Monday, July 27, 2026
Home Blog

civils coaching | సివిల్స్‌కు ఉచిత శిక్ష‌ణ.. ఇప్పుడే ద‌ర‌ఖాస్తు చేసుకోండి

civils coaching | తెలంగాణ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సివిల్స్–2027(ప్రిలిమ్స్–కమ్–మెయిన్స్) ఉచిత శిక్షణకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కేంద్రం సిద్దిపేట‌ డైరెక్టర్ డాక్టర్ పి. కృష్ణ‌ద‌యాసాగ‌ర్ శ‌నివారం ఒక ప్రకటనలో తెలిపారు. వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కేంద్రం, హైదరాబాద్ వారి నేతృత్వంలో నిర్వ‌హించే శిక్ష‌ణ‌కు ఏదైనా డిగ్రీ అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ,ఈబీసీ నిరుద్యోగులు అర్హుల‌ని పేర్కొన్నారు. అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి అయితే రూ. 1.50ల‌క్ష‌ల‌ లోపు, పట్ట‌ణ ప్రాంతాల వారికి అయితే రూ. 2ల‌క్ష‌ల‌ లోపు ఉండాలి. ఆస‌క్తి, అర్హులైన జిల్లాకు చెందిన యువత ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న అభ్యర్ధులు, ఏదైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారు, బీసీ స్టడీ సర్కిల్లో ఇంతకు ముందు శిక్షణ పొందిన వారు ఈ శిక్షణ కు అర్హులు కారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఆగ‌స్టు 7 తుదిగ‌డువు. ఆగస్టు 16న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. అదే నెల 19న ఫలితాలు ప్ర‌క‌టిస్తారు. ఆగస్టు 21న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ పరిశీలన ఉంటుంది. ఆగస్టు 24 నుంచి మొత్తం 150 మందికి హైదరాబాద్లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. ఎంపికైన వారికి నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్, పుస్తకాల కోసం మరో రూ.5 వేలు ఇవ్వ‌నున్న‌ట్లు డైరెక్ట‌ర్ తెలిపారు. మరిన్ని వివరాలకు 040-24071178, 7780359322 నంబర్ లో లేదా బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఆఫీస్ వేళల్లో నేరుగా సంప్రదించాలని సూచించారు.

రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్ధులు సంప్రదించవలసిన వెబ్ సైట్ : www.tgbcstudycircles.cgg.gov.in

ఇది కూడా చ‌ద‌వండి.. ఎల‌క్ష‌న్స్‌కు స‌న్న‌ద్ధం.. శ్రేణుల‌కు దిశానిర్దేశం

Thirumala information | తిరుమల సమాచారం (18.07.2026 )

Thirumala information |  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్ర‌వారం మొత్తం 74,096 మంది స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఉచిత‌ దర్శనం కోసం కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయాయి. సర్వదర్శనం భక్తులకు దాదాపు 24గంటల సమయం పడుతుంది. ఇక రూ.300 ల‌ శీఘ్రదర్శనంకు 4-6గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ భక్తులకు సుమారు 7 గంటల వ‌ర‌కు సమయం పడుతుంది.
పుష్ప పల్లకీపై శ్రీ భూ సమేత మలయప్పస్వామివారి వైభవం
ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా విహరిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు.

Thirumala information | తిరుమల సమాచారం (17.07.2026 )

Thirumala information | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం పూర్తిస్థాయిలో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. ఉదయం 8 తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు దాదాపు 24-30 గంటల సమయం పడుతుంది. ఇక రూ.300 ల‌ శీఘ్రదర్శనంకు 3–5 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ భక్తులకు సుమారు 5 నుంచి 7 గంటల సమయం పడుతుంది.
గురువారం..
స్వామివారిని 63,556 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భ‌క్తుల సంఖ్య 35,900 మంది. హుండీ ద్వారా స‌మ‌కూరిన ఆదాయం రూ.5.31 కోట్లు. మొత్తం లడ్డూల విక్ర‌యాలు 4.12 లక్షలు.
17 నుంచి సాక్షాత్కార వైభవోత్సవాలు..
ఈనెల‌17 నుంచి 19వరకు జరగనున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాల సందర్భంగా శ్రీనివాసమంగాపురంలోని ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు.
మూడు రోజుల పాటు దివ్య వాహన సేవలు
ఉత్స‌వాల్లో భాగంగా 17న పెద్దశేష వాహనం, 18న హనుమంత వాహనం, 19న గరుడ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించనున్నారు.
స్వామివారికి పరదాల విరాళం
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా తిరుపతికి చెందిన భక్తుడు శ్రీ నరసింహులు స్వామివారికి పరదాలను విరాళంగా సమర్పించారు. ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపీనాథ్ పాల్గొన్నారు.
ఇది కూడా చ‌ద‌వండి.. మ‌హువాకు వాహ్‌వా అనాల్సిందే..

