Thirumala information | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం మొత్తం 74,096 మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనం కోసం కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయాయి. సర్వదర్శనం భక్తులకు దాదాపు 24గంటల సమయం పడుతుంది. ఇక రూ.300 ల శీఘ్రదర్శనంకు 4-6గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ భక్తులకు సుమారు 7 గంటల వరకు సమయం పడుతుంది.
పుష్ప పల్లకీపై శ్రీ భూ సమేత మలయప్పస్వామివారి వైభవం
ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా విహరిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు.


