్టి క‌రిపించి ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించారు. ఆ వెంట‌నే త‌న మార్కు పాల‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. తెరపైనే కాదు.. రియ‌ల్ హీరోగా త‌న ముద్ర ఉండేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై ఫోక‌స్‌
ప్ర‌ధానంగా తానిచ్చిన హామీల అమ‌లుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితుల‌పై ఫోక‌స్ పెంచారు. ఆయా రంగాల్లో లోటుపాట్ల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. అప్పుల‌ను చూసి అధైర్య ప‌డ‌కుండా నిధుల‌ స‌మీక‌ర‌ణను అన్వేషిస్తున్నారు . ఆయా రంగాల నిపుణుల‌తో పాటు సీనియ‌ర్ ఐఏఎస్‌ల‌తో నిత్యం స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. పాల‌న‌ను గాడిలో పెట్ట‌డంతో పాటు అక్ర‌మార్కుల భ‌ర‌తం ప‌ట్టేలా సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ప్ర‌మాణ స్వీకారం పూర్తికాగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మ‌హిళా భ‌ద్ర‌త‌, డ్ర‌గ్స్‌కు వ్య‌తిరేకంగా ఈగ‌ల్ త‌ర‌హా వ్య‌వ‌స్థ‌పై మూడు సంత‌కాలు చేసి త‌న చిత్త‌శుద్ధిని చాటారు. తాజాగా రాష్ట్ర‌వ్యాప్తంగా పాఠ‌శాల‌లు, ఆల‌యాల ప‌క్కన ఉన్న 717 మ‌ద్యం దుకాణాల మూసివేత‌కు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.
సీఎం కూడా ఉద్యోగే అనేలా..
ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆయ‌న ఓ ఉద్యోగిలా మారారు. రోజూ పావుగంట ముందే స‌చివాల‌యానికి చేరుకుంటున్నారు. త‌న‌ వ్య‌వ‌హార‌శైలితో ఉన్న‌తాధికారుల‌ను స‌మ‌య‌పాల‌న పాటించేలా చేస్తున్నారు. అంతేకాకుండా రోజూ ఇంటి నుంచి లంచ్ బాక్స్‌తో హాజ‌ర‌వుతున్నారు. మ‌ధ్యాహ్నం త‌న చాంబ‌ర్‌లోనే తినేసి త‌ర్వాత ప‌నిలో నిమ‌గ్న‌మ‌వుతున్నారు. విజ‌య్ నిరాడంబత‌పై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మవుతుండ‌గా.. ముఖ్య‌మంత్రి అంటే ఇలానే ఉండాలే అంటూ సోష‌ల్ మీడియాలోనూ ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. నిజ‌మే కదా.. పాల‌కుడిగా కాకుండా సేవ‌కుడిగా ఉంటేనే ప్ర‌జ‌లకు మేలు జ‌రుగుతుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం.

ఇది కూడా చ‌ద‌వండి.. ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వర్క్ ఫ్రం హోం షురూ..

Eapcet results | రేపే ఎప్ సెట్ ఫలితాలు

Eapcet results | ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌- 2026(EAPCET) ఫలితాల డేట్ వచ్చేసింది. ఈ నెల 17న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు విడుదల చేయనున్నారు. అభ్యర్థులకు వచ్చిన మార్పులను ర్యాంకు కార్డు ద్వారా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్షలు హాజరు ఇలా..
అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ ప్రవేశ పరీక్షలను ఈనెల 4, 5 తేదీల్లో, అలాగే ఇంజినీరింగ్‌ పరీక్షలను 9, 10, 11తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షలకు 90 వేల మంది దరఖాస్తు చేసుకోగా 84 వేల మంది హాజరయ్యారు. ఇక ఇంజినీరింగ్‌ పరీక్షల కోసం 2.10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 1.97 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ప్రాథమిక కీ ని మంగళవారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈనెల 14 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. 17న ఫలితాలు ప్రకటించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

ఇది కూడా చదవండి…బంగారం ధ‌రలు డౌన్‌.. కొనుగోలు ఇదే మంచి స‌మ‌య‌మా?

Gold news | బంగారం ధ‌రలు డౌన్‌.. కొనుగోలు ఇదే మంచి స‌మ‌య‌మా?