 

Singareni | కార్మికుల విజయమిది…

0
  • హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ పోరాటంతోనే సింగరేణిలో మెడికల్ బోర్డు
  • తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

Singareni | సింగరేణి లో డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఈనెల 17, 18 తేదీల్లో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం కార్మికుల విజయమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన గాంధేయమార్గంలో జరిపిన పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చిందనిఎక్స్ లో పోస్ట్ చేశారు. ఐతే తాత్కాలికంగా మాత్రమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయటం కాకుండా కచ్చితంగా నెలకొకసారి మెడికల్ బోర్డు నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల చట్టబద్ధమైన హక్కు అని చెప్పారు. వేలాది మంది కార్మికులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇన్నాళ్లు ప్రభుత్వం పట్టించుకోకపోవడం కారణంగా వారంతా తీవ్ర మనో వేదనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెలా తప్పనిసరిగా మెడికల్ బోర్డు ఏర్పాటు తో పాటు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్‌ఫిట్ చేయాలన్నారు.
బోనాల పండుగ శుభాకాంక్షలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. హైదరాబాద్ నగర ప్రజల ఐక్యతకు చిహ్నమైన ఆషాఢ బోనాల ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు కవిత. ఆ జగన్మాత కరుణా కటాక్షాలు మనందరిపై నిండుగా ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఇది కూడా చ‌ద‌వండి.. సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Civils coaching | సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Civils coaching | తెలంగాణ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సివిల్స్–2027(ప్రిలిమ్స్–కమ్–మెయిన్స్) ఉచిత శిక్షణకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కేంద్రం కరీంనగర్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కేంద్రం, హైదరాబాద్ వారి నేతృత్వంలో నిర్వ‌హించే శిక్ష‌ణ‌కు ఏదైనా డిగ్రీ అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ,ఈబీసీ నిరుద్యోగులు అర్హుల‌ని పేర్కొన్నారు. అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి అయితే రూ. 1.50ల‌క్ష‌ల‌ లోపు, పట్ట‌ణ ప్రాంతాల వారికి అయితే రూ. 2ల‌క్ష‌ల‌ లోపు ఉండాలి. ఆస‌క్తి క‌ల కరీంనగర్‌, జ‌గిత్యాల, పెద్దపల్లి జిల్లాల‌కు చెందిన యువత ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న అభ్యర్ధులు, ఏదైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారు, బీసీ స్టడీ సర్కిల్లో ఇంతకు ముందు శిక్షణ పొందిన వారు ఈ శిక్షణ కు అర్హులు కారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఆగ‌స్టు 7 తుదిగ‌డువు. ఆగస్టు 16న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. అదే నెల 19న ఫలితాలు ప్ర‌క‌టిస్తారు. ఆగస్టు 21న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ పరిశీలన ఉంటుంది. ఆగస్టు 24 నుంచి మొత్తం 150 మందికి హైదరాబాద్లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. ఎంపికైన వారికి నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్, పుస్తకాల కోసం మరో రూ.5 వేలు ఇవ్వ‌నున్న‌ట్లు డైరెక్ట‌ర్ తెలిపారు. మరిన్ని వివరాలకు 040-24071178, 7780359322 నంబర్ లో లేదా బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఆఫీస్ వేళల్లో నేరుగా సంప్రదించాలని సూచించారు.

రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్ధులు సంప్రదించవలసిన వెబ్ సైట్ : www.tgbcstudycircles.cgg.gov.in

ఇది కూడా చ‌ద‌వండి.. ఎల‌క్షన్‌కు సన్నద్ధం.. కేడ‌ర్‌కు దిశానిర్దేశం

Thirumala & Gold | స‌మాచారం ( 16.07.2026)

0

తిరుమలలో ప‌రిస్థితి

Thirumala & Gold | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం ఉదయం 8 తరువాత వెళ్లే భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతుంది. రూ.300ల శీఘ్రదర్శనానికి 3-5 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 5 నుంచి 7 గంటల సమయం పడుతుంది.
బుధ‌వారం .. స్వామివారిని 82,255 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.76 కోట్లు ఆదాయం స‌మ‌కూరింది. 4.43 లక్షల ల‌డ్డూలను విక్ర‌యించారు. ఇక అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య 2.64 లక్షలు.

బంగారం, వెండి ధ‌ర‌లు
ప్ర‌స్తుతం ఆషాడం నేప‌థ్యంలో బంగారం, వెండి ధ‌ర‌ల్లో స్వ‌ల్ప మార్పులు మాత్రమే చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు (16 జూలై) హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.1,43,580 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల ధ‌ర ప‌రిశీలిస్తే రూ.1,31,610గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ. 10 మాత్ర‌మే పెరిగింది. అలాగే 18 క్యారెట్ల‌ను ప‌రిశీలిస్తే రూ.1,07,470గా ఉన్న‌ది. ఇక వెండి కిలో ధర రూ.2,40,100గా ఉంది.

