Monday, July 27, 2026
Home Blog Page 2

Be alert | రేపటి నుంచి మార్పులివే.. ఓ లుక్కేయండి మ‌రి

Be alert | ఈ నెల ముగిసింది. రేప‌టి నుంచి జూలై ప్రారంభం కానుంది. ప‌లు విభాగాల్లో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక, సేవా త‌దిత‌ర రంగాల్లో రాబోతున్న మార్పులు ప్ర‌జ‌ల నిత్య‌జీవితంలో ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. ఆధార్‌, ఐటీ, ఎల్‌పీజీ, పాస్‌పోర్ట్‌, రైల్వే త‌దిత‌ర రంగాల్లో రానున్న‌ అప్‌డేట్‌పై ఓ లుక్కెద్దామా మ‌రి.

  • ఎల్‌పీజీ.. : ప‌శ్చిమాసియా యుద్ధ ప్ర‌భావంతో గ్యాస్ నిబంధ‌న‌ల్లో కేంద్రం ఇటీవ‌ల ప‌లు మార్పులు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో ఎల్పీజీ, పీఎన్జీ రెండు క‌నెక్ష‌న్లు ఉన్న వారు ఎల్పీజీ రద్దు చేసుకోవాల‌ని సూచించింది. 90 రోజుల పాటు అవ‌కాశం ఇచ్చింది. నేటితో గడువు ముగియ‌నుంది. ఈ నిబంధ‌న పాటించ‌కుంటే రేప‌టి నుంచి కొత్త ఎల్పీజీ సిలిండర్‌ బుక్ చేసుకోలేరు. అలాగే కేవైసీ పూర్తి చేయకున్నాఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. మ‌రోవైపు ఇటీవ‌ల కేంద్రం ఎల్‌పీజీ ధ‌ర‌లను భారీగా పెంచిన విష‌యం తెలిసిందే. తాజాగా యుద్ధ‌ ప్ర‌భావం త‌గ్గిన నేప‌థ్యంలో ఈ రేట్లు కూడా త‌గ్గే అవ‌కాశాలు లేక‌పోలేదు.
  • ఆధార్ అప్డేట్ : రేప‌టి నుంచి ఆధార్ అప్‌డేట్ కోసం ఉదాయ్‌( UIDAI) ప్రత్యేక సేవను తీసుకువ‌స్తుంది. ఇది వ‌రకు ఈ మెయిల్ చిరునామా న‌వీక‌ర‌ణ చేసుకోవాలంటే రూ. 75 చెల్లించాల్సి వ‌చ్చేది. ఇక నుంచి ఈ సేవ‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు.
  • పెర‌గ‌నున్న పాస్‌పోర్ట్ చార్జీలు.. : జూలై 1 నుంచి పాస్ పోర్ట్ ఫీజులు పెరగనున్నాయి. 36 పేజీల స్టాండర్డ్‌ ఫీజు ఇది వరకు రూ.1,500 ఉండేది. ఇది రూ.2,500 కు పెరిగింది. తత్కాల్ పై తాజాగా రూ. 1500 పెంచారు. దీంతో ప్ర‌స్తుత‌మున్న రూ.3,500 ఫీజు రూ.5,000కు చేరింది. 60 పేజీలు ఉన్న పాస్‌పోర్ట్ ఫీజు ఇదివ‌ర‌కు రూ.2వేలు ఉండ‌గా ప్ర‌స్తుతం రూ.3,500కు చేరింది. తత్కాల్‌ విధానంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.4వేలు చెల్లిస్తుండగా ఇకపై రూ.6వేలు చెల్లించాలి. పాస్ పోర్ట్ పోయిన లేక పాడైపోయిన కొత్త దాని కోసం ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1750 వ‌సూలు చేసేవారు. ఇక నుంచి ఈ చార్జి రూ.4,250 కానుంది.
  • మారిన రైల్వే నిబంధనలు : రైళ్లలో ప్రయాణికుల భద్రత , క్రమశిక్షణను మెరుగుపరిచేందుకు కేంద్రం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ‘జన్ విశ్వాస్ చట్టం’ కింద నిబంధనలను కఠినతరం చేసింది. జూలై 1 నుంచి వీటిని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ ప్రకారం.. రైళ్లలో, స్టేషన్ ప్రాంగణంలో స్మోక్ చేస్తూ పట్టుబడితే భారీ జరిమానా విధిస్తారు. తీవ్ర‌త బ‌ట్టి టికెట్ తక్షణ రద్దుతో పాటు, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అలాగే రిజర్వేషన్ లేని ప్రయాణికులు ఇతరుల బెర్తులను ఆక్రమించుకున్నా, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని రైల్వే శాఖ ఇప్ప‌టికే హెచ్చ‌రించింది.
  • ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌లో.. : 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2 ఫాంలు దాఖలు చేసేందుకు గాను పన్ను చెల్లింపుదారులకు జూలై 31, 2026 వ‌ర‌కు గ‌డువు ఉంది. ఈ లోపు ఐటీఆర్ దాఖలు చేయాలి. లేకుంటే జరిమానాతో పాటు కొన్ని పన్ను విధానాలపై నిషేధానికి కూడా దారితీసే అవ‌కాశం ఉంటుంది.
  •  క్రెడిట్ కార్డ్ నిబంధనలు : ఎంపిక చేసిన ఫోన్ పే, క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ ల‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక నుంచి రివార్డ్ పాయింట్లపై ఎస్‌బీఐ పరిమితులు విధించింది. ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్, సెలెక్ట్ బ్లాక్ వేరియంట్‌లపై ఈ ఎఫెక్ట్ చూప‌నుంది.
  • ఇది కూడా చదవండి.. గుడ్ న్యూస్ వారికి కూడా రైతు భరోసా