Gold news | బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఇటీవల కేంద్రం గోల్డ్‌(Gold), సిల్వ‌ర్‌ దిగుమ‌తుల‌పై ప‌న్నులు పెంచడంతో ఒక్క‌సారిగా ధ‌ర‌లు పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ హెచ్చుత‌గ్గుల నేప‌థ్యంలో మళ్లీ దిగివ‌స్తున్నాయి. రానున్న రోజుల్లో మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్లుగా నిపుణులు సూచిస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు శ‌నివారం ఇలా ఉన్నాయి.
హైద‌రాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,57,900 ప‌లికింది. నిన్న‌టితో పోల్చితే ఏకంగా రూ. 4,420 త‌గ్గింది. ఇక 22 క్యారెట్ల ధర ప్ర‌స్తుతం రూ.1,44,740 ఉండ‌గా.. శుక్ర‌వారం 1,48,790 ఉన్న విష‌యం తెలిసిందే. ఇది కూడా ఏకంగా రూ. 4,050 త‌గ్గింది. వెండి ప్ర‌స్తుతం రూ.2,89,900 ఉండ‌గా నిన్న‌టితో పోల్చితే రూ. 10వేల వ‌ర‌కు త‌గ్గింది.
మిగ‌తా ప్రాంతాల్లో  (10గ్రాములు) ఇలా..
ఢిల్లీలో.. 24 క్యారెట్లు రూ.1,58,050, 22 క్యారెట్లు రూ.1,44,890
చెన్నైలో.. 24 క్యారెట్లు రూ.1,61,070, 22 క్యారెట్లు రూ.1,47,640
బెంగళూరులో.. 24 క్యారెట్లు రూ.1,57,900, 22 క్యారెట్లు రూ.1,44,740
కోల్‌కతాలో.. 24 క్యారెట్లు రూ.1,57,900 , 22 క్యారెట్లు రూ.1,44,740
ముంబైలో.. 24 క్యారెట్లు రూ.1,57,900 , 22 క్యారెట్లు రూ.1,44,740

ఇది కూడా చ‌ద‌వండి.. ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వర్క్ ఫ్రం హోం షురూ

Modi mantra | ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వర్క్ ఫ్రం హోం షురూ..

Modi mantra | ఈనెల 10న హైదరాబాద్ వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ఉపదేశించిన పొదుపు మంత్రం ఆచరణలోకి వస్తుంది. ఇప్పటికే ఢిల్లీ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు ప్రధాని మొదలుకొని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పొదుపు మంత్రం పై దృష్టి సారించారు. తమ కాన్వాయ్ ని భారీగా తగ్గించుకుంటున్నారు.
ఢిల్లీలో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ ..
ప్రధాని సూచన మేరకు దేశ రాజధానిలో వర్క్ ఫ్రం హోం(Work from Home) ను ఢిల్లీ సర్కారు అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా వారానికి రెండు రోజులు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సైతం వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని సీఎం రేఖ గుప్తా వెల్లడించారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నాయి.
కాన్వాయ్ ను తగ్గించుకున్న మోడీ
పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని మోడీ తన కాన్వాయ్ ను భారీగా తగ్గించుకున్నారు. కేవలం రెండు కార్లకే పరిమితమయ్యారు. అందరికీ ఆదర్శంగా మారారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంత్రుల కాన్వాయ్ గతంలో 17 వరకు ఉండగా ప్రస్తుతం 4 వాహనాలకు తగ్గించుకున్నారు. అందులోనూ ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. పీఎం స్ఫూర్తితో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ కాన్వాయ్ ను ఇప్పటికే తగ్గించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాలుగు వాహనాలకే పరిమితం గా డిప్యూటీ సీఎం పవన్ మూడు వాహనాలకు తగ్గించుకున్నారు. మంత్రి లోకేష్ ఏకంగా ఒకే వాహనానికి పరిమితమయ్యారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ కూడా తన కాన్వాయని మూడు వాహనాలకు తగ్గించుకోవడం గమనార్హం. మంత్రులు కూడా అదే దారిలో సాగనున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర క్యాబినెట్లు పూర్తిగా ఈ విధానం అవలంబిస్తుండడంతో ప్రజలు కూడా సొంత వాహనాల వినియోగం తగ్గించుకునే అవకాశం లేకపోలేదు. ప్రజా రవాణాపై దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ సేవలు జూన్ 2 నుంచి ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు రేవంత్ సర్కారు సన్నద్ధమవుతున్నట్లు టాక్.