ఇది కూడా చ‌ద‌వండి… ఎల‌క్షన్‌కు సన్నద్ధం.. కేడ‌ర్‌కు దిశానిర్దేశం

TG politics | ఎల‌క్షన్‌కు సన్నద్ధం.. కేడ‌ర్‌కు దిశానిర్దేశం

  • గ్రేట‌ర్‌ను సెమీఫైన‌ల్‌గా భావిస్తున్న పార్టీలు
  • తెలంగాణ‌లో ఆస‌క్తిక‌రంగా రాజ‌కీయాలు
  • TG politics | రాష్ట్రంలో ఎలక్షన్ మూడ్ వచ్చేస్తోంది. రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకుంటున్నాయి. కేడర్‌ను సమాయత్తం చేయడంపై ఫోకస్ పెంచాయి. అధికార కాంగ్రెస్ (congress) మరోసారి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఈ సారి విజయం తమదే అంటూ ప్రతిపక్షాలూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
  • సగం పీరియడ్‌ కంప్లీట్‌..
    రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటింది. సగం పీరియడ్‌ గడిచింది. ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఆయా పార్టీలన్నీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికలెప్పుడొచ్చినా రెడీ అంటున్నాయి. త్వరలోనే ‘గ్రేటర్‌’ ఉండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. వాటిని సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి. అందులో సత్తా చాటేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఫలితాలే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్‌గా ఉంటాయని భావిస్తున్నాయి.
  • పై ‘చేయి’ సాధించేలా..
    పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార కాంగ్రెస్‌ రానున్న గ్రేటర్‌ పోరులోనూ పైచేయి సాధించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ఇన్‌చార్జీల నియామకంపై దృష్టి సారించింది. గ్రేటర్‌ పరిధిలో ‘హస్తం’ పార్టీకి ఎక్కువగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు లేకపోవడం కొంత మైనస్‌. అయితే సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఎలాగైనా గెలిచి గ్రేటర్‌లో పాగా వేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు శ్రేణులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మూసీ సుందరీకరణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్‌లో సత్తా చాటి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ మూడు రంగుల జెండాను రెపరెపలాడిస్తామన్న ధీమాను హైకమాండ్‌లో కలిగించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దాదాపు అన్ని సభల్లో సీఎం 2034 వరకు కాంగ్రెస్‌దే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
  • స్పీడ్ పెంచిన ‘కారు’
    గత ఎన్నికల్లో ఓట్లు సాధించినా.. స్వల్ప తేడా సీట్లతో ఓటమిపాలై హాట్రిక్‌ విజయాన్ని చేజార్చుకున్న బీఆర్‌ఎస్‌(BRS) ఈ సారి ఎలాగైనా గెలుపొందాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన హరీశ్‌రావు క్షేత్రస్థాయిలోనే ఎక్కువగా ఉంటున్నారు. ప్రజాసమస్యలపై ఫోకస్‌ పెడుతూ కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. ఇటీవల సింగరేణిలో బొగ్గు మాయం, కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు హామీల అమలు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతారని, అలాగే వచ్చే ఏడాది కేటీఆర్‌ పాదయాత్ర ఉంటుందని ఆ పార్టీ నుంచి వినిపిస్తోంది. ఇక తెలంగాణ ఆవిర్భావం నుంచి గ్రేటర్‌లో రెండు సార్లు సత్తా చాటిన గులాబీ పార్టీ ఈ సారి హ్యాట్రిక్‌పై కన్నేసింది. ప్రస్తుతం ఈ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల్లో ఎక్కువగా ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కావడం కారు పార్టీకి కలిసివచ్చే అంశం.
  • ‘కమలం ‘ వికాస‌మే ల‌క్ష్యంగా..
    దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీ(BJP) తెలంగాణపై ఫోకస్‌ పెంచింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్‌లో సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవ‌ల‌ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ రాష్ట్రంలో పర్యటించారు. శ్రేణుల్లో జోష్‌ నింపారు. గ్రేటర్‌లో సత్తా చాటాలని సూచించారు. అంతేకాదు పార్టీలో గ్రూపు తగాదాలపై దృష్టి సారించిన హైకమాండ్ నేతల మధ్య సమన్వయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఎన్నికల వరకు ప్రతి మూడు నెలలకో జాతీయ నేతలు ఒకరు రాష్ట్రంలో పర్యటిస్తారని కమలం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
  • ‘పతంగి’ మ‌రింత ఎగిరేలా..
    గ్రేటర్‌లో కీలకంగా ఉన్న AIMIM పార్టీకి ఎమ్మెల్యేలతో పాటు సాలిడ్‌ ఓటు బ్యాంకు ఉంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దాదాపు 30శాతం సీట్లను కైవసం చేసుకున్న ఆ పార్టీ ఈసారి కూడా అదే ఫలితాలు సాధించేలా ముందుకు సాగుతుంది. ఈ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలంతా గ్రేటర్‌ పరిధిలోని వారు కావడం పతంగి పార్టీకి కలిసివచ్చే అవకాశం. మరోవైపు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న ఈ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు శ్రేణులను ఆ పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ సన్నద్ధం చేస్తున్నట్లు సమాచారం.
  • క‌విత‌కు.. టీఆర్‌ఎస్ క‌లిసొచ్చేనా..
    బీఆర్‌ఎస్‌ నుంచి విభేదించిన ఆ పార్టీ చీఫ్‌ కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన(TRS) పేరిట రాష్ట్రంలో కొత్త పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో పర్యటించారు. తాజాగా బొగ్గుబాయి బాట పేరిట సింగరేణిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఉత్తర తెలంగాణలో ఎక్కువ నియోజకవర్గాల్లో విస్తరించిన కోల్‌బెల్ట్‌ ప్రాంతంపై పట్టు సాధించేలా ఆమె వ్యూహం ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కవిత ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌తో కలిసి పలుచోట్ల తమ అభ్యర్థులను గెలిపించుకున్న విషయం తెలిసిందే. రానున్న గ్రేటర్‌లోనూ సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలోని పలు కీలక నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల వరకు మరికొందరు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే తాజాగా పార్టీ పేరు విష‌యంలో ఈసీ నుంచి లేఖ అంద‌డం.. అనంత‌రం పార్టీ త‌ర‌ఫున కోర్టుకు వెళ్ల‌డం.. వంటి ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఒక‌వేళ అదే పేరు ఉంటే కొంత క‌లిసొచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.
  • పోటీకి సై అంటున్న జ‌న‌సేన‌..
    జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. టీడీపీ, బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోనూ తమ పార్టీ విస్తరిస్తుందని, రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. పొత్తుల విషయంలో మాత్రం తేల్చలేదు. ఈ క్రమంలో గ్రేటర్‌ నుంచే బరిలోకి దిగుతారా.. అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి చూస్తారో చూడాల్సిందే.
  • మ‌ళ్లీ ‘సైకిల్’ బెల్ వినిపించేనా..?
    తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఈ ప్రాంతంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇక్కడ పూర్తిగా బలహీన పడింది. అయితే ఈ పార్టీకి ప్రత్యేక ఓటు బ్యాంకు ఉండడం, గ్రేటర్‌ పరిధిలో సీమాంధ్ర ఓటర్లు ఉండడంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీడీపీ నుంచి పలువురు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఇందుకు గతంలో వచ్చిన ఫలితాలే నిదర్శనం. తాజాగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేశ్‌ దేశంలో మరికొన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ త్వరలో పార్టీని విస్తరింపజేస్తామని చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మళ్లీ టీడీపీ ఇక్కడికి వస్తే బీజేపీ, జనసేనతో కలిసి కూటమీగా పోటీ చేస్తుందా.. లేదా ఒంటరిగా వెళ్తుందా వేచి చూడాలి.