Rythu Bharosa | గుడ్ న్యూస్.. వారికి కూడా రైతు భ‌రోసా

 

Rythu Bharosa |  కొత్త రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నూత‌నంగా ప‌ట్టాదారు పాస్ బుక్ పొందిన వారిని రైతు భ‌రోసా(Rythu Bharosa) ప‌థ‌కానికి అర్హులుగా ప్ర‌క‌టించింది. వారికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. మండ‌ల వ్య‌వ‌సాయాధికారుల‌ను సంప్ర‌దించాల‌ని వెల్ల‌డించింది.
క‌టాఫ్ డేట్ ప్ర‌క‌ట‌న‌..
ఈ నెల 15వ తేదీలోపు భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన రైతులను ఈ ప‌థ‌కానికి అర్హులుగా పేర్కొంది. వారికి జూలై 5లోగా ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. మ‌రోవైపు జూన్ 30నుంచి పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్ర‌మంలో కొత్త వారికి కూడా ఈ విడ‌త‌లోనే ల‌బ్ధి చేకూర్చాల‌ని నిర్ణ‌యించింది.
దరఖాస్తు విధానం ఇలా..
ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు త‌మ ఆధార్‌, కొత్త పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌తో అనుసంధాన‌మైన బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్ ప్ర‌తుల‌ను పూర్తి చేసి ద‌ర‌ఖాస్తుతో జ‌త‌చేసి మండ‌ల వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో)లకు సమర్పించాలి. అధికారులు పరిశీలించి అన్ని స‌క్ర‌మంగా ఉంటే లబ్దిదారులుగా ప్ర‌క‌టిస్తారు.
ఈ ప‌థ‌కానికి అర్హులు ఎవ‌రంటే..
ద‌ర‌ఖాస్తు దారు తెలంగాణకు చెందిన రైతు అయి ఉండాలి. అలాగే కనీస వయస్సు 18ఏళ్లు త‌ప్ప‌నిస‌రి. అంతేకాదు భూమి ద‌ర‌ఖాస్తు దారుడి పేరిటే ఉండాలి. అలాగే భూమి సాగుకు యోగ్యంగా ఉండాలి. ఆర్‌వో ఎఫ్ ఆర్ పట్టాదారులు కూడా అర్హులే . అయితే బీడు భూములు, కొండలు, రియల్ ఎస్టేట్ స్థలాల‌కు మాత్రం ఈ పథకం వర్తించదు.
ఎల్లుండి నుంచే పెట్టుబ‌డి సాయం
ఈనెల‌ 30 నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు కాంగ్రెస్ స‌ర్కారు ఇప్ప‌టికే ప్రకటించింది. తొలుత ఎకరం వ‌ర‌కు ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబ‌డి సాయం జ‌మ‌కానుంది. మిగ‌తా వారికి విడ‌త‌ల వారీగా జమ చేయాలని నిర్ణయించింది. ప‌ది రోజుల్లోనే ఈ ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. మ‌రో వైపు కొత్త వారికి ఈ విడ‌త నుంచే రైతు భ‌రోసా షురూ కానుంది.

ఇది కూడా చ‌ద‌వండి.. ఇన్నారుల్లా.. పాస్‌పోర్ట్‌ ఫీజులు పెరుగుతున్న‌య్‌!

Passport | ఇన్నారుల్లా.. పాస్‌పోర్ట్‌ ఫీజులు పెరుగుతున్న‌య్‌!

Passport | అవున్న‌ల్ల మీరు విన్న‌ది నిజ‌మే. జూలై 1 నుంచి పాస్ పోర్ట్ ఫీజులు పెరుగుతున్న‌య్‌. ఈమేర‌కు కేంద్రం నిర్ణ‌యించింది. ఉత్త‌ర్వులు సైతం జారీ చేసింది. ఇక నుంచి స్టాండ‌ర్డ్ పాస్ పోర్ట్ ఫీజు రూ. 2500 ఉండ‌నుంది. తత్కాల్‌ విధానంలో అయితే రూ.5,000 చెల్లించాల్సిందే. ఈమేర‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. 14 ఏళ్ల అనంతరం పెంచుతున్నట్టుగా విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ ఫీజులు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్ల‌డించింది. నిర్వహణ, సాంకేతిక ఖర్చులు పెరగడం కార‌ణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి.

18 ఏళ్లు పైబడిన వారికి (సాధార‌ణ‌, త‌త్కాల్‌)..