ఇది కూడా చదవండి.. పెట్రో ధ‌ర‌లు పెరిగిన‌యండోయ్‌.. ఏ ప్రాంతంలో ఎంతెంతో తెలుసుకోండి

PETRO SHOCK | పెట్రో ధ‌ర‌లు పెరిగిన‌యండోయ్‌.. ఏ ప్రాంతంలో ఎంతెంతో తెలుసుకోండి

PETRO SHOCK | ప‌శ్చిమాసియా ప‌రిస్ఠితుల నేప‌థ్యంలో ఇప్ప‌టికే గ్యాస్ ధ‌ర‌లను పెంచిన కేంద్రం తాజాగా పెట్రో వ‌డ్డ‌న చేసింది. లీట‌ర్ పెట్రోల్‌(petrol)పై రూ.3, డీజిల్‌పై రూ. 3చొప్పున పెంచుతూ ఆయిల్ కంపెనీలు ప్ర‌క‌టించాయి. శుక్ర‌వారం ఉద‌యం నుంచే ఈ పెంపుద‌లను అమ‌లులోకి తెచ్చాయి. ఈ ప్ర‌భావం నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌పై ప‌డ‌నున్నాయి. సామాన్యుడి జేబుకు చిల్లు ప‌డ‌నుంది.
మ‌రింత పెరిగే అవ‌కాశం…?
పెట్రో ధ‌ర‌లు మున్ముందు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లుగా నిపుణులు సూచిస్తున్నారు. ఒక్క‌సారిగా భారీగా కాకుండా కొద్దికొద్దిగా పెంచుతూ పోనున్న‌ట్లుగా తెలుస్తోంది. గ‌డిచిన నాలుగేళ్లుగా పెట్రో ధ‌ర‌లు స్థిరంగా ఉండ‌గా తాజా పెంపు ఎంత వ‌ర‌కు వెళుతుందో అని వినియోగ‌దారులు బెంబేలెత్తుతున్నారు.
ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రో ధ‌ర‌లు ఇలా …
హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుతం పెట్రోల్ ధ‌ర రూ.3.39 పెరిగి రూ.110.89కు చేరువైంది. అలాగే డీజిల్ రూ.98.96కు చేరింది. వ‌రంగ‌ల్‌లో పెట్రోల్ రూ.110.53లు, డీజిల్ రూ.98.65లు, కరీంనగర్‌లో రూ.110.55లు, డీజిల్ రూ.98.78ల‌కు చేరువ‌య్య‌యి.

ఇది కూడా చదవండి.. వాళ్లు మామూలు దొంగ‌లు కాదు.. ప్రొఫెష‌న‌ల్ కేటుగాళ్లు.. జీతాలుంటయ‌ట‌.. క‌మీష‌న్లు వ‌స్తయ‌ట!

Professional thieves | వాళ్లు మామూలు దొంగ‌లు కాదు.. ప్రొఫెష‌న‌ల్ కేటుగాళ్లు.. జీతాలుంటయ‌ట‌.. క‌మీష‌న్లు వ‌స్తయ‌ట!