ఇది కూడా చ‌ద‌వండి.. మ‌హువా కు.. వాహ్‌వా అనాల్సిందే

Ippa laddu | మ‌హువా కు.. వాహ్‌వా అనాల్సిందే

ఇప్ప‌ల‌డ్డు.. ఆరోగ్యం మెండు

Ippa laddu | ఇప్ప‌ల‌డ్డు.. .నోరూరించ‌డంతో పాటు ర‌క్త హీన‌త‌కు చెక్ పెట్టే దివ్యఔష‌ధం. ప్ర‌కృతి సిద్ధంగా ల‌భించే ముడిప‌దార్థాల‌తో ఆదివాసీల చేతిలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాచీన వంట‌కం మ‌హువాకు.. జ‌నం వాహ్‌వా అంటున్నారు. కేవ‌లం రక్త‌హీన‌త‌ను అరిక‌ట్ట‌డమే కాకుండా ఎముక‌ల స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తూ రోగ‌నిరోధ‌క‌ శ‌క్తిని పెంపొందించ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంద‌ని వైద్య‌నిపుణులు సూచిస్తున్నారు. ఇప్ప‌టికే ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో అంగ‌న్‌వాడీ, ఆశ్ర‌మ పాఠ‌శాల‌ల్లో వీటిని విద్యార్థినులు, గ‌ర్భిణుల‌కు అంద‌జేస్తున్నారు. ఇది విజ‌య‌వంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమ‌లుకు ప్ర‌భుత్వం యోచిస్తోంది. మ‌రోవైపు ప్ర‌ధాన‌మంత్రి మోదీ మ‌న్‌కీ బాత్‌లో ఈ ఇప్ప‌లడ్డును ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించ‌డంతో పాటు త‌యారీదారుల‌ను అభినందించిన విష‌యం తెలిసిందే.
ఆదివాసీ ఆహారంగా అందుబాటులో..
ఈ లడ్డు ఆదివాసీ ఆహారంగా ఉట్నూర్‌లో అందుబాటులో ఉంది. ఐటీడీఏ స‌హ‌కారంతో భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం ద్వారా విక్ర‌యిస్తున్నారు. వీటిని తినడం వల్ల ర‌క్తంలో హీమోగ్లోబిన్ శాతం పెంపు, మోకాళ్ల‌నొప్పులు వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతున్న‌ట్లుగా నిపుణులు సూచిస్తున్నారు. ప‌లు ప్ర‌తిష్టాత్మ‌క‌ సంస్థ‌లు సైతం ప‌రిశీలించాయి. ఐసీఎంఆర్ ఆధారంగా నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియ‌న్ (NIN) ప‌రిశీలించింది. ఇందులో ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, విట‌మిన్‌సీ, కెరోటిన్‌ వంటివి అధికంగా ఉన్న‌ట్లుగా గుర్తించింది.
వీటిలో ఏమేం ఉంటాయంటే..
వీటి తయారీలో ఇప్ప పువ్వుతో పాటు కాజు, బాదం, కిస్మిస్‌, నువ్వులు, బెల్లం, ప‌ల్లీలు కలిపి తయారు చేస్తారు. ఐటీడీఏ కేంద్రంతో పాటు ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లోనూ ప్ర‌స్తుతం విక్ర‌యిస్తున్నారు.
ఎన్ ఐ ఎన్ సూచ‌న‌లు..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజనుల్లో రక్తహీనత ఏళ్లుగా వేధిస్తోంది. ప్ర‌ధానంగా మ‌హిళ‌లు, బాలిక‌ల్లో ఏడుశాతం లోపు ఉండ‌డంతో తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.ఈ క్ర‌మంలో వారికి ఇప్ప లడ్డూలు ఇవ్వాలని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) సూచించింది. ఈక్ర‌మంలో అప్ప‌టి క‌లెక్ట‌ర్ దివ్య‌దేవ‌రాజ‌న్ ప్ర‌త్యేక చొర‌వ చూపారు. ఐటీడీఏ స‌హ‌కారంతో రూ.25 లక్షలతో భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘంతో ఉట్నూర్‌లో ఓ ఆహార కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. లడ్డూతోపాటు ఇప్పతో కూడిన‌ వివిధ ఆహార పదార్థాల తయారీలో ప్ర‌త్యేక శిక్షణ ఇప్పించారు. ఆదివాసీ ఆహారం పేరిట విక్ర‌యిస్తున్నారు.
ప్రయోగాత్మకంగా
ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో మూడువేల మందికి మొదటి విడతగా ఇప్ప లడ్డూలు పంపిణీ చేశారు. హిమోగ్లోబిన్‌ 7 నుంచి 8 శాతం ఉన్న వారికి రోజుకొకటి చొప్పున 45 రోజులు పంపిణీ చేశారు. అనంత‌రం నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో స‌గ‌టున హెచ్‌బీ మ‌రో 1.5శాతం పెరిగిన‌ట్లు నిర్ధారణ అయ్యింది. వైద్యులు, ఉన్న‌తాధికారుల సూచ‌న‌తో జ‌నం నుంచి కూడా ఆద‌ర‌ణ క్ర‌మంలో పెరుగుతోంది.