  •  36 పేజీల స్టాండర్డ్‌ పాస్‌పోర్టు ఇంతవరకు రూ.1,500 ఫీజు ఉండేది. దీనిపై తాజాగా రూ. 1000 పెంచారు. ఇకపై రూ.2,500 వసూలు చేయ‌నున్నారు. ఇక తత్కాల్ పై తాజాగా రూ. 1500 పెంచారు. దీంతో ప్ర‌స్తుత‌మున్న రూ.3,500 ఫీజు రూ.5,000కు పెరిగింది.
  •  60 పేజీలు ఉన్న సాధార‌ణ పాస్‌పోర్ట్‌పై రూ.1500 పెంచారు. ఫ‌లితంగా ఇప్పుడున్న ఫీజు రూ.2,000 నుంచి రూ.3,500కు చేరింది. ఇదే తత్కాల్‌ విధానంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.4,000 చెల్లిస్తుండగా, ఇకపై రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది.
    పాస్‌పోర్ట్ పోయినా లేదా పాడైపోయినా (పునరుద్ధరణ)..
  • 36 పేజీలకు సంబంధించి సాధారణ విధానంలో రూ.5వేలు, తత్కాల్ లో అయితే రూ.7,500 చెల్లించాలి.
    60 పేజీలకు సాధారణ విధానంలో ఇక నుంచి రూ.6వేలు, తత్కాల్ విధానంలో ₹8,500 వసూలు చేస్తారు.
  • 18 ఏళ్ల లోపు మైనర్లకు36 పేజీల పాస్‌పోర్ట్ విష‌యానికి వ‌స్తే..
  • సాధారణ విధానంలో రూ.1,750 , తత్కాల్ విధానంలో రూ.4,250 ఫీజుగా నిర్ణయించారు.
  • పాడైన/పోయిన వాటి స్థానంలో కొత్తది కావాల‌నుకుంటే.. ఇక‌పై సాధారణ విధానంలో రూ. 4,250, తత్కాల్ విధానంలో ₹6,750 చెల్లించాల్సిందే.
    ఇత‌ర సేవ‌ల‌పై పెరిగిన చార్జీలు ఇలా..
    పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ విషయానికి వ‌స్తే.. మ‌న‌దేశంలో అయితే ఫీజు రూ.750 వ‌సూలు చేస్తారు. విదేశాల్లో అయితే రూ. 4వేలు చెల్లించాల్సి ఉంటుంది.
    సర్టిఫికెట్ ఆఫ్ ఐడెంటిటీ విష‌యంలో భార‌త్‌లో రూ. వెయ్యి, విదేశాల్లో అయితే సుమారు రూ.5వేల‌ ఫీజుగా ఖ‌రారు చేశారు.
  • ఇది కూడా చ‌ద‌వండి.. ‘బయలాట’కు కొత్త ఊపిరి

Bayalata | ‘బయలాట’కు కొత్త ఊపిరి

  • తెలంగాణ గ్రామీణ సంస్కృతికి పునరుజ్జీవం
  • బీజీఏ థియేటర్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ చేయూత‌

Bayalata | కాలం మారుతున్నా… వినోద రూపాల్లో మార్పులొస్తున్నా.. గ్రామీణ సంస్కృతిలో భాగ‌మైన ప‌లు క‌ళారూపాలు నేటికీ ప‌ల్లె ముంగిట‌ క‌దలాడుతూనే ఉన్నాయి. భావి త‌రాల‌కు వార‌స‌త్వ సంప‌ద‌గా నిలుస్తున్నాయి. ప‌ల్లె గుండెలో పుట్టి… ప్రజల జీవితాలతో మమేకమై… సాంస్కృతిక వార‌ధిగా మారిన‌ క‌ళారూపాల్లో బ‌య‌లాట ఒక‌టి. ఆద‌ర‌ణ క‌రువైన ఇప్ప‌టికీ ప్ర‌త్యేక‌త‌ సంత‌రించుకున్న ఈ క‌ళ‌కు పున‌రుజ్జీవం అందించేందుకు ప‌లు సంస్థ‌లు చేయూత‌నందించేందుకు ముందుకు వ‌చ్చాయి.
ఈ క‌ళ ప్ర‌త్యేక‌త‌లు..
బయలాట (Bayalata) అనేది బహిరంగ వీధి నాటక ప్రక్రియ. దీనిని తెలుగులో వీధి నాటకాలు లేదా యక్షగానం అని కూడా పిలుస్తారు. ఆరుబ‌య‌ట, ఆలయాల ఎదుట తాత్కాలిక వేదికలు ఏర్పాటు చేసి రాత్రంతా ప్రదర్శిస్తారు. ఇతిహాసాలు, పురాణాలు, స్థానిక వీరుల కథలే ప్రధానాంశాలుగా ఉంటాయి. వీటిలో దశరత్, సన్నత, దొడ్డట, యక్షనాగ మొదలైనవి ప్ర‌ధాన‌ రూపాలు. హార్మోనియం, డ్రమ్స్ (చండే) , తాళాలతో పాటు నృత్యం, గానం ఇందులో ప్రత్యేక ఆకర్షణ.
అప్పిరెడ్డిప‌ల్లిలో వ‌ర్క్‌షాప్‌..
ఈ జానపద కళను మరింత బలోపేతం చేయ‌డంతో పాటు భావితరాలకు అందించాల‌నే ల‌క్ష్యంతో బీజీఏ థియేటర్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా సంక‌ల్పించింది. ఈమేర‌కు క‌ళాకారుల‌కు ప్ర‌త్యేక‌ శిక్షణ ఇచ్చి కొత్త అవకాశాలు కల్పించాల‌ని భావించింది. ఇందులో భాగంగా 60 రోజుల బయలాట డ్రామా ట్రైనింగ్ వర్క్ షాప్‌న‌కు శ్రీ‌కారం చుట్టింది. నారాయణపేట జిల్లా, మద్దూరు మండలం, అప్పిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం రాత్రి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఆగస్టు 25వ తేదీ వరకు శిబిరం కొన‌సాగ‌నుంది. ఇందులో కళకు సంబంధించిన అభినయం, సంభాషణ, గాత్ర నైపుణ్యం, రంగస్థల నిర్వహణ, పాత్రల రూపకల్పన, జానపద ప్రదర్శన శైలులు వంటి అనేక అంశాలపై క‌ళాకారుల‌కు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ సందర్భంగా థియేటర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీకాంత్ కాడం మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న బయలాట నాటక కళను సంరక్షించడం మాత్రమే కాకుండా దానిని భావితరాలకు చేరవేసి… కళాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ వర్క్ షాప్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అంత‌రించి పోతున్న క‌ళ‌కు జీవం పోస్తున్న వీరిని ప‌లువురు క‌ళాభిమానులు ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి.. సనత్‌నగర్ టిమ్స్‌లో ఉద్యోగావ‌కాశాలు.. ఆల‌స్య‌మెందుకు ద‌ర‌ఖాస్తు చేసుకోండి