Professional thieves | క‌రీంన‌గ‌ర్‌లోని పీఎంజే (PMJ) జ్యూయ‌ల‌రీలో ఈ నెల 3న చోరీకి పాల్ప‌డిన దొంగ‌లు ఎట్ట‌కేల‌కు దొరికారు. బీహార్‌, వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఈ అంత‌ర్రాష్ట్ర ముఠా వివ‌రాలు వింటే వామ్మో అనాల్సిందే. వీరి నెట్‌వ‌ర్క్ అలా ఉంటుంది మ‌రి. గ్యాంగ్‌లీడ‌ర్‌ సుబోద్‌సింగ్ నేతృత్వంలోనే ఈ భారీ చోరీ చోటు చేసుకుంది. ఐదుగురు దొంగ‌ల్లో ఇద్ద‌రితో పాటు మ‌రొక‌రిని అరెస్టు చేసిన‌ట్లు క‌రీంన‌గ‌ర్ సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. కేసు వివ‌రాల‌ను గురువారం వెల్ల‌డించారు. మొత్తం 161 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు. 112 క్యారెట్ల వజ్రాలు చోరీకి గురి కాగా నిందితుల నుంచి కొంత న‌గ‌దు, ఆభ‌ర‌ణాల‌తో పాటు వాహ‌నాలను స్వాధీనం చేసుకున్న‌ట్లు వివ‌రించారు.
మొత్తం 13 మంది..
ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా మొత్తం 13 మంది పాల్గొన్నారు. ఇందులో జాగీర్‌ సింగ్ (ర‌ఘునాథ్ క‌ర్మాక‌ర్), రావీశ్ కుమార్‌తో పాటు సిమ్‌కార్డులు విక్ర‌యించిన మెహ‌తాఫ్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మ‌రో ముగ్గురు దొంగ‌ల‌తో పాటు ప‌రోక్షంగా భాగ‌స్వాములైన వారి ఆచూకీ ల‌భించాల్సి ఉంది.
రెండు నెలల క్రిత‌మే రాష్రానికి వ‌చ్చి ప్లాన్‌
ఈ దొంగ‌లు రెండు టీంలుగా రెండు నెల‌ల క్రితమే తెలంగాణ‌కు చేరుకున్నారు. ముగ్గురు బీహార్‌, ఇద్ద‌రు ఆసాన్‌సోల్(బెంగాల్‌) నుంచి వ‌చ్చి రెక్కీ నిర్వ‌హించారు. పెద్ద‌ప‌ల్లి, సిద్దిపేట‌, ధ‌ర్మ‌పురి, మంచిర్యాల‌, ఖ‌మ్మం, జ‌గిత్యాల‌, క‌రీంన‌గ‌ర్‌లో నిర్వ‌హించి చివ‌ర‌కు క‌రీంన‌గ‌ర్‌ను ఫైన‌ల్ చేసుకున్నారు. అనుకున్న‌ట్లుగానే 11 నిమిషాల్లో త‌మ ప‌ని కానిచ్చారు. దోచుకున్న న‌గ‌ల‌తో ముందుగా సిద్ధం చేసుకున్న ప్లాన్‌ ప్ర‌కారం రెండు ద్విచ‌క్ర వాహ‌నాల్లో అంత‌ర్గ‌త ర‌హ‌దారుల ద్వారా ధ‌ర్మ‌పురి చేరుకున్నారు. అక్క‌డి నుంచి గోదావ‌రి దాటారు. రెండు టీంలుగా విడిపోయి మ‌హారాష్ట్ర నుంచి బెంగాల్‌కు ప‌రార‌య్యారు.
ముఠా స‌భ్యుల రిక్రూట్ ఇలా..
సుబోద్‌సింగ్ నేతృత్వంలోని ముఠా స‌భ్యుల‌ను ప్ర‌త్యేకంగా రిక్రూట్ చేసుకుంటారు. వీరికి ఆయా టీంల‌ను స‌వ‌న్వ‌య ప‌రుచుకోవ‌డంపై ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇస్తారు. అయితే టీం స‌భ్యుల వివ‌రాలు అంద‌రికీ తెలియ‌వు. నియామ‌కం అయిన‌ వారికి ప్ర‌తినెలా వేత‌నాలు, దొంగిలించే మొత్తంలో ఇన్సెంటివ్ ఇస్తారు.
ఓ యాప్ ద్వారా కోఆర్డినెట్
మ‌హారాష్ట్ర- తెలంగాణ బార్డ‌ర్‌ నుంచి ఈ మొత్తం తతంగం న‌డిపించారు. సాధార‌ణంగా ఉప‌యోగించే ఓ యాప్ ద్వారానే ముఠా సభ్యులు క‌మ్యూనికేట్ చేసుకుంటూ ముందుకు సాగారు.
మూడు టీంలు
ఈ ముఠాలో మొత్తం మూడు టీంలు ఉంటాయి. ప్రధాన టీం రెక్కీతో పాటు ప‌ని కానిచ్చేస్తోంది. రిసీవ‌ర్ పార్టీ.. దొంగిలించిన బంగారంతో పాటు ఆయుధాలు, వాహ‌నాలను స్వాధీనం చేసుకుంటాయి. డిస్పోస‌ల్ టీం స్వాధీనం చేసుకున్న బంగారాన్ని క‌రిగించి నేపాల్‌కు త‌ర‌లించి అమ్మేయ‌డం చేస్తుంది.
ఏడు రాష్ట్రాల్లో..
ఈ ముఠా ఇప్ప‌టి వ‌ర‌కు బిహార్‌, ప‌శ్చిమాబెంగాల్‌, జార్ఖండ్‌, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర, ఉత్త‌రాఖండ్ లో చోరీల‌కు పాల్ప‌డింది. తెలంగాణ‌లో ఈ గ్యాంగ్‌కు ఇదే మొద‌టిది. వీరి లక్ష్యం బ్యాంకులు, బంగారు దుకాణాలు. గ్యాంగ్ లీడ‌ర్ సుబోద్ సింగ్‌కు బంగారు దొంగ (గోల్డెన్ తీఫ్‌)గా పేరుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 400 కిలోల బంగారం చోరీలకు పాల్ప‌డ‌డం గ‌మ‌నార్హం.
అంతా ’11’చుట్టే..
ఈ ఘ‌ట‌న ఆ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు మొద‌లై 11 నిమిషాల పాటు సాగింది. 11 రోజుల తర్వాత పోలీసులు వివ‌రాలు వెల్ల‌డించారు.

ఇది కూడా చదవండి..  ‘బండి’ ఒంట‌రి పోరు.. ఆ లీడ‌ర్లలో సంతోషం!

Bandi Episode | ‘బండి’ ఒంట‌రి పోరు.. ఆ లీడ‌ర్లలో సంతోషం!?

Bandi Episode | కుమారుడి కేసు విష‌యంలో కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌కు పార్టీలో ఆటంకాలు ఎదుర‌వుతున్నాయా.. అంటే అవున‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్(Brs) తో పాటు కాంగ్రెస్ ఇప్ప‌టికే విమ‌ర్శ‌ల దాడి పెంచిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు కార్య‌క‌ర్త‌ల నుంచి బండికి పూర్తి మ‌ద్ద‌తు ల‌భిస్తున్నా సొంత పార్టీ నేత‌లు మాత్రం దూరంగా ఉంటుండ‌డం ఆసక్తికరంగా మారింది.
పొలిటిక‌ల్‌గా టార్గెట్ అయిన సంజ‌య్‌..
గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు తెలంగాణ‌లో పార్టీ అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. పాద‌యాత్ర ద్వారా శ్రేణుల్లో జోష్ పెంచారు. పార్టీని అన్నీ తానై ముందుకు న‌డిపారు. ఒక ద‌శ‌లో బిజెపి(bjp) రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తుందా అనే చ‌ర్చ సైతం సాగింది. అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో అధిష్టానం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. బండిని రాష్ట్ర బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి జాతీయ కార్య‌వ‌ర్గంలోకి తీసుకుంది. దీనిపై సంజ‌య్ అప్ప‌ట్లో నారాజ్ అయ్యారు. ఈ క్ర‌మంలో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన వెంటనే ఆయనకు కేబినెట్‌లో చోటు క‌ల్పించింది. రానున్న రోజుల్లో మ‌రోసారి రాష్ట్ర అధ్యక్ష ప‌ద‌వి దక్కనుందనే ప్రచార నేపథ్యంలో తాజాగా ఆయన కుమారుడు భ‌గీర‌థ్ పై కేసు తెర‌పైకి వచ్చింది. ఇది రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
విపక్షాల రచ్చ
“మైన‌ర్‌”పై కేసు అంశం తెరపైకి రాగానే బీఆర్ఎస్ అటాక్ ప్రారంభించింది. ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ పూర్తిగా రంగ‌లోకి దిగి బండిని టార్గెట్ చేశారు. గులాబీ శ్రేణులు ఈ అంశాన్ని ప్రాధాన్యంగా భావించి సోషల్ మీడియాలో హోరెత్తించాయి. నైతిక బాధ్య‌త వ‌హిస్తూ బండి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశాయి.రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ వారి మ‌ధ్య చీక‌టి ఒప్పందమ‌నే ఆరోప‌ణలు చేశాయి. ఈ క్ర‌మంలో సీఎం రంగంలోకి దిగి డీజీపీని ఆదేశించ‌డంతో సిట్ ఏర్పాటైంది. ఒక్క‌సారిగా కాంగ్రెస్ కూడా విమ‌ర్శ‌ల దాడి పెంచింది. ఓవైపు విప‌క్షాలు విమ‌ర్శ‌లు సంధిస్తున్న వేళ అండ‌గా నిల‌వాల్సిన క‌మలం పార్టీ కీల‌క నేత‌లు మౌనం వహించడంతో సంజ‌య్ ఒంట‌రైన‌ట్లుగా తెలుస్తోంది. హైద‌రాబాద్‌లో ప్ర‌ధాని స‌భ‌లో, క‌రీంన‌గ‌ర్ ఏక్తా యాత్ర‌లో కార్య‌కర్త‌ల నుంచి ఆయ‌న‌కు మద్ద‌తు ల‌భించినా నేత‌ల నుంచి స్పంద‌న క‌రువ‌వ‌డం ఆస‌క్తి క‌లిగిస్తోంది.
ఆస‌క్తిక‌రంగా వైరి వ‌ర్గం తీరు..
గతంలో బండిపై అధిష్టానం వ‌ద్ద ఫిర్యాదుల‌తో పాటు లేఖాస్త్రాలు సంధించిన క‌మలం నేత‌లు ఈ అంశాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకుంటున్న‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే వారు మౌనం వ‌హిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రోవైపు అధిష్టానం కూడా ఈ అంశంపై ఆచీతూచి వ్య‌వ‌హ‌రిస్త‌న్న‌ట్లుగా స‌మాచారం. పార్టీ డ్యామేజ్ కాకుండా అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌పై దృష్టి సారిస్తున్న‌ట్లుగా పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. మ‌రోవైపు త‌న కొడుకు భ‌గీర‌థ్ అమాయ‌కుడ‌ని, కావాల‌నే కొంద‌రు క‌ట్ర ప‌న్నార‌ని సంజ‌య్‌ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌ వేళ త‌ప్పు చేస్తే శిక్షకు అర్హుడే అంటూ ఆయ‌న పేర్కొంటుండం గ‌మ‌నార్హం. మొత్తంగా బండి ఎపిసోడ్‌ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఒక్క‌సారిగా హీట్ పెంచిన‌ట్ల‌యింది.