ఇది కూడా చ‌ద‌వండి.. పిడుగుల కాలం.. జ‌ర జాగ్ర‌త్త సుమా!

 

kavitha arrest | కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ మొదలైంది

0
  • ఉద్యమకారుల నెత్తురు చిందేలా చేసిన ఆ పార్టీ బాగుప‌డదు
  • మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేయాలని ఏ పోలీస్ మ్యానువల్ లో ఉంది?
  • సీఎం, మహిళా మంత్రులు, డీజీపీ సమాధానం చెప్పాలి
  • తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
  • kavitha arrest | ఉద్యమకారుల నెత్తురు చిందేలా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బోడుప్పల్ లో భూ పోరాటం చేసి అరెస్ట్ అయిన కవిత గురువారం సాయంత్రం బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదల‌య్యారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు.
    కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు
    కాంగ్రెస్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉద్య‌మ‌కారుల‌కు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన హామీల‌ను మ‌రిచిపోయారా అని ప్ర‌శ్నించారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా ఇప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట అమలు చేసే ధైర్యం లేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చార‌ని ప్రశ్నించారు. మీరిచ్చిన హామీలను అడిగితే పోలీసులతో కొట్టిస్తారా అంటూ మండిపడ్డారు. ఉద్యమకారుల నెత్తురు చూసిన ఈ ప్రభుత్వానికి ఇక కౌంట్ డౌన్ మొదలైందన్నారు. గతంలో ఉద్యమకారులతో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపడలేదని, ఇప్పుడు మీరు బాగుపడరని అన్నారు. ఆ పార్టీ త‌గిన‌ మూల్యం చెల్లించుకోక తప్పదని జోస్యం చెప్పారు.
    ఏ పోలీస్ మ్యానువల్ లో ఉంది?
    తనను పోలీసులు అరెస్ట్ చేసిన విధానం పై కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను ఈడ్చుకుంటూ వెళ్లాలని ఏ మ్యానువల్ లో ఉందో ముఖ్యమంత్రి, మహిళా మంత్రులు, డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. మమ్మల్ని ఈడ్చుకుంటూ వెళ్తే పోలీసులకు అవార్డులు ఇస్తారా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మాట, ముచ్చట, మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. తమను అరెస్ట్ చేసిన విధానానికి సంబంధించిన‌ వీడియోలు ప్రభుత్వ పెద్దలు చూడాలన్నారు.
    ఏ పార్టీ కూడా మాట్లాడటం లేదు?
    ఉద్యమకారులను రక్తాలు వచ్చేలా కొడితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు మద్దతిస్తే వాళ్లంతా ఉద్యమకారులు కాకుండా పోతారా అని అడిగారు. ఉద్యమకారులను అన్ని పార్టీలు మోసం చేశాయని చెప్పారు. వారి తరుఫున మొదటి పోరాటం మొదలుపెట్టామని…హామీలు అమలు చేసే వరకు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    భూపోరాటం ఉద్రిక్తత
    అంతకు ముందు తెలంగాణ రక్షణ సేన పార్టీ బోడుప్పల్ లో చేపట్టిన భూ పోరాటం తీవ్ర ఉద్రిక్తతతకు దారి తీసింది. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. ఆమెను అరెస్ట్ చేసే సమయంలో ఓవరాక్షన్ చేశారు. బండ రాళ్లపై పడేసి, కారు డోరుకేసి గుద్దుతూ బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్ట్ లపై లాఠీచార్జి చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. కవిత ను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్భందించారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్క‌డికి చేరుకున్నారు. కవిత ను వదిలిపెట్టాలంటూ ధర్నాకు దిగారు. పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు భూ పోరాటాన్ని అడుగడుగునా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ భారీగా బోడుప్పల్ చేరుకున్నారు. భూ పోరాటం చేసిన ప్రాంతానికి తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా కవిత నామకరణం చేశారు. ఆ ప్రాంతంలో బొడ్రాయి ప్రతిష్టించి, బోనం ఎత్తి ప్రత్యేక పూజాలు చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి.. హమ్మయ్య.. మాకూ ఒకటో తారీకే జీతాలు

