Monday, July 27, 2026
Home Blog Page 3

Siddipet zphs | స‌ర్కారు బడి @ కార్పొరేట్ స్ట‌డీ .. ఇందులో సీటు హాట్ కాదా మ‌రి!

Siddipet zphs | ” అమ్మ‌.. మేం గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ టీచ‌ర్లం.. మీ పిల్ల‌లను మ‌న బ‌డికి పంపించండి.. పుస్త‌కాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాం, టై, బెల్ట్‌, షూ అన్నీ ఉచిత‌మే. మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా ఉంటుంది. డిజిట‌ల్ క్లాసెస్ తో పాటు ఈ ఏడాది నుంచి న‌ర్స‌రీ, ఎల్‌కేజీ, యూకేజీ నిర్వహిస్తున్నాం.. ” ప్ర‌స్తుతం ఊరూరా బ‌డిబాట‌లో భాగంగా ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగ‌తూ చెబుతున్న మాట‌లివి. అయినా పేరెంట్స్ నుంచి స్పంద‌న అంతంతే. కానీ ఇక్క‌డ మాత్రం సీన్‌ రివ‌ర్స్. ఈ స‌ర్కారు బడిలో సీటు రావాలంటే ప్ర‌వేశ ప‌రీక్ష రాయాల్సిందే. ఏటా నో అడ్మిష‌న్ బోర్డు ఇక్క‌డ ప్ర‌త్యేకత. కార్పొరేట్‌కు మించి వ‌స‌తులు, సంచ‌ల‌న‌ ఫ‌లితాలతో రాష్ట్రంలోనే ఆద‌ర్శంగా నిలుస్తోంది సిద్దిపేట‌లోని ఇందిరాన‌గ‌ర్ జెడ్పీ హైస్కూల్‌ (Indira nagar zp high school).
ఎనిమిదేళ్ల క్రితం ఇది ఓ మామూలు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌. 2018లో ఎస్ఎంసీ చైర్మ‌న్‌గా డాక్ట‌ర్ పేర్ల కృష్ణ‌ద‌యాసాగ‌ర్‌, అప్ప‌టి హెచ్ఎం రామ‌స్వామి స‌మ‌న్వ‌యంతో బ‌డి అభివృద్ధికి అడుగులు ప‌డ్డాయి. గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ అనే న్యూన‌తాభావం వీడాల‌ని వారు పేరెంట్స్‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ప్ర‌త్యేక‌త చాటాల‌ని ఉపాధ్యాయుల‌ను కోర‌గా.. అంద‌రూ స‌మ్మ‌తించారు. కార్పొరేట్ ధీటుగా బోధ‌నకు శ్రీకారం చుట్టారు. వ‌స‌తుల క‌ల్ప‌న‌పై కూడా దృష్టి సారించారు. అప్ప‌టి మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ప్ర‌త్యేక చొర‌వ చూవ‌డంతో పాఠశాల రూపురేఖ‌లు ఒక్క‌సారిగా మారిపోయాయి. మ‌రోవైపు కోవిడ్ స‌మ‌యంలోనూ ఇక్క‌డ ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం.
దాత‌ల చొర‌వ‌..
దాత‌ల చొర‌వ‌తో డిజిట‌ల్ త‌ర‌గ‌తి గ‌దులు, అత్యాధునిక కంప్యూట‌ర్ ల్యాబ్‌, ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబ్‌, రొబొటిక్ ల్యాబ్‌, ఇంటిగ్రేటెడ్ మీటింగ్ హాల్, 5 కిలోవాట్ సోలార్ సిస్ట‌మ్‌, హైజ‌నిక్ ఫుడ్ కోసం లేటెస్ట్ కిచెన్, ప్యూరీఫైడ్ వాట‌ర్ సిస్ట‌మ్‌ వంటి అధునాత‌న వ‌స‌తులు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇందులో నాట్కో ఫార్మా సంస్థ చేయూత కీల‌క‌మ‌ని పాఠ‌శాల నిర్వాహ‌కులు పేర్కొంటున్నారు.
ఏటా ప్ర‌వేశప‌రీక్ష
ఈ పాఠ‌శాల‌లో ప్ర‌వేశాల కోసం ఏటా ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా మారింది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవ‌త్సరానికి గాను బుధ‌వారం నిర్వహించారు. 6, 8 త‌ర‌గ‌తుల‌కు సంబంధించి 220 సీట్లు ఉండ‌గా 700 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు అందాయి. ప‌రీక్ష‌కు 650 మంది హాజ‌ర‌య్యారు. ఇందులో సుదూర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.
అత్యుత్త‌మ ఫ‌లితాలు
ఎస్సెస్సీలో ఇక్క‌డి విద్యార్థులు ఏటా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. దాదాపు వంద‌శాతం ఉత్తీర్ణ‌తతో దూసుకుపోతున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బాస‌ర ట్రిపుల్ ఐటీకి సైతం ఎంపిక‌వుతున్నారు. ఈ ఏడాది ఏకంగా 16మంది సెల‌క్ట్ కావ‌డం గ‌మ‌నార్హం. అలాగే 15మంది ఎన్ఎంఎంఎస్‌కు సైతం ఎంపిక‌య్యారు. ఇలా సంచ‌లన ఫ‌లితాల‌తో ఈ బ‌డి ఇప్ప‌టికే రాష్ట్ర‌, జాతీయ స్థాయి ప్ర‌శంస‌లందుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌లు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే స‌ర్కారు లక్ష్యం నెర‌వేరడం ఖాయం. ఆ దిశ‌గా ప్ర‌తి ఒక్క‌రూ సామాజిక బాధ్య‌త‌గా ముందుకు సాగాలని ఆశిద్దామా మ‌రి.

  • అంద‌రి స‌హ‌కారంతోనే..
    త‌ల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల అంకిత‌భావంతో పాటు స్థానిక ఎమ్మెల్యే చొర‌వ‌తో పాఠ‌శాల అభివృద్ధి ప‌థంలో సాగుతుంది. ప్ర‌స్తుతం అన్ని త‌ర‌గ‌తుల్లో ఒక్కోదానిలో నాలుగు నుంచి ఐదు సెక్ష‌న్లు ఉన్నాయి. మొత్తం 1,236 మంది విద్యార్థులు, 42 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఏడాది నుంచి ఐఐటీ, నీట్ వంటి పోటీ ప‌రీక్ష‌ల‌కు గాను విద్యార్థుల‌ను పాఠ‌శాల‌ స్థాయి నుంచే స‌న్న‌ద్ధం చేయాల‌ని భావిస్తున్నాం. ఇక్క‌డ సీటు కోసం ముఖ్య‌మంత్రి నుంచి సైతం సిఫార‌సులు వ‌స్తుండ‌డం మా ప‌నితీరుకు నిద‌ర్శ‌నం.
    – రాజ‌ప్రభాక‌ర్‌రెడ్డి, ప్ర‌ధానోపాధ్యాయుడు
  • సంప్రదిస్తే గైడ్ చేస్తాం..
    ఈ పాఠశాల‌కు గ‌తంలో ఎస్ఎంసీ చైర్మ‌న్‌గా చేసిన క్ర‌మంలో హెచ్ఎం రామ‌స్వామి గారి ఆలోచ‌న‌ల‌తో క‌లిసి ఉపాధ్యాయుల‌ను కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగాం. కార్పొరేట్ బోధ‌న‌కు శ్రీ‌కారం చుట్టి ఎమ్మెల్యే స‌హ‌కారంతో వ‌స‌తుల‌ను మెరుగుప‌రిచాం. క్ర‌మంగా ఆద‌ర‌ణ పెరిగింది. నో అడ్మిష‌న్స్ బోర్డు పెట్టే వ‌ర‌కు వెళ్ల‌డం సంతోష‌దాయ‌కం. ప్ర‌స్తుత ప్ర‌ధానోపాధ్యాయుడు రాజ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఉపాధ్యాయులంతా అదే స్ఫూర్తి కొన‌సాగించ‌డం అభినంద‌నీయం. ఇత‌ర పాఠ‌శాల‌ల నుంచి ఎవ‌రైనా స‌ల‌హాలు,సూచ‌న‌లు అడిగితే గైడ్ చేసేందుకు సిద్ధం.
  • – డాక్ట‌ర్ పేర్ల కృష్ణ‌ద‌యాసాగ‌ర్ , (94902 43095), (బీసీ స్ట‌డీ స‌ర్కిల్ డైరెక్ట‌ర్‌, సిద్దిపేట్‌)

ఇది కూడా చ‌ద‌వండి … పిడుగుల కాలం.. జ‌ర జాగ్ర‌త్త సుమా!

Gold rate down | ప‌సిడి ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

Gold rate down | బంగారం కొనుగోలు చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకు ఇది మంచి స‌మ‌యం. ఈ ఏడాది మొద‌ట్లో రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ రేట్(gold rate) ప్ర‌స్తుతం నేల చూపులు చూస్తుంది. గ‌డిచిన వారం రోజులుగా త‌గ్గుముఖం ప‌డుతోంది. తాజాగా మంగ‌ళ‌వారంతో పోల్చితే బుధ‌వారం ఏకంగా 10 గ్రాముల‌పై రూ. 4వేల‌కు పైగా ప‌డిపోయింది. కొనుగోలుకు ఇది అనుకూల‌మ‌ని నిపుణులు సూచిస్తున్నారు.
ఇటీవ‌ల పెరిగిన సుంకాలు..
ఇటీవల ప్ర‌ధాని మోదీ ఏడాది పాటు బంగారం కొనుగోలుకు దూరంగా ఉండాల‌ని ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత కేంద్రప్ర‌భుత్వం బంగారం, వెండి ధ‌ర‌ల‌పై సుంకాలు పెంచిన విష‌యం తెలిసిందే. దీంతో ప‌సిడిధ‌ర‌లు ఒక్క‌సారిగా పెరిగాయి. అయితే ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ మార్కెట్ హెచ్చుత‌గ్గుల నేప‌థ్యంలో మళ్లీ త‌గ్గుమ‌ఖం ప‌డుతున్నాయి. గ‌డిచిన వారం రోజుల్లో గోల్డ్ తులానికి రూ.8వేల‌కు పైగా ప‌డిపోయింది. అలాగే వెండి కిలో రూ.25వేల వ‌ర‌కు త‌గ్గింది. తాజాగా హైద‌రాబాద్ బులియ‌న్‌ మార్కెట్‌లో బంగారం 10 గ్రాముల (24 క్యారెట్‌) ధ‌ర‌ రూ. 1,48,860 ఉండ‌గా.. వెండి కిలో రూ. 2ల‌క్ష‌ల 60వేలుగా ఉంది. ముందు రోజుతో పోల్చితే బంగారం రూ. 4వేలు, వెండి రూ. 10వేల వ‌ర‌కు త‌గ్గ‌డం విశేషం.
ఈ ఏడాది ప‌రిస్థితి..
ఈ ఏడాది బంగారం ధ‌ర‌లు భారీ హెచ్చుత‌గ్గుల‌కు లోన‌య్యాయి. జనవరి 29, 2026న పుత్తడి 10 గ్రాములకు రూ.1,93,096ల‌ రికార్డు ధ‌ర‌ పలికిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుత‌ ధరతో పోల్చితే ఏకంగా రూ. 44వేలు త‌గ్గింది. మ‌రోవైపు ఈ ఏడాది జనవరి 29న కిలో వెండి ధ‌ర రూ.4.25 లక్షలు పలికింది. ప్రస్తుత ధరతో పోల్చితే కిలోకు ఏకంగా రూ.ల‌క్ష‌65వేలు త‌గ్గింది. ఈ లెక్క‌న దాదాపు 40శాతం వ‌ర‌కు తగ్గుద‌ల న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం.
బంగారం,వెండి ధ‌ర‌లు జూన్‌1 నుంచి ఇలా.. (10గ్రాముల ధ‌ర‌)
తేదీ   24 క్యారెట్‌  22 క్యారెట్      వెండి(కిలో)
10రూ.1,48,860 రూ.1,36,450 రూ.2,60,000
9 రూ.1,53,160 రూ.1,40,400 రూ.2,70,000
8 రూ.1,51,690 రూ.1,39,050 రూ.2,70,000
7 రూ.1,52,730 రూ.1,40,000  రూ.2,70,000
6 రూ.1,52,730 రూ.1,40,000  రూ.2,70,000
5 రూ.1,55,730 రూ.1,42,750  రూ.2,80,000
4 రూ.1,56,110  రూ.1,43,100 రూ.2,85,000
ఇదికూడా చ‌ద‌వండి.. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు వేళాయె

Fee regulation act | ఫీజుల నియంత్రణ చట్టం కోసం.. టీఆర్ఎస్ పోరుబాట

  • స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి
  • వందలాది కార్యకర్తల అరెస్ట్

Fee regulation act | కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు తెలంగాణ రక్షణ సేన (TRS) పోరుబాట పట్టింది. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్డీకాపూల్ లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ను ముట్టడించారు. గంటకు పైగా గేట్ ఎదుట బైఠాయించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ ఒక్కసారిగా వంద నుంచి 150 శాతం వరకు ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై పెను భారం మోపాయని.. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అండతోనే కార్పొరేట్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను జలగల్లా పీక్కుతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి మంగళం పాడేందుకు తీసుకువచ్చిన జీవో నం.7ను వెంటనే రద్దు చేయాలని, రూ.11వేల కోట్ల రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తీవ్ర ఉద్రిక్తత
వందలాది మంది నాయకులు, కార్యకర్తలు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ను ముట్టడించడంతో లక్డీకాపూల్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో వారు ఆఫీస్ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఈక్రమంలో సీఎం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఆందోళనతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి, నారాయణగూడ, సైఫాబాద్, బండ్లగూడ, గోషామహల్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు మహిళా నాయకులు గాయపడ్డారు.

ఇది కూడా చ‌ద‌వండి… ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కు వేళాయె

Eapcet counseling | ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు వేళాయె..

  • ఈనెల 19 నుంచి షురూ
  • షెడ్యూల్ విడుద‌ల చేసిన ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ
    Eapcet counseling | ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వం ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఏర్పాటుకు సిద్ధమైంది. గ‌త నెల‌లో ప్రవేశ‌ ప‌రీక్ష నిర్వ‌హించి ఫ‌లితాల‌ను కూడా ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. ఫీజుల చెల్లింపు అంశం కోర్టుప‌రిధిలో ఉండ‌డంతో కొంత‌ ఆల్య‌మైన‌ట్లుగా తెలుస్తోంది. తాజాగా కౌన్సెలింగ్ ప్రక్రియకు శ్రీ‌కారం చుట్టింది . ఈ నెల 19 నుంచి షురూ కానుంది. ఈ సారి కూడా మూడు విడతల్లో నిర్వ‌హించాల‌ని ఎప్‌సెట్ ప్ర‌వేశాల క‌మిటీ నిర్ణ‌యించింది. తొలి విడత జూలై 14 నాటికి, రెండో విడత జూలై 19 వ‌ర‌కు, తుది విడత జూలై 29 వ‌ర‌కు నిర్వ‌హించేలా షెడ్యూల్ ఖ‌రారు చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ సారి కౌన్సెలింగ్‌తోపాటు బి కేటగిరీ సీట్ల భర్తీ ఒకేసారి కొన‌సాగ‌నుంది.

మొద‌టి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ..

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ : జూన్ 19 నుంచి 28 వరకు
    స‌ర్టిఫికెట్ల పరిశీలన : 22 నుంచి 29 వరకు
    వెబ్ ఆప్షన్ల ప్రక్రియ : 25 నుంచి జూలై 1 వరకు
    మాక్ సీట్ల కేటాయింపు : జూలై 4 లోపు
    వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం : జూలై 5 నుంచి 7 వరకు
    సీట్ల కేటాయింపు : జూలై 10 లోపు
    సెల్ఫ్‌ రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు : జూలై 18 నుంచి 22 వరకు

రెండు, మూడు విడతల కౌన్సెలింగ్‌ ఇలా..

  • రెండో విడత : జూలై 17 – 28 వరకు
    చివరి విడత : జూలై 31 – ఆగస్టు 7వరకు

ఇవి గుర్తుంచుకోండి..

  • కౌన్సెలింగ్ ప్ర‌క్రియ పూర్త‌య్యాక‌ ఆగ‌స్టు 12 నుంచి 17వ తేదీ వరకు ఇంట‌ర్న‌ల్ స్లైడింగ్‌కు అవ‌కాశం ఉంటుంది. విద్యార్థులు అప్పటికే చేరిన కళాశాలలో కోరుకున్న బ్రాంచిలో ఇంకా సీట్లు ఖాళీ ఉంటే అందులోకి సుల‌భంగా మార‌వ‌చ్చు. ఇలా మారినా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది.
  • తొలి విడతలో సీట్లు పొందిన వారు బెట‌ర్ క‌ళాశాల‌, బెట‌ర్ బ్రాంచి క‌నుక కోరుకుంటే రెండో విడ‌త‌లో మ‌ళ్లీ ఫ్రెష్‌గా వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చుకోవాలి.
  • రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థులు సీటు పొందిన కళాశాలలో తప్పనిసరిగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆ సమయంలో టీసీ మాత్రమే ఒరిజిన‌ల్‌ది అంద‌జేయాలి. మిగిలిన స‌ర్టిఫికెట్స్‌ జిరాక్స్ ఇస్తే సరిపోతుంది.
  • అయితే సెకండ్ ఫేజ్ వ‌ర‌కు సీట్లు రద్దు చేసుకోవచ్చు. చెల్లించిన ఫీజు కూడా వెనక్కి ఇస్తారు. చివరి విడతలో మాత్రం అలాంటి అవకాశం ఉండదు.

ఇది కూడా చ‌ద‌వండి.. ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల ఫీజులు ఎంతో తెలుసా..

Gas rate hyke | మ‌ళ్లీ గ్యాస్ ధ‌ర పెరిగిందండోయ్‌..

Gas rate hyke | ప‌శ్చిమాసియా ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో దేశంలో మ‌రోసారి గ్యాస్ ధ‌ర‌ మండింది. గ‌త‌నెల‌లో క‌మర్షియ‌ల్ పై బాదిన ఆయిల్ కంపెనీలు తాజాగా డొమెస్టిక్(domestic) ధ‌ర పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి. ఆదివారం సిలిండ‌ర్‌పై రూ. 29 పెంచాయి. దీంతో వంటింటి బుడ్డి ధ‌ర ప్ర‌స్తుతం రూ. వెయ్యికి చేరువైంది. గ‌డిచిన మూడు నెల‌ల్లో పెంపు ఇది రెండో సారి కావ‌డం గ‌మ‌నార్హం.
మార్చిలో రూ.60.. తాజాగా రూ.29 పెంపు
ఈ ఏడాది మార్చి 7న‌ గృహ వినియోగ‌దారుల‌కు సంబంధించిన గ్యాస్ ధ‌ర‌ల‌ను స‌వ‌రించిన విష‌యం తెలిసిందే. సిలిండ‌ర్‌పై రూ..60 పెంచిన కేంద్రం తాజాగా మ‌రో రూ.29 పెంచింది. ఈ ధ‌ర‌లు వెంట‌నే అమ‌లులోకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే పెట్రో ధ‌ర‌ల భారంతో సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుండ‌గా ఈ పెంపు వారిపై మ‌రింత భారం కానుంది. కాగా, మే1న వాణిజ్య సిలిండ‌ర్ ధ‌రను ఏకంగా రూ.993 పెంచిన విష‌యం తెలిసిందే. ఇలా వ‌రుస‌గా గ్యాస్‌ ధ‌ర‌ల పెంపుతో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది.
హైద‌రాబాద్‌లో రూ. 994కు పెంపు
హైద‌రాబాద్‌(hyderabad) లో ఇప్ప‌టి వ‌ర‌కు గృహ సిలిండ‌ర్ ధ‌ర (14.2 కిలోల) రూ. 965 ఉండ‌గా.. ప్ర‌స్తుతం రూ.994 చేరింది. ఇక ఢిల్లీలో రూ.913 నుంచి 942కు పెరిగింది. ముంబాయిలో రూ.941.50, చెన్నైలో రూ. 957.50, నోయ‌డాలో రూ. 939.50, బెంగ‌ళూర్‌లో రూ. 915.50, జైపూర్‌లో రూ. 945.50, ల‌క్నోలో రూ. 979.50, పాట్నాలో రూ. 1,031.50లకు పెరిగాయి. తెలంగాణ‌లో ప‌రిశీలిస్తే.. వ‌రంగ‌ల్‌లో రూ. 1,013, క‌రీంన‌గ‌ర్‌లో రూ.1,014 కు చేరువ‌య్యాయి.
సోష‌ల్ మీడియాలో సెటైర్లు..
గ్యాస్ ధ‌ర‌ల పెంపు నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.. మ‌ళ్లీ క‌ట్టెల పొయ్యి వైపు వెళ్ల‌డం న‌మ‌యంటూ కొంద‌రు నెటిజ‌న్లు పేర్కొంటుండ‌గా.. ఎల‌క్ట్రిక్ వైపు వెళ్ల‌డం మేల‌ని, ఇండెక్ష‌న్ స్టౌల‌కు గిరాకీ పెరిగింద‌ని మ‌రికొంద‌రు పోస్టింగ్‌లు పెడుతున్నారు. మున్ముందు ప‌రిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అని  ఇంకొంద‌రు భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.
ఇది కూడా చ‌ద‌వండి.. ప్రైవేట్ స్కూళ్ల‌కు పంపితేనే .. రేష‌న్‌, పింఛ‌న్‌, ఇందిర‌మ్మ ఇండ్లు క‌ట్‌!

Grama sabha decision | ప్రైవేట్ స్కూళ్ల‌కు పంపితే.. రేష‌న్‌, పింఛ‌న్‌, ఇందిర‌మ్మ ఇండ్లు క‌ట్‌!

  • స‌ర్కారుకు క‌ట్టు ‘బ‌డి’ నోళ్ల‌కే సంక్షేమ ప‌థ‌కాలు..

  • ఆ ఊరు సంచల‌న నిర్ణ‌యం

Grama sabha decision | పిల్ల‌ల‌ను స‌ర్కారు బ‌డికి పంపినోళ్ల‌కే సంక్షేమ ప‌థ‌కాలంటూ ఆ ఊరు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.. ప్రైవేట్‌కు పంపితే ఆ ఇంటికి రేష‌న్‌, పింఛ‌న్, ఇందిర‌మ్మ ఇళ్లు వంటివి ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను కాపాడుకునేందుకు ఆ గ్రామం చేసిన తీర్మానం ఇప్పుడు రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంద‌రినీ ఆలోచింప‌జేస్తూ హాట్‌టాపిక్ గా  నిలిచిన‌ ఆ విలేజే ..హ‌న్మ‌కొండ జిల్లాలోని ముప్పారం (mupparam).
ఆర్థిక స్తోమ‌త ఎలా ఉన్నా ప్ర‌తి ఒక్క‌రూ తమ పిల్ల‌ల‌ను ప్రైవేట్‌, కార్పొరేట్ బ‌డుల‌కు పంపేందుకే పేరెంట్స్‌ మొగ్గు చూపుతుంటారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో నాణ్య‌మైన విద్య, ఉచిత పాఠ్య‌పుస్త‌కాలు, యూనిఫాం, మ‌ధ్యాహ్న భోజ‌నం వంటి అనేక ప‌థ‌కాలు అమ‌లవుతున్నా అటువైపు చూడ‌రు. ఇందుకు కార‌ణాలు లేక‌పోలేదు. ఇరుగుపొరుగు ప్ర‌భావం, సోష‌ల్ స్టేట‌స్‌తో పాటు ఉపాధ్యాయులు స‌రిగా ప‌ట్టించుకోర‌నే భావన త‌ల్లిదండ్రుల్లో నాటుకుపోయింది. ఈ క్ర‌మంలో అప్పులు చేసి మ‌రీ త‌మ పిల్ల‌ల‌ను చ‌దివిస్తున్న పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఫ‌లితంగా ప్ర‌భుత్వ ల‌క్ష్యం నీరుగారుతుండ‌గా.. పేద‌ల‌కు ఉచిత విద్య అందుబాటులో ఉన్నా అందుకోలేని దుస్థితి. ఈ క్ర‌మంలోనే ముప్పారం ముందుకు వ‌చ్చింది. సామాజిక బాధ్య‌త‌ను గుర్తు చేస్తూ ఆద‌ర్శంగా నిలిచేందుకు సిద్ధ‌మైంది.
ఆ ఊరు ఏం చేసిందంటే..
గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో విద్యార్థుల సంఖ్య ఏటా త‌గ్గుతోంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల నిర్వ‌హించిన గ్రామ‌స‌భ‌లో పాల‌క‌వ‌ర్గం ప్ర‌త్యేక దృష్టి సారించింది. స‌ర్కారు బ‌డిని బ‌లోపేతం చేయాల‌ని భావించింది. ఇందులో త‌ల్లిదండ్రుల పాత్ర‌ కీల‌క‌మ‌ని గుర్తించింది. త‌ద‌నుగుణంగా కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యం కాస్త క‌ఠినంగా ఉన్నా ఊరు బాగు కోస‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ఈ చర్చకు కేంద్రబిందువుగా నిలిచింది సర్పంచ్ గుంటిపల్లి రేణుక వెంకట్ చేసిన వ్యాఖ్యనే. ‘ ప్రైవేట్ పాఠశాల ఫీజులు కట్టే స్తోమత ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎందుకు అవసరం? ‘ అనే ప్రశ్నను ఆమె గ్రామసభలో లేవనెత్తారు. ఈ క్ర‌మంలోనే చ‌ర్చించిన అనంత‌రం సభ సంచల‌న తీర్మానం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చకుండా ప్రైవేట్‌కు పంపించే కుటుంబాలకు అందుతున్న పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలను నిలిపివేయాలని తీర్మానించి సంబంధిత అధికారులకు సిఫార్సు చేసింది. అంతేకాదు.. త‌మ ఊరిలోకి విద్యార్థుల‌ను తీసుకెళ్లేందుకు వ‌చ్చే ప్రైవేట్ పాఠశాలల బస్సులు, ఆటోలను అనుమతించకూడదని కూడా నిర్ణ‌యించింది.
అడ్మిష‌న్లు పెంచేంద‌కు..
తీర్మానానికే ప‌రిమితం కాకుండా ఆచ‌ర‌ణ‌లో అమ‌లు చేయాల‌ని గ్రామ‌స‌భ‌ సంక‌ల్పించింది. ఇందులో భాగంగా ప్రతి వార్డు సభ్యుడు కనీసం 10 మంది విద్యార్థులను బ‌డిలో చేర్పించాలని నిర్ణ‌యించింది. మ‌రోవైపు పిల్ల‌లందరినీ బ‌డిబాట ప‌ట్టించ‌డ‌మే త‌మ లక్ష్య‌మ‌ని అంటున్నారు గ్రామ‌పెద్ద‌లు. అలాగే త‌ల్లిదండ్రులు కూడా బాధ్య‌తగా ఉండాల‌ని, పిల్ల‌ల పురోగ‌తిపై ఎప్ప‌టిక‌ప్ప‌డు ఉపాధ్యాయులతో చ‌ర్చించిన‌ప్పుడే ప్రభుత్వ విద్య మరింత మెరుగుపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స‌మాజ హితం కోసం తీసుకున్న నిర్ణ‌యం క‌ఠిన‌మైనా స‌ముచిత‌మే అని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
ఇది కూడా చ‌ద‌వండి.. పిడుగుల కాలం.. జ‌ర జాగ్ర‌త్త సుమా!

Thunderstorm | పిడుగుల కాలం.. జ‌ర జాగ్ర‌త్త సుమా!

Thunderstorm | వానాకాలం వ‌చ్చేసింది. వ‌ర్షాల‌తోపాటు అప్పుడ‌ప్పుడు పిడుగులు సైతం ప‌డుతుంటాయ్‌. వీటితో ప్రాణ‌, ఆస్తిన‌ష్టం సైతం సంభ‌విస్తాయి. అప్ర‌మ‌త్త‌త‌, అవ‌గాహ‌న‌తో వీటి బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. వెలుగులా వ‌చ్చి జీవితాల‌ను చీక‌టి చేసే ప్ర‌కృతి వైప‌రీత్యాన్ని తెలుసుకుందామా మ‌రి.
పిడుగులంటే..
పిడుగు (Lightning) .. ఆకాశంలో మేఘాల రాపిడి వల్ల ఏర్పడే స‌హ‌జ‌ విద్యుత్ ప్ర‌సారం. దీనిని అత్యంత ప్రమాదకరమైన ప్రకృతి వైపరీత్యంగా పరిగ‌ణిస్తారు. మేఘాల కింది భాగంలో ఉండే రుణావేశం.. భూమిపై ఉండే ధనావేశాన్ని ఆకర్షించే క్ర‌మంలో రెండింటి మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్ప‌డుతోంది. ఈ క్ర‌మంలో విద్యుత్ మార్గం ఏర్పడి భూమి వైపుగా వేగంగా దూసుకొస్తుంది. వీటి బారిన ప‌డి దేశంలో ఏటా వంద‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మూగ జీవాలు సైతం అక‌స్మాత్తుగా త‌నువు చాలిస్తున్నాయి. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లతో పాటు అవ‌గాహ‌నతో ప్రాణ‌, ఆస్తి న‌ష్టం నుంచి బ‌య‌ట‌పడ‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్క‌డ ప‌డుతాయి..
మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదలయ్యే క్ర‌మంలోనే ఉరుములు, మెరుపులు పుడతాయి. ఒక పిడుగులోసుమారు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది. ఇది క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే జీవాల‌ను కాల్చి బూడిద చేయగ‌లిగేంత సామ‌ర్థ్యం అన్న‌మాట‌. ప్ర‌ధానంగా ఈ పిడుగులు ఎక్కువ‌గా స‌ముద్ర తీర ప్రాంతాల్లో పడే అవకాశం ఉంటుందని ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ సంస్థ నాసా పరిశోధనలో వెల్ల‌డైంది. అమెరికాకు చెందిన ఎర్త్‌నెట్ వర్క్‌తో పాటు, ఇస్రో సహకారం ద్వారా ప్ర‌భుత్వం ఆయా రాష్ట్రాల్లో సెన్స‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా సంబంధిత అధికారులు అంచ‌నాకు వ‌స్తారు. ఆయా ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్రమత్తం చేస్తారు. పెను ప్ర‌మాదం బారిన ప‌డ‌కుండా చ‌ర్య‌లు చేప‌డుతారు.
జాగ్ర‌త్త‌లివే..
ఉరుములు, మెరుపులు ఉన్న స‌మ‌యంలో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఉండ‌కూడ‌దు. ముఖ్యంగా చెట్ల కింద అస్సలు నిలబడకూడదు. అలాగే క‌రెంట్‌ స్తంభాలు, లోహపు వస్తువులు, సెల్‌టవర్ల స‌మీపంలోకి వెళ్ల‌కూడ‌దు. వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. పొలాల్లో పనిచేస్తున్న స‌మ‌యంలో రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. చెట్లు, గుడిసెల కిందకు కాకుండా త్వ‌ర‌గా సురక్షితమైన ప్రదేశాలకు చేరుకోవాలి. అలాగే ఎత్తైన భవనాల పక్కన నిలబడకూడ‌దు. ఆ స‌మ‌యంలో ఇంట్లో టీవీ వంటివి వాడ‌కూడ‌దు. ఎల‌క్ట్రిక‌ల్ ఉప‌క‌ణాల‌ ప్లగ్ లను తొలగించాలి. లేదంటే హై ఓల్టేజ్ కారణంగా వ‌స్తువులు పాడైపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు మెరుపులతో పడుతున్న వర్షాన్ని సైతం చూడరాదు.

పిడుగు బాధితుల‌కు ప‌రిహారం
పిడుగు పాటుతో మృతి చెందితే బాధిత కుటుంబాల‌కు తెలంగాణ ప్రభుత్వం అండ‌గా నిలుస్తోంది. విపత్తు నిర్వహణ కింద ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి, పశువులు వంటి జీవాలు మృతి చెందిన సందర్భాల్లోనూ అవ‌స‌ర‌మైన సాయం మంజూరు చేస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి.. చ‌ల్ల‌ని క‌బురు.. నైరుతి వ‌చ్చేసిన‌ట్లేనా!

Weather update | చ‌ల్ల‌ని క‌బురు.. నైరుతి వ‌చ్చేసిన‌ట్లేనా

Weather update | వేస‌వి ఎండలకు మండిపోయిన జ‌నానికి చ‌ల్ల‌ని కబురు అందింది. ఇప్ప‌టికే నైరుతి  రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను తాకాయి. దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్నాయి. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
ఏటా జూన్ రాక‌ముందే రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించేవి. ఈ ఏడాది మే 26న నైరుతి (southwest) కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఎల్సినో ప్రభావంతో కొంత ఆల‌స్య‌మయ్యాయి. ఈనెల‌ 4న కేరళను తాకాయి. ప్ర‌స్తుతం అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని మ‌రికొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించిన‌ట్లు ఐఎండీ పేర్కొంది. ఇప్ప‌టికే రెండు రోజులుగా కేరళలో ఓ మోస్త‌రు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో తమిళనాడులోని ప‌లు ప్రాంతాల్లోనూ జోరుగా వాన‌లు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ పేర్కొంటుంది. తెలుగు రాష్ట్రాల్లోకి ఆగ‌మం మొద‌లైనా వారం రోజుల్లో విస్త‌రించ‌నున్నాయి. ఈ ఏడాది ఎల్సినో కార‌ణంగా సాధార‌ణం కంటే త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం వాతావరణ శాఖ‌ అంచనా వేస్తుంది. సెప్టెంబరు వ‌ర‌కు కొంత పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌ని వెల్ల‌డించింది.

నైరుతి కీల‌కం..
దేశంలో నైరుతి రుతుప‌వనాలే కీల‌కం. ఏడాది పొడవునా కురిసే మొత్తం వర్షపాతంలో దాదాపు 80 శాతం వాటా వీటిదే ఉంటుంది. సాగునీటి వ‌స‌తి లేని భూముల‌కు ఈ వ‌ర్షాలే ఆధారం. అందుకే మెజార్టీ రైతాంగం వీటిపైనే ఆశ‌లు పెట్టుకుంటారు. వ‌ర్ష‌పాతం ఆధారంగా అనుకూల‌మైన పంట‌ల సాగుకు మొగ్గు చూపుతారు.
రాష్ట్రంలో ఇలా..
గ‌డిచిన 24గంటల్లో రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి, నల్గొండ‌, రంగారెడ్డి, నిర్మల్ త‌దిత‌ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో అత్యధికంగా 5.08 సెం.మీ వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లుగా వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మ‌రికొన్నిప్రాంతాల్లో ఉరుములతో కూడిన వ‌ర్షాలు కురువ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. పిడుగులు ప‌డే అవ‌కాశం ఉన్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చెట్ల కింద ఉండ‌వద్ద‌ని సూచిస్తుంది. వీలైనంత త్వరగా పక్కా భవనంలోకి వెళ్లడం శ్రేయ‌స్క‌రం.

ఇది కూడా చ‌దవండి.. బొగ్గుబాయి బాటలో.. కవితమ్మ

kavithamma | బొగ్గు ‘బాయి బాట’ లో.. కవితమ్మ

  • సింగరేణిపై టీఆర్ఎస్ ఫోకస్
  • పార్టీ బ‌లోపేత‌మే ల‌క్ష్యం
  • ఈనెల‌15 నుంచి తొలివిడ‌త

kavithamma | తెలంగాణ రక్షణ సేన (TRS) సింగరేణిపై ఫోకస్ పెంచింది. నూతనంగా ఆవిర్భ‌వించిన ఆ పార్టీ ఆరు జిల్లాల ప‌రిధిలో ఉన్న కోల్‌బెల్ట్‌పై ప్ర‌త్యేక‌ దృష్టి సారిస్తోంది. కార్మిక క్షేత్రంపై ప‌ట్టు సాధించాల‌ని భావిస్తోంది. ఇందులో భాగంగా ‘బాయి బాట’ కార్య‌క్ర‌మానికి సిద్ధ‌మైంది. ఈనెల 15 నుంచి తొలివిడ‌త‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.
గ‌నుల వ‌ద్ద ప్ర‌త్యేక స‌మావేశాలు..
కార్మికుల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌లు ప్ర‌త్య‌క్షంగా తెలుసుకోవ‌డంతో పాటు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకురావాల‌ని యోచిస్తున్నారు ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత. తొలివిడ‌త‌లో భాగంగా మంద‌మ‌ర్రి రీజియ‌న్ నుంచి శ్రీ‌కారం చుట్టాల‌ని భావిస్తున్నారు. ఇందులో భాగంగా అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద ఆమె ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. కార్మిక వ‌ర్గం నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తే రానున్న అసెంబ్లీ, పార్ల‌మెంట్లో ఆ పార్టీకి విజ‌యావ‌కాశాలు మెరుగుప‌డే అవ‌కాశాలు లేక‌పోలేదు.
మొదటి విడతలో..
తొలి విడతలో భాగంగా ఆరు రోజుల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈనెల 15న చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మందమర్రి ఏరియా మంచి కార్య‌క్ర‌మాన్ని క‌విత షురూ చేస్తారు. ఆయా గనుల్లో పర్యటిస్తారు. అలాగే 16న మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ ఏరియా, 17న రామగుండం నియోజకవర్గంలోని ఆర్జీ–1 ఏరియా,18న ఆర్జీ–2 ఏరియా, 19న మంథని నియోజకవర్గంలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, ఆర్జీ–3 ఏరియా, 20న భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి ఏరియా బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ లను సందర్శించనున్నారు. కార్మికులను స్వ‌యంగా క‌లిసి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. పరిష్కారం పై చొరవ చూపి పార్టీ పక్షాన అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.
గ‌తంలో జాగృతి ఆధ్వ‌ర్యంలో
గతంలో టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగిన కవిత బీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక జాగృతి ఆధ్వ‌ర్యంలో సేవ్ సింగ‌రేణి పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. తాజాగా పార్టీ ఏర్పాటు త‌ర్వాత మరోసారి సింగ‌రేణిపై ఫోక‌స్ పెంచ‌డం ఆసక్తికరంగా మారింది.  కార్మిక వ‌ర్గంపై ప‌ట్టు ఉన్న ఆమె రానున్న ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచే పోటీ చేయాల‌ని యోచిస్తున్నారా.. అందులో భాగంగానే పార్టీని బ‌లోపేతం చేయ‌డంతో పాటు అనువైన స్థానం కోసం అన్వేషిస్తున్నారా.. వంటి అనేక ఊహాగానాలు పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో వినిపిస్తున్నాయి.
కోల్‌బెల్ట్ ప‌రిధిలో ఆరు జిల్లాలు..
కోల్‌బెల్ట్‌ ప్రాంతం రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలో విస్తరించింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సింగరేణి గనులు, ఓపెన్‌కాస్టులు కొన‌సాగుతున్నాయి. వీటి పరిధిలో 12 అసెంబ్లీ, 5 పార్లమెంట్‌ నియోజకవర్గ స్ధానాలు ఉన్నాయి. ఇందులో ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, పినపాక, సత్తుపల్లి, ఇల్లందు అసెంబ్లీ స్థానాలు. అలాగే ఆదిలాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌, మహబూబ్‌బాద్‌, ఖమ్మం వంటి ఐదు ఎంపీ స్థానాల్లో నల్లసూరీల ఓట్లే కీల‌కం. మ‌రోవైపు ఉత్తర తెలంగాణ ప‌రంగా ప‌రిశీలిస్తే ఇవి మెజారిటీ స్థానాలుగా ఉండ‌డం గ‌మ‌నార్హం.
ఇది కూడా చ‌దవండి.. తెలంగాణ అస్తిత్వ గానం.. ఉద్యమ రణన్నినాదం

Resonance Knr | ఐదు అల‌వాట్లు.. మూడు ల‌క్ష్యాలు.. జేడీ స‌క్సెస్ మంత్ర‌

Resonance Knr | జీవితంలో రాణించాలంటే చిన్న‌త‌నం నుంచే సాధ‌న అవ‌స‌ర‌మని మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయ‌ణ అన్నారు. క‌రీంన‌గ‌ర్‌లో రెజొనెన్స్ ఫౌండేష‌న్ కోర్సు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం గురువారం స్థానిక ఎలైట్‌ హోట‌ల్‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. చిన్నారుల‌కు స‌క్సెస్ మంత్రను బోధించారు. ప్ర‌తీ విద్యార్థి మూడు లక్ష్యాలు ఏర్పర్చుకోవాల‌ని.. ఐదు అల‌వాట్లపై దృష్టి సారించాల‌ని సూచించారు.
స‌క్సెస్ మంత్ర ఇదే..
అమ్మానాన్న‌ గ‌ర్వ‌ప‌డేలా ఎదగ‌డం.. చ‌దువుకున్న పాఠ‌శాల‌/క‌ళాశాల‌కు అతిథిగా వెళ్లడం.. సంత‌కం ఆటోగ్రాఫ్ గా మారడం వంటివి లక్ష్యాలను నిర్దేశించుకోవాల‌న్నారు. వీటి సాధ‌న‌ కోసం ప్రతిరోజు 21 గుంజీలు తీయ‌డం, 100 నుంచి 1 వ‌రకు లెక్కించ‌డం, z -a వ‌ర‌కు చ‌ద‌వ‌డం, సుడోకు, ఫజిల్స్ వంటివి చేయ‌డం అల‌వ‌ర్చుకోవాల‌న్నారు. అనంత‌రం చిన్నారుల‌ను పిలిచి ప్ర‌త్యేకంగా ఆటోగ్రాఫ్ ఇచ్చి అభినందించారు.
వారానికి మూడు రోజులు..
సంస్థ డైరెక్ట‌ర్ పూర్ణ‌చంద‌ర్‌రావు మాట్లాడుతూ, ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో రాణించాలంటే ప్రాథ‌మిక స్థాయి నుంచే ఆయా స‌బ్జెక్టుల‌పై ప‌ట్టు సాధించాల‌న్నారు. ఇందుకోసం రిజోనెన్స్ ఫౌండేష‌న్ కోర్సు ను క‌రీంన‌గ‌ర్ వాసుల‌కు అందుబాటులోకి తెచ్చిన‌ట్లు వివ‌రించారు. పోటీ ప‌రీక్ష‌లంటే భ‌యం వీడేలా, ఒత్తిడి లేకుండా ఈ కోర్సును రూపొందించిన‌ట్లు తెలిపారు. వారానికి మూడు రోజుల పాటు నిర్వ‌హించే త‌ర‌గ‌తుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, పిల్ల‌ల బంగారు భ‌విష్య‌త్‌కు బాట‌లు వేయాల‌ని త‌ల్లిదండ్రుల‌కు సూచించారు. కార్య‌క్ర‌మంలో రెజొనెన్స్ సిబ్బంది త‌దితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చ‌ద‌వండి.. తెలంగాణ అస్తిత్వ గానం.. ఉద్యమ రణన్నినాదం