TIMS | సనత్‌నగర్ టిమ్స్‌లో ఉద్యోగావ‌కాశాలు.. ఆల‌స్య‌మెందుకు ద‌ర‌ఖాస్తు చేసుకోండి

TIMS | హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) త్వ‌ర‌లో అధికారిక ప్రారంభోత్స‌వానికి సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో భాగంగా వైద్య సేవల‌ను మరింత బలోపేతం చేయాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యించింది. పోస్టుల‌ భ‌ర్తీ పై దృష్టి సారించింది. ఈ బాధ్యతను నిమ్స్ కు అప్పగించింది. టిమ్స్‌లో వివిధ విభాగాల్లో మొత్తం 184 పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు గుర్తించింది. వీటిని కాంట్రాక్ట్ , ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేసేందుకు నిమ్స్ మంగ‌ళ‌వారం మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. వైద్య విభాగం, సాంకేతిక అనుబంధ ఆరోగ్యం, ప‌రిపాల‌న , స‌హాయ‌క‌ సర్వీసుల్లో ఉన్న ఈ ఖాళీలకు అర్హులైన వారి నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. జూలై 6 వరకు అవకాశం కల్పించింది.

  • పోస్టుల‌ వివ‌రాలు ఇలా…
    వైద్య విభాగం : 31
    ఇందులో ఐదు ప్రొఫెసర్ పోస్టులు, రెండు అసోసియేట్ ప్రొఫెసర్‌, 24 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన వారిని యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సీటీవీఎస్ త‌దిత‌ర‌ సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో నియ‌మిస్తారు.
    సాంకేతిక , అనుబంధ ఆరోగ్యం : 122
    టెక్నీషియ‌న్ పోస్టుల్లో ప్ర‌ధానంగా బ్ల‌డ్‌ బ్యాక్‌, ఎంఆర్ఐ, సీటీ, ఎక్స్‌రే, క్యాత్ ల్యాబ్, ల్యాబ్, అనస్థీషియా, సీఎస్‌ఎస్‌డీ, ఈసీజీ, బయోమెడికల్ విభాగాల్లో ఉన్నాయి. ఇక అనుబంధ ఆరోగ్య విభాగాల‌ను ప‌రిశీలిస్తే మెడికల్ రికార్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, స్టాటిస్టిషియన్, రిజిస్ట్రార్, అకౌంట్స్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి.
    ప‌రిపాల‌న స‌హాయ‌క సిబ్బంది : 31
    న్యాయ అధికారి, పీఆర్వో, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్లు, పర్‌ఫ్యూజనిస్టులు, బయోమెడికల్ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హార్డ్‌వేర్‌ఇంజినీర్ వంటి పోస్టుల తో పాటు ఫైర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్లు, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్, ప్లాస్టర్ అసిస్టెంట్లు వంటివి ఉన్నాయి.
  • గుర్తుంచుకోండి..
    వైద్య విభాగం పోస్టులకు జూలై 6న ఉదయం 9 గంటలకు నిమ్స్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయి.
    టెక్నికల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ తదితర పోస్టులకు జూలై 6 సాయంత్రం 4 గంటలలోపు నిమ్స్‌లో ద‌ర‌ఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థుల సంఖ్యను బట్టి ఇంటర్వ్యూ, రాతపరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ చేప‌డుతారు.
  • అర్హతలు , వయోపరిమితి వివరాలు
    వైద్య విభాగం పోస్టులకు ..: సంబంధిత సూపర్ స్పెషాలిటీ విభాగంలో DM/M.Ch/DNB/DrNB అర్హత ఉండాలి. అలా గే నిమ్స్ , ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం బోధనా అనుభవం త‌ప్ప‌నిస‌రి. ఆయా విభాగాలు అనుస‌రించి గరిష్ఠ వయోపరిమితి 50 నుంచి 58 సంవత్సరాలు.
    మిగ‌తా పోస్టుల‌కు : సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, బీఎస్సీ, డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ తదితర విద్యార్హతలను నిర్ణయించారు. వయోపరిమితి ప్ర‌భుత్వ నిబంధనల ప్రకారం వ‌ర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5ఏళ్ల‌, దివ్యాంగులకు 10ఏళ్ల‌ స‌డ‌లింపు ఉంటుంది.
  • దరఖాస్తు, ఫీజుల వివ‌రాలు..
    వైద్య విభాగం పోస్టులకు అర్హులైన వారు నిమ్స్ వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంపూర్తి చేయాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ పత్రాలతో జూలై 6 న ఉదయం 9 గంటలకు నిమ్స్ లో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఫీజు జ‌న‌ర‌ల్ అభ్యర్థులకు రూ. 2వేలు , ఎస్‌సీ, ఎస్‌టీ వారు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది.
    ఇతర పోస్టులకు నోటిఫికేషన్‌లో ఇచ్చిన ద‌రఖాస్తు పూర్తి చేయాలి. విద్యార్హత పత్రాల జిరాక్స్‌లను జతపరిచి జూలై 6వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు నిమ్స్ కార్యాలయంలో స్వయంగా సమర్పించాల్సి ఉంటుంది.జ‌న‌ర‌ల్ అభ్యర్థులు రూ.1,000 , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
  • ఈ ఫీజును ‘ది డైరెక్ట‌ర్‌, నిమ్స్‌, హైద‌రాబాద్’ పేరిట డీడీ రూపంలో లేదా నిమ్స్ ఐపీ బిల్లింగ్ కౌంటర్ వద్ద నేరుగా చెల్లించ‌వచ్చు.
  • ఇది కూడా చ‌ద‌వండి.. మెగాస్టార్ ను క‌లిసిన బీజేపీ చీఫ్‌..చిరు మ‌ళ్లీ క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా..?

Chiranjeevi | మెగాస్టార్‌ను క‌లిసిన బీజేపీ చీఫ్‌.. చిరు మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారా..?

Chiranjeevi | మెగాస్టార్ మ‌ళ్లీ క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా.. బీజేపీ నుంచి ఏమైనా ఆహ్వానం అందిందా.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు అనుమానాల‌కు తావిస్తుండ‌గా.. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తికరంగా మారాయి.  అయితే క‌మ‌లం పార్టీ మాత్రం అదేం లేద‌ని కొట్టి పారేస్తుంది. 
అర‌గంట పాటు చ‌ర్చ‌..
తెలంగాణ బీజేపీ చీఫ్‌ రామచంద్రరావు సోమవారం చిరంజీవిని ఆయ‌న ఇంట్లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు.  కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఇటీవల 12ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ ‘విశేష్‌ జన్‌ సంపర్క్‌ అభియాన్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పుష్కర కాలంలో కేంద్రంలో ఎన్‌డీఏ సర్కారు సాధించిన విజయాలు, కీలక ఘట్టాలను వివరించే పుస్తకాన్ని చిరంజీవికి  అందజేసిన‌ట్లు రామ‌చంద్ర‌రావు తెలిపారు.  స‌మాజం, సంస్కృతి, దేశ నిర్మాణం, సినీరంగం, సంక్షేమ ప‌థ‌కాలు తదితర అంశాలపై చర్చించినట్లు  పేర్కొన్నారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌ముఖుల‌ను క‌ల‌వ‌డంలో భాగంగా మెగాస్టార్‌ను కూడా క‌లిసిన‌ట్లు వివ‌రించారు. ఇందులో ఎలాంటి రాజ‌కీయ చ‌ర్చ లేద‌ని స్ప‌ష్టం చేశారు.  అయితే పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో మాత్రం చిరు మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తారా అనే చ‌ర్చ మొదలైంది.
చిరంజీవి రాజకీయ ప్రస్థానం ..
సామాజిక మార్పు, సమన్యాయం నినాదాలతో చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ (PRP)ని  స్థాపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలను కైవ‌సం చేసుకున్నారు. మెగాస్టార్‌ స్వ‌యంగా రెండు చోట్ల పోటీ చేసి తిరుపతిలో విజ‌యం సాధించారు. ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం ఊపందుకున్న స‌మ‌యంలో అనూహ్య, ఆస‌క్తిక‌ర‌ రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో 2011 ఆగస్టులో పీఆర్పీని నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటుతో పాటు కేంద్ర‌ మంత్రి పదవి వ‌రించింది.  2012 అక్టోబర్ నుంచి 2014 మే వరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కొన‌సాగారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో హ‌స్తం పార్టీ పూర్తిగా బ‌ల‌హీన ప‌డింది. ఈ క్ర‌మంలో వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. అప్ప‌టి నుంచి పూర్తిగా సినీరంగానికే ప‌రిమిత‌మ‌య్యారు.  కాగా, చిరంజీవి సోద‌రుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన అధినేతగా, ఏపీ డిప్యూటీ సీఎంగా కొన‌సాగుతుండ‌గా.. కేంద్రంలోని ఎన్డీఏలోనూ కీల‌క భాగ‌స్వామి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో రానున్న రోజుల్లో మెగాస్టార్‌ను బీజేపీలోకి ఆహ్వానించి ఆయ‌న‌కు కీల‌క బాధ్య‌త‌లు ఏమైనా అప్ప‌గిస్తారా అనే ఊహాగానాలు ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో వినిపిస్తున్నాయి.

Greater news | మారిన ‘గ్రేట‌ర్’..  ఎవ‌రికి క‌లిసొచ్చేనో?