Good news | హమ్మయ్య.. మాకూ ఒకటో తారీఖునే జీతాలు

Good news | ఎట్టకేలకు వారి కష్టాలు తీరాయి. రెగ్యులర్ ఉద్యోగుల తో పాటు తమకూ ఒకటవ తారీఖునే జీతాలు అందాయి. ప్రభుత్వ నిర్ణయంతో కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ సిబ్బందిలో హర్షం వ్యక్తం అవుతుంది.
సీఎం ఆదేశాలు మేరకు..
జీతాల చెల్లింపులో ఆలస్యం వల్ల కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, గౌరవ వేతనం ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని సీఎం ఇటీవ‌ల ఉన్న‌తాధికారుల స‌మీక్ష‌లో పేర్కొన్నారు. వారికి కూడా జాప్యం కాకుండా జీతాలు అందాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖలు, విభాగాలకు సర్క్యులర్‌ జారీ చేసింది. జీతాల బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్‌లో జాప్యం జరగాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొంది. ముఖ్య‌మంత్రి ఆదేశాల‌తో రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి ఆర్థిక శాఖ ఈ నెల 1వ తేదీనే జీతాలు విడుదల చేసింది.
25 లోగా ప్రక్రియ పూర్తి..
ప్రతి నెల 25వ తేదీలోగా జీతాలు, రెమ్యునరేషన్‌ బిల్లులను ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌, అకౌంట్స్‌ విభాగాలకు సమర్పించాలని ఉత్త‌ర్వుల్లో పేర్కొన‌గా.. నెల‌ చివరి పని దినానికల్లా పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి జీతాల చెల్లింపుల వివరాలపై ముఖ్యమంత్రి బుధవారం ఆర్థిక శాఖ అధికారులను ఆరా తీశారు. ఈ నెల బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగులకు జీతాలు జమ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు నివేదించారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు జీతాలు అకౌంట్ల‌లో జ‌మ‌కాగా.. ఔట్‌సోర్సింగ్ కు సంబంధించి ప‌లు విభాగాల సిబ్బంది నుంచి మాత్రం త‌మ‌కు ఇంకా రాలేద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఇది కూడా చ‌ద‌వండి..:  గుడ్ న్యూస్.. వారికి కూడా రైతు భ‌రోసా