Sunday, May 17, 2026
spot_img

Vijay special | ఆ సీఎం డిఫ‌రెంట్‌.. లంచ్ బాక్స్‌తో ఆఫీస్‌కు!

Vijay special | ముఖ్య‌మంత్రి అంటే ఎప్పుడో ఓ సారి స‌చివాల‌యం వ‌స్తుండ‌డం చూసుంటాం.. అదీ వారి ఇష్ట‌మైన టైంలో.. కానీ ఈ సీఎం మాత్రం డిఫ‌రెంట్‌.. కాదు కాదు ..సంథింగ్ స్పెష‌ల్‌. అంద‌రి కంటే ముందుగానే ఆఫీస్ చేరుకుంటున్నారు. ఉన్న‌తాధికారుల‌నూ స‌మ‌య పాల‌న పాటించేలా చేస్తున్నారు. అంతేకాదండోయ్‌.. లంచ్ బాక్స్‌తో ఇన్‌టైంలో కార్యాల‌యానికి రీచ్ అవుతున్నారు. ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఆయ‌న ఎవ‌రో ఇప్ప‌టికే మీకు గుర్తొచ్చి ఉండాలే.. అవునండీ ఆయ‌నే త‌మిళ‌నాడు న్యూ చీఫ్ మినిస్ట‌ర్ జోస‌ఫ్ విజ‌య్‌(Vijay) .
తెర‌పైనే కాదు.. రియ‌ల్ హీరో లా..
సినీరంగం నుంచి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన ఈ ద‌ళ‌ప‌తి పార్టీ పెట్టిన‌ రెండేళ్ల‌లోనే ఎన్నిక‌ల్లో విజిలేసి ‘విజ‌య‌’ మోత మోగించారు. సంచ‌ల‌న ఫ‌లితాల‌తో ప్ర‌భంజ‌నం సృష్టించారు. మ‌హామ‌హుల‌ను మ‌ట్టి క‌రిపించి ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించారు. ఆ వెంట‌నే త‌న మార్కు పాల‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. తెరపైనే కాదు.. రియ‌ల్ హీరోగా త‌న ముద్ర ఉండేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై ఫోక‌స్‌
ప్ర‌ధానంగా తానిచ్చిన హామీల అమ‌లుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితుల‌పై ఫోక‌స్ పెంచారు. ఆయా రంగాల్లో లోటుపాట్ల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. అప్పుల‌ను చూసి అధైర్య ప‌డ‌కుండా నిధుల‌ స‌మీక‌ర‌ణను అన్వేషిస్తున్నారు . ఆయా రంగాల నిపుణుల‌తో పాటు సీనియ‌ర్ ఐఏఎస్‌ల‌తో నిత్యం స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. పాల‌న‌ను గాడిలో పెట్ట‌డంతో పాటు అక్ర‌మార్కుల భ‌ర‌తం ప‌ట్టేలా సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ప్ర‌మాణ స్వీకారం పూర్తికాగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మ‌హిళా భ‌ద్ర‌త‌, డ్ర‌గ్స్‌కు వ్య‌తిరేకంగా ఈగ‌ల్ త‌ర‌హా వ్య‌వ‌స్థ‌పై మూడు సంత‌కాలు చేసి త‌న చిత్త‌శుద్ధిని చాటారు. తాజాగా రాష్ట్ర‌వ్యాప్తంగా పాఠ‌శాల‌లు, ఆల‌యాల ప‌క్కన ఉన్న 717 మ‌ద్యం దుకాణాల మూసివేత‌కు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.
సీఎం కూడా ఉద్యోగే అనేలా..
ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆయ‌న ఓ ఉద్యోగిలా మారారు. రోజూ పావుగంట ముందే స‌చివాల‌యానికి చేరుకుంటున్నారు. త‌న‌ వ్య‌వ‌హార‌శైలితో ఉన్న‌తాధికారుల‌ను స‌మ‌య‌పాల‌న పాటించేలా చేస్తున్నారు. అంతేకాకుండా రోజూ ఇంటి నుంచి లంచ్ బాక్స్‌తో హాజ‌ర‌వుతున్నారు. మ‌ధ్యాహ్నం త‌న చాంబ‌ర్‌లోనే తినేసి త‌ర్వాత ప‌నిలో నిమ‌గ్న‌మ‌వుతున్నారు. విజ‌య్ నిరాడంబత‌పై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మవుతుండ‌గా.. ముఖ్య‌మంత్రి అంటే ఇలానే ఉండాలే అంటూ సోష‌ల్ మీడియాలోనూ ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. నిజ‌మే కదా.. పాల‌కుడిగా కాకుండా సేవ‌కుడిగా ఉంటేనే ప్ర‌జ‌లకు మేలు జ‌రుగుతుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం.

ఇది కూడా చ‌ద‌వండి.. ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వర్క్ ఫ్రం హోం షురూ..

spot_img

Hot Topics

Related Articles