ఇది కూడా చ‌ద‌వండి..  నీట్ ఒక్క‌టేనా.. ర‌ద్దు జాబితాలో ఇంకా ఏమైనా ఉన్నాయా..

NEET UPDATE | నీట్ ఒక్క‌టేనా.. ర‌ద్దు జాబితాలో ఇంకా ఏమైనా ఉన్నాయా.. ?

NEET UPDATE | ఈనెల 3న దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించిన నీట్ (NEET- 2026) ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఎన్‌టీఏ (నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ) మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. పేప‌ర్ లీకైన‌ట్లుగా గుర్తించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. అయితే ప‌రీక్ష రాసిన 22 ల‌క్ష‌ల మంది విద్యార్థులు 24 గంట‌లు గ‌డిచినా ఇంకా షాక్ నుంచి కోలుకోలేని ప‌రిస్థితి. ఎవ‌రో.. ఎక్క‌డో చేసిన త‌ప్పుకు తాము బ‌లికావాలా అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఎన్‌టీఏ ఇటీవ‌ల నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌పై కూడా తాజాగా అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

  • ఎన్‌టీఏ నిర్వ‌హించే ప‌రీక్ష‌లు..
    ఎంబీబీఎస్, బీడీఎస్‌, ఆయూష్ కోర్సులకు సంబంధించిన‌ ప్ర‌వేశం కోసం.. NEET UG (National Eligibility cum Entrance Test – Under graduate)
    ఇంజనీరింగ్ విభాగంలో బీఈ/ బీటెక్‌, ఆర్కిటెక్చర్, ప్లానింగ్‌లో ప్రవేశం కోసం.. JEE (Main) (Joint Entrance Examination)
    కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇతర విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సుల కోసం..CUET UG (Common University Entrance Test Undergraduate). అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలలో ప్రవేశం కోసం..CUET PG (Common University Entrance Test)
    విశ్వవిద్యాలయాలు/కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం.. UGC NET (National Eligibility Test)
    సైన్స్ సబ్జెక్టులలో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం…CSIR-UGC NET
    ఎంబీఏ (MBA/PGDM) కోర్సుల్లో ప్రవేశం కోసం…CMAT (Common Management Admission Test)
    ఫార్మసీ (M.Pharma) కోర్సుల కోసం…GPAT (Graduate Pharmacy Aptitude Test)
    హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం కోసం…NCHM JEE (Hotel Management)
    ఆయుష్ పీజీ కోర్సుల కోసం… AIAPGET (All India AYUSH Post Graduate Entrance Test)
    ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP) కోసం…NCET (National Common Entrance Test)

సీబీఐ రంగంలోకి..
నీట్ ర‌ద్దు నేప‌థ్య‌లో పూర్తి స్థాయిలో విచార‌ణ చేప‌ట్టాల‌ని భావించిన కేంద్రం సీబీఐని ఆదేశించింది. రంగంలోకి దిగిన సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ అన్ని కోణాల్లో విచార‌ణ చేప‌డుతోంది. మ‌రోవైపు ఎన్‌టీఏ ఇటీవ‌ల నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌పై కూడా ఆరా తీస్తున్న‌ట్లు స‌మాచారం.
రీ ఎగ్జామ్‌కు స‌న్నాహాలు..
పునః ప‌రీక్ష కోసం విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేయ‌న‌వ‌స‌రం లేద‌ని, అలాగే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన ప‌ని లేద‌ని ఎన్‌టీఏ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లోనే ప‌రీక్ష తేదీల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించింది. మ‌రోవైపు ఎవ‌రో చేసిన త‌ప్పున‌కు అంద‌రినీ ఎలా బ‌లి చేస్తార‌ని విద్యార్థులు, స్టూడెంట్ యూనియ‌న్లు మండి ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే కొంద‌రు దేశ అత్య‌న్న‌త న్యాయ‌స్థానం త‌లుపు కూడా త‌ట్టారు. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టు నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

ఇది కూడా చదవండి.. 46 నుంచి 34.. ! వ‌యోప‌రిమితిపై నిరుద్యోగుల్లో మండిపాటు

kondagattu temple | అంజ‌న్న దారిలో..

kondagattu temple | చేతిలో జెండా.. త‌ల‌పై పాగా.. ఒక‌రి వెన‌క ఒక‌రుగా దీక్షా ప‌రులతో ఆ దారి కాషాయ‌మ‌యంగా మారింది. అడుగడుగునా అంజ‌న్న‌నామ‌స్మ‌ర‌ణ మారుమోగింది. మండే ఎండ‌లో వంద‌ల కిలోమీట‌ర్ల ఆ పాద‌యాత్ర సోమ‌వారం నుంచే కొండ‌గ‌ట్టు(Kondagattu)కు చేరువైంది. జై హ‌నుమాన్‌ అంటూ కాలిన‌డ‌క‌న చేరుకున్న స్వాముల‌తో అంజ‌న్న క్షేత్రం పుల‌కించింది. మంగ‌ళ‌వారం భ‌క్త‌జ‌న సంద్రంగా మారింది.
లక్ష‌లాదిగా భ‌క్తులు
ఈ ఏడాది పెద్ద హ‌నుమాన్ జ‌యంతి మంగ‌ళ‌వారం క‌లిసి రావ‌డంతో భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. మాలాధార‌ణ స్వాములు ఒక రోజు ముందుగానే చేరుకున్నారు. దీక్ష విర‌మ‌ణ చేసి అర్ధ‌రాత్రి నుంచే ద‌ర్శ‌నానికి బారులు తీరారు. క‌ల్యాణ క‌ట్ట‌, కోనేరుప్రాంతం భ‌క్తుల‌తో కిక్కిరిసి పోయింది. కాలిన‌డ‌క‌న వ‌చ్చిన వారు మ‌ళ్లీ గంట‌ల త‌ర‌బ‌డి క్యూలో నిల్చొని ఇబ్బందులు ప‌డ్డారు. వారికి నేరుగా ద‌ర్శ‌నం క‌లిపించాల‌ని భ‌క్తులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు.
ఐదు చోట్ల పార్కింగ్ స్థ‌లాలు..
భ‌క్తుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఈ సారి పోలీసులు ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టారు. జేఎన్‌టీయూ మార్గంలోఐదు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. రెండు కిలోమీట‌ర్ల ముందే వాహ‌నాల‌ను నిలిపివేశారు. అక్క‌డి నుంచి భ‌క్తుల కోసం ఉచిత బ‌స్సు స‌దుపాయం క‌ల్పించారు.
కిక్కిరిసిన ప్ర‌సాద కౌంట‌ర్లు
విరామం లేకుండా ప్ర‌సాద కౌంట‌ర్లు భ‌క్తుల‌తో కిక్కిరిసి ద‌ర్శ‌న‌మిచ్చాయి. ప‌లువురు దాత‌లు మ‌జ్జిగ పంపిణీ చేయ‌గా.. ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో అన్న‌దానం సైతం కొన‌సాగించారు.

ఇది కూడా చదవండి..  ముందుంది సంక్షోభం.. జాగ్ర‌త్త అంటున్న‌ ప్ర‌ధాని.. అస‌లు మోదీ ఏమ‌న్నారు

MODI COMMENT | ముందుంది సంక్షోభం.. జాగ్ర‌త్త అంటున్న‌ ప్ర‌ధాని.. అస‌లు మోదీ ఏమ‌న్నారు

MODI COMMENT | ప‌శ్చిమాసియాలో చోటు చేసుకున్న ప‌రిస్థితుల‌ నేప‌థ్యంలో దేశంలో క‌రోనా వంటి సంక్షోభం పొంచి ఉంది.. ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. దుబారాను అరిక‌ట్టాలి.. దేశ శ్రేయ‌స్సు దృష్ట్యా త్యాగాల‌కు సిద్ధం కావాలి.. అంటూ హైద‌రాబాద్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ధాన‌మంత్రి మోదీ(modi) దీని నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే దేశ‌ప్ర‌జలంతా స‌మ‌ష్టిగా ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.
ప్ర‌ధాని వ్యాఖ్య‌ల వెన‌క ఆంత‌ర్యం..
హైద‌రాబాద్‌లో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మోదీ కేవ‌లం రాజ‌కీయ అంశాలే కాదు.. దేశంలో పొంచి ఉన్న‌ సంక్షోభ ప‌రిస్థితుల‌ను ప్ర‌స్తావించారు. అధిగ‌మించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా ముందుకు రావాల‌ని సూచించారు.

  • అంత‌ర్జాతీయంగా పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహ‌నాల‌తో పాటు ప్ర‌జా ర‌వాణాపై దృష్టి సారించ‌డం శ్రేయ‌స్క‌ర‌మ‌ని పేర్కొన్నారు. మెట్రోలో ప్ర‌యాణించాల‌ని హిత‌వు ప‌లికారు.
  • క‌రోనా స‌మ‌యంలో చేప‌ట్టిన‌ వర్క్ ఫ్రం హోమ్‌పై కంపెనీలు మ‌రోసారి ఫోక‌స్ చేయాల‌ని, వర్చువల్ మీటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సూచించారు.
  • విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయ‌డం అత్య‌వ‌స‌ర‌మ‌ని.. ఇందులో భాగంగా ఏడాది పాటు విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాల‌ని ఆడంబ‌రాల‌కు దూరంగా ఉండాల‌ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
  • వంట నూనె వినియోగాన్నికూడా తగ్గించాలని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల ఆరోగ్యానికి సైతం మంచిదని ఆయన పేర్కొన్నారు.
  • బంగారం విష‌యంపై చేసిన వ్యాఖ్య ఆస‌క్తిక‌రంగా మారంది. కనీసం ఏడాది పాటు గోల్డ్ కొనుగోలుకు దూరంగా ఉండాలని సూచించారు.
  • దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డ‌కుండా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
    రైతులు సోలార్ విద్యుత్ పై దృష్టి సారించాల‌ని.. అలాగే ర‌సాయ‌న ఎరువుల వాడ‌కం త‌గ్గించాల‌ని, సేంద్రియ సాగుపై ఫోక‌స్ పెంచాల‌న్నారు. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినా ఆ భారం రైతులపై పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రతీ సంక్షోభాన్ని ఓ స‌వాలుగా స్వీక‌రించాల‌న్నారు. కోవిడ్ స‌మ‌యంలో చూపిన ఐక్యతను మ‌రోసారి చాటాల‌ని ప్రధాని దేశ ప్రజలను కోరారు.
    మొద‌లైన చ‌ర్చ‌
    అప్పుడే ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా చర్చ మొద‌లైంది. రానున్న సంక్షోభ ప‌రిస్థితుల‌ను అధిగ‌మించేందుకు మోడీ సూచ‌న‌ల‌ను ప్ర‌జ‌లు ఏ మేర‌కు పాటిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.
  • ఇది కూడా చదవండి.. 46 నుంచి 34.. ! త‌గ్గిన వ‌యోప‌రిమితిపై నిరుద్యోగుల్లో మండిపాటు