Resonance Knr | జీవితంలో రాణించాలంటే చిన్నతనం నుంచే సాధన అవసరమని మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. కరీంనగర్‌లో రెజొనెన్స్ ఫౌండేషన్ కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం స్థానిక ఎలైట్ హోటల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారులకు సక్సెస్ మంత్రను బోధించారు. ప్రతీ విద్యార్థి మూడు లక్ష్యాలు ఏర్పర్చుకోవాలని.. ఐదు అలవాట్లపై దృష్టి సారించాలని సూచించారు.
సక్సెస్ మంత్ర ఇదే..
అమ్మానాన్న గర్వపడేలా ఎదగడం.. చదువుకున్న పాఠశాల/కళాశాలకు అతిథిగా వెళ్లడం.. సంతకం ఆటోగ్రాఫ్ గా మారడం వంటివి లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. వీటి సాధన కోసం ప్రతిరోజు 21 గుంజీలు తీయడం, 100 నుంచి 1 వరకు లెక్కించడం, z -a వరకు చదవడం, సుడోకు, ఫజిల్స్ వంటివి చేయడం అలవర్చుకోవాలన్నారు. అనంతరం చిన్నారులను పిలిచి ప్రత్యేకంగా ఆటోగ్రాఫ్ ఇచ్చి అభినందించారు.
వారానికి మూడు రోజులు..
సంస్థ డైరెక్టర్ పూర్ణచందర్‌రావు మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ప్రాథమిక స్థాయి నుంచే ఆయా సబ్జెక్టులపై పట్టు సాధించాలన్నారు. ఇందుకోసం రిజోనెన్స్ ఫౌండేషన్ కోర్సు ను కరీంనగర్ వాసులకు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. పోటీ పరీక్షలంటే భయం వీడేలా, ఒత్తిడి లేకుండా ఈ కోర్సును రూపొందించినట్లు తెలిపారు. వారానికి మూడు రోజుల పాటు నిర్వహించే తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో రెజొనెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి.. తెలంగాణ అస్తిత్వ గానం.. ఉద్యమ రణన్నినాదం




