NEET UPDATE | ఈనెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ (NEET- 2026) రద్దు చేస్తున్నట్లు ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) మంగళవారం ప్రకటించింది. పేపర్ లీకైనట్లుగా గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే పరీక్ష రాసిన 22 లక్షల మంది విద్యార్థులు 24 గంటలు గడిచినా ఇంకా షాక్ నుంచి కోలుకోలేని పరిస్థితి. ఎవరో.. ఎక్కడో చేసిన తప్పుకు తాము బలికావాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్‌టీఏ ఇటీవల నిర్వహించిన పరీక్షలపై కూడా తాజాగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
- ఎన్‌టీఏ నిర్వహించే పరీక్షలు..
ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయూష్ కోర్సులకు సంబంధించిన ప్రవేశం కోసం.. NEET UG (National Eligibility cum Entrance Test – Under graduate)
ఇంజనీరింగ్ విభాగంలో బీఈ/ బీటెక్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్‌లో ప్రవేశం కోసం.. JEE (Main) (Joint Entrance Examination)
కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇతర విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సుల కోసం..CUET UG (Common University Entrance Test Undergraduate). అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలలో ప్రవేశం కోసం..CUET PG (Common University Entrance Test)
విశ్వవిద్యాలయాలు/కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం.. UGC NET (National Eligibility Test)
సైన్స్ సబ్జెక్టులలో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం…CSIR-UGC NET
ఎంబీఏ (MBA/PGDM) కోర్సుల్లో ప్రవేశం కోసం…CMAT (Common Management Admission Test)
ఫార్మసీ (M.Pharma) కోర్సుల కోసం…GPAT (Graduate Pharmacy Aptitude Test)
హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం కోసం…NCHM JEE (Hotel Management)
ఆయుష్ పీజీ కోర్సుల కోసం… AIAPGET (All India AYUSH Post Graduate Entrance Test)
ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP) కోసం…NCET (National Common Entrance Test)
సీబీఐ రంగంలోకి..
నీట్ రద్దు నేపథ్యలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని భావించిన కేంద్రం సీబీఐని ఆదేశించింది. రంగంలోకి దిగిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల్లో విచారణ చేపడుతోంది. మరోవైపు ఎన్‌టీఏ ఇటీవల నిర్వహించిన పరీక్షలపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
రీ ఎగ్జామ్‌కు సన్నాహాలు..
పునః పరీక్ష కోసం విద్యార్థులు దరఖాస్తు చేయనవసరం లేదని, అలాగే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదని ఎన్‌టీఏ ఇప్పటికే ప్రకటించింది. త్వరలోనే పరీక్ష తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. మరోవైపు ఎవరో చేసిన తప్పునకు అందరినీ ఎలా బలి చేస్తారని విద్యార్థులు, స్టూడెంట్ యూనియన్లు మండి పడుతున్నాయి. ఇప్పటికే కొందరు దేశ అత్యన్నత న్యాయస్థానం తలుపు కూడా తట్టారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి.. 46 నుంచి 34.. ! వయోపరిమితిపై నిరుద్యోగుల్లో మండిపాటు