Greater news | ఇటీవ‌ల పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తాచాటి ఊపుమీదున్న రేవంత్‌ స‌ర్కారు గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై దృష్టి సారిస్తోంది. స‌ర్ (SIR) ప్ర‌క్రియ పూర్త‌యిన వెంట‌నే న‌వంబ‌ర్‌లో నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. అయితే ఈ సారి  గ్రేట‌ర్ ప‌రిధి మూడు కార్పొరేష‌న్లుగా మారింది. జీహెచ్ఎంసీతో పాటు అద‌నంగా సైబరాబాద్‌, మల్కాజిగిరి మునిసిపల్‌ కార్పొరేషన్లు చేరాయి. డివిజన్ల సంఖ్య కూడా 150 నుంచి 300కు పెరిగాయి.  ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు నెల‌లే గ‌డువు ఉండ‌డంతో ప్ర‌ధాన పార్టీలు ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ధం అవుతున్నాయి. శ్రేణులతో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తూ గెలుపే లక్ష్యంగా పావులు క‌దుపుతున్నాయి. గ‌తంలో రెండు సీట్లు మాత్ర‌మే ఉన్న కాంగ్రెస్ ఈ సారి ఎలాగైనా పీఠం ద‌క్కించుకోవాల‌ని భావిస్తోంది. ఇక‌ గులాబీ పార్టీ హ్యాట్రిక్ పై దృష్టి సారించింది. ప‌తంగి పార్టీ గ‌తంతో పోల్చితే సారి మ‌రిన్ని సీట్లు పెంచుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తోంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో దూసుకొచ్చిన క‌మ‌లం పార్టీ ఈ సారి గ్రేట‌ర్‌లో ఎలాగైనా  పాగా వేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇటీవ‌ల  నూత‌న పార్టీగా ఆవిర్భ‌వించిన టీఆర్ ఎస్ (తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌) కూడా  ఈ ఎన్నిక‌లను స‌వాలుగా తీసుకుంటోంది.  మ‌రోవైపు టీడీపీ మ‌ళ్లీ తెలంగాణ‌లో పున‌ర్‌వైభ‌వం కోసం పావులు క‌దుపుతోంది. అలాగే జ‌న‌సేన సైతం ఇక్క‌డ పోటీకి సై అంటోంది.
2016, 2020 గ్రేట‌ర్‌ ఫ‌లితాలు ఇలా.. 
  • 2016 ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి విజ‌య దుందుబి మోగించింది. ఏకంగా 99 సీట్ల‌తో  అధ్య‌క్ష పీఠం కైవ‌సం చేసుకుంది. సున్నా నుంచి సెంచ‌రీ మార్కుకు చేరువైంది.  ఈ ఎన్నిక‌ల్లో ఏఐఎంఐఎం 44 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే బీజేపీ నాలుగు సీట్ల‌కు ప‌రిమితం కాగా.. గ‌తంలో 52 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నిక‌ల్లో కేవ‌లం రెండు  స్థానాల‌కు ప‌డిపోయింది. మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప‌రిమిత‌మైన‌ టీడీపీ ఒక స్థానంతో ఉనికి చాటుకుంది.
  • ఇక 2020 ఫలితాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. రాష్ట్రంలో రెండో సారి తెలంగాణ రాష్ట్ర స‌మితి అధికారంలో కొన‌సాగినా గ‌తంతో పోల్చితే స్థానాలు త‌గ్గాయి. అయితే 55 స్థానాల‌తో టాప్‌లో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ప‌తంగి పార్టీకి ఈ సారి కూడా 44 స్థానాలే ద‌క్కాయి. బీజేపీ మాత్రం పూర్తిగా బ‌ల‌ప‌డింది. 4 నుంచి 48 స్థానాల‌కు ఎగ‌బాకింది. రాజ‌ధానిలోనూ క‌మ‌లం పార్టీ బలోపేతమైనట్లుగా సంకేతాలిచ్చింది. ఈ సారి కూడా కాంగ్రెస్ రెండు సీట్ల‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం. సైకిల్ పార్టీ ఈ సారి కోటా తెర‌వ‌లేదు.
మారిన గ్రేట‌ర్ స్వ‌రూపం .. 
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్వరూపం ఇటీవ‌ల మారిపోయింది. జీహెచ్​ఎంసీని ప్ర‌భుత్వం మూడు కార్పోరేష‌న్లుగా పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రింది. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌, మల్కాజిగిరి మునిసిపల్‌ కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్‌ఎంసీ గ‌త పాలకమండలి గడువు ఫిబ్రవరి 10, 2026 వ తేదీతో ముగిసిన విష‌యం తెలిసిందే. ఆ వెంట‌నే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్ర‌స్తుతం గ్రేట‌ర్ ప‌రిధిలో ప్ర‌త్యేక అధికారుల పాల‌న సాగుతోంది.
పెరిగిన డివిజన్లు..
గ‌తంలో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 150 డివిజన్లు ఉండ‌గా.. డీలిమిటేషన్ త‌ర్వాత 243కు చేరాయి. విలీన మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ల‌ పరిధిలో మ‌రో 57 నూత‌నంగా ఏర్పాటయ్యాయి. ప్ర‌స్తుతం ఈ సంఖ్య‌ 300 కు చేరింది.
జోన్లు ఇలా.. 
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిని ఆరు జోన్లు (శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, చార్మినార్‌, గోల్కొండ, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌)గా, 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా విభజించారు.  సైబరాబాద్‌ కార్పొరేషన్‌లో మూడు జోన్‌లు(శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌), 76 డివిజన్లుగాఉన్నాయి. మల్కాజిగిరిని ప‌రిశీలిస్తే ఈ కార్పొరేషన్ ప‌రిధిలో ఎల్‌బీనగర్, ఉప్పల్‌, మల్కాజిగిరి మూడు జోన్లుగా ఉండ‌గా డివిజన్లు 74 ఉన్నాయి.

 Rythu Bharosa | రైతు భ‌రోసా.. డేట్ ఫిక్స్‌

 Rythu Bharosa | రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురు అందించింది.  అన్న‌దాత‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఏటా రెండు సార్లు సాగు పెట్టుబ‌డి సాయం  అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా  ఈ వానాకాలం సీజ‌న్‌కు సంబంధించి రైతు భ‌రోసా డేట్ ను తాజాగా  ఫిక్స్ చేసింది. ఈ నెల 26 నుంచి విడ‌త‌ల వారీగా విడుద‌ల చేయాల‌ని భావిస్తోంది.  సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన‌ వ్య‌వ‌సాయ శాఖ స‌మీక్షలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో కోటి 50 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు ఈ స్కీం వ‌ర్తింప‌జేయ‌నున్నారు. ఎక‌రానికి రూ. 6వేల చొప్పున దాదాపు రూ.9వేల కోట్లు అవ‌స‌రం కానున్న‌ట్లుగా వ్యవసాయ, ఆర్ధికశాఖ ప్ర‌తిపాదించింది. ఈమేర‌కు సీఎం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ నెల 18న రాష్ట్ర కేబినెట్ దీనికి ఆమోద‌ముద్ర వేయ‌నుంది.
విడతల వారీగా జమ
కేబినెట్ ఆమోద ముద్ర‌ త‌ర్వాత నిధులు విడుద‌ల కానున్నాయి.  లబ్దిదారులకు విడతల వారీగా బదిలీ చేయనున్నారు. తొలుత ఈనెల 26న రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు తొలుత ఎకరంలోపు వారి ఖాతాల్లో జ‌మ చేస్తారు. తర్వాత మిగిలిన వారికి విడతల వారీగా అందించ‌నున్నారు.  గ‌తంలో వ‌చ్చిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఈ విడ‌త‌లో తొమ్మిది రోజుల్లోనే నిధుల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.
ఈనెల 20న కిసాన్ స‌మ్మాన్ నిధి
ఈ వానాకాలం సీజ‌న్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల‌ 20న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) 23వ విడత నిధులు విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. అర్హులైన‌ రైతుల బ్యాంకు ఖాతాల్లో వీటిని  జ‌మ చేస్తారు. అయితే కేంద్రం కేవైసీ నిబంధ‌న త‌ప్ప‌నిస‌రి చేసింది.

Peace deal | హ‌మ్మ‌య్య‌.. ముగిసిన‌ట్లేనా.. ఇక ఇంధ‌న ధ‌ర‌లు త‌గ్గుతాయా..?

Peace deal | ఆ యుద్ధం ఇక ముగిసిన‌ట్లేనా… అమెరికా శాంతించిందా.. ఇరాన్ మెట్టు దిగిందా అంటే తాజా ప‌రిస్థితులు అవున‌నే సంకేతాలు ఇస్తున్నాయి. ఇరాన్‌- అమెరికా (Iran- America) ఉద్రిక్త‌త‌ల‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. దాదాపు వంద రోజులకు పైబ‌డి కొన‌సాగిన దాడుల‌కు ఇక‌ ఫుల్‌స్టాప్ ప‌డ‌నుంది.
మూడు నెల‌ల ఉత్కంఠ‌కు తెర‌
దాదాపు మూడున్నర నెల‌ల పాటు పశ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులతో ప్ర‌పంచానికి కంటి మీద కునుకు క‌రువైంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య యుద్ధం కారణంగా నిత్యం బాంబుల మోత‌లు మోగాయి. చ‌మురు క్షేత్రాలు ధ్వంస‌మ‌య్య‌యి. వేల‌ల్లో ప్రాణ‌న‌ష్టం వాటిల్లింది. కోలుకోలేని విధంగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. ఇంధ‌న‌ స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డింది. అంత‌ర్జాతీయంగా తీవ్ర ప్ర‌భావం చూపింది. చ‌మురు ధ‌ర‌లకు రెక్క‌లొచ్చి ఆయా దేశాల‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను చిన్నాభిన్నం చేసింది. ఒక్క‌సారిగా ప్ర‌పంచం అత‌లాకుత‌ల‌మైంది. ఎట్ట‌కేల‌కు అగ్ర‌రాజ్యం శాంతి చ‌ర్చ‌ల‌కు అంగీక‌రించింది. భారీ న‌ష్టం నేప‌థ్యంలో ఇరాన్ కూడా ప‌ట్టువీడి ఓ మెట్టు దిగింది. ఫ‌లితంగా యుద్దం చివ‌రి అంకానికి చేరువైంది. త్వ‌ర‌లోనే ముగిసిన‌ట్లుగా అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఇదే జ‌రిగితే హోర్ముజ్ జ‌ల‌సంధి ఆంక్ష‌లు లేకుండా తెరుచుకోనుంది. మ‌రికొద్ది రోజుల్లో ఇంధ‌న స‌ర‌ఫ‌రా ఇక్క‌ట్లు తొల‌గిపోనున్నాయి. దీంతో ధ‌ర‌లు కూడా మ‌ళ్లీ దిగివ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు.
శాంతి ఒప్పందం..
యుద్ధానికి తెరదించుతూ అమెరికా, ఇరాన్‌లు శాంతి ఒప్పందాన్ని (Peace Deal) ఖరారు చేశాయి. తక్షణమే సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లుగా ఇరుదేశాలు ప్రకటించాయి. జూన్ 19న స్విట్జర్లాండ్ వేదికగా అధికారిక ఒప్పందంపై ఆయా దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఈ ఒప్పందానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. ప్రపంచ దేశాలు స్వాగతించాయి. ఖతార్, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్ తో పాటు జర్మనీ, ఫ్రాన్స్ త‌దిత‌ర దేశాలు హ‌ర్షం వ్య‌క్తం చేశాయి. మ‌రో వైపు ఈ ఒప్పందంపై ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. ‘ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.. హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఇకపై ఎలాంటి ఆటంకాలు లేకుండా కొన‌సాగుతాయి.. ‘ అని వెల్ల‌డించారు. ‘ప్రపంచ నౌకలారా, మీ ఇంజన్లు స్టార్ట్ చేయండి…’ అని ఉత్సాహంగా ట్వీట్ కూడా చేశారు. మ‌రోవైపు శాంతి చ‌ర్చ‌ల‌ విష‌యాన్నిఆదివారం ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరిబాబాడి కూడా ధృవీకరించారు. ఈ ఒప్పందంపై ఈ నెల‌ 19న అధికారిక సంతకాలు ఉంటాయ‌ని శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వెల్ల‌డించారు.
చ‌మురు ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం.. ?
శాంతి ఒప్పందం కుదిరి అంతా అనుకున్న‌ట్లుగా జ‌రిగితే ప్ర‌పంచ ఇంధ‌న ర‌వాణాకు కీల‌క‌మైన హోర్ముజ్ జలసంధి గుండా రాక‌పోక‌లు సుల‌భ‌త‌రం కానున్నాయి. ఆకాశ‌న్నంటిన చ‌మురు ధ‌ర‌లు మ‌ళ్లీ దిగివ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా పుంజుకోనున్న‌ట్లుగా వెల్ల‌డిస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి.. : న‌వంబ‌ర్‌లో గ్రేట‌ర్‌.. ? ఆ పార్టీల స్ట్రాట‌జీ డిఫ‌రెంట్‌!

Greater elections | న‌వంబ‌ర్‌లో ‘గ్రేట‌ర్‌’..? ఆ పార్టీల స్ట్రాట‌జీ డిఫ‌రెంట్‌!

Greater elections | తొల‌క‌రితో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డినా మ‌హాన‌గ‌రంలో రాజ‌కీయం మాత్రం వేడెక్కుతోంది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధం అవుతున్న నేప‌థ్యంలో ఆయా పొలిటిక‌ల్ పార్టీల్లో సంద‌డి మొద‌లైంది. జీహెచ్‌ఎంసీ ప‌రిధిలోని హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ స‌ర్కారు భావిస్తోంది. ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు ముమ్మ‌రం చేస్తోంది. ఈ నెల 15 నుంచి చేప‌ట్టిన ప్రత్యేక విస్తృత సవరణ (SIR) సెప్టెంబ‌ర్ చివ‌ర‌న ముగియనుంది. అక్టోబ‌ర్ 1న తుది ఓట‌రు జాబితా ప్ర‌క‌టించిన అనంత‌రం ఈసీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ చేసే అవ‌కాశాలున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే ఆయా పార్టీలు క్షేత్ర‌స్థాయిపై దృష్టి సారించాయి.
రాజ‌ధానిలో డిఫ‌రెంట్ పాలిటిక్స్‌..
మినీ ఇండియాగా పేరొందిన రాష్ట్ర రాజ‌ధానిలో పాలిటిక్స్ కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటాయి. భిన్న ప్రాంతాలు, సంస్కృతులకు చెందిన ఓట‌ర్లు ఇక్క‌డ ఉన్నారు. మైనార్టీలు, ఆంధ్ర సెటిల‌ర్స్ ప్ర‌భావం కొంత చూపే అవ‌కాశం ఉంటుంది. అందుకే అన్ని రాజ‌కీయ పార్టీలు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాయి. ఆచితూచి అడుగులు వేస్తాయి. ఈ సారి కూడా పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారే అవ‌కాశం ఉంది. గ్రేట‌ర్ ప‌రిధిలో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్‌, ఎంఐఎం ప్ర‌ధాన పార్టీలుగా ఉండ‌గా.. ఈసారి క‌విత సార‌థ్యంలోని టీఆర్ఎస్ (తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌) కూడా సై అంటుంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత సైతం గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపిన టీడీపీ మ‌రోసారి పోటీకీ ఉవ్విల్లూరుతోంది. జ‌న‌సేక కూడా ఈ సారి బ‌రిలోకి దిగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.
ఫోక‌స్ పెంచిన పార్టీలు..

  • రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ స‌ర్కారు ఇటీవ‌ల నిర్వ‌హించిన పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన విష‌యం తెలిసిందే. గ్రేట‌ర్‌లోనూ అదే ఊపు కొన‌సాగించాల‌ని భావిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవ‌ల మూడు కార్పోరేషన్ల ప‌రిధిలో శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు ముమ్మ‌రం చేశారు. కార్య‌క‌ర్త‌ల‌ను స‌న్న‌ద్ధం చేస్తున్నారు. గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగాల‌ని సూచిస్తున్నారు.
  •  గ‌త రెండు ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన బీఆర్ ఎస్ ఈ సారి అదే ఊపు కొన‌సాగించాల‌ని భావిస్తోంది. హ్త్యాట్రిక్ దిశ‌గా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికారానికి దూర‌మైన ఆ పార్టీ మెజార్టీ స్థానాలను మాత్రం గ్రేట‌ర్ ప‌రిధిలోనే కైవ‌సం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇది త‌మ‌కు క‌లిసివ‌చ్చే అవ‌కాశంగా ఆ పార్టీ అధి నాయ‌కత్వం చెప్పుకుంటుంది. ఇప్ప‌టికే స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ క్యాడ‌ర్‌లో ఉత్సాహం నింపుతోంది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
  • గ్రేట‌ర్ అన‌గానే గుర్తొచ్చేది ఏఐఎంఐఎం. ఈ పార్టీకి నిల‌క‌డైన ఓటు బ్యాంకు ఉంది. గ‌త రెండు ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫలితాలే ఇందుకు నిద‌ర్శ‌నం. దాదాపు 30శాతం స్థానాల‌ను కైవ‌సం చేసుకోవ‌డం ఆన‌వాయితీగా మారింది. ఈ సారి మ‌రింత మెరుగైన ఫ‌లితాలు సాధించి స‌త్తా చాటాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే అంత‌ర్గ‌త స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ ముందుకు సాగుతోంది.
  • ఇక గ‌త ఎన్నిక‌ల్లో 4 నుంచి 48 స్థానాల‌కు ఎగ‌బాకిన బీజేపీ ఈసారి పూర్తిస్థాయిలో ప‌ట్టు సాధించాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన క‌మ‌లం పార్టీ రాష్ట్ర రాజ‌ధానిలోనూ పాగా వేసేందుకు అడుగులు వేస్తోంది. ఇటీవ‌ల నిర్వ‌హించిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన ఆ పార్టీ అనంత‌రం తెలంగాణ‌పై ఫోక‌స్ పెంచింది. ఇందులో భాగంగా గ‌తనెల‌లో హైద‌రాబాద్‌లో ప్ర‌ధాని మోదీ స‌భ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం ఆ పార్టీలో అంత‌ర్గ‌త విబేధాలు కొంత వారికి ప్ర‌తికూలంగా మారే అవ‌కాశం ఉన్న‌ట్లుగా పొలిటిక‌ల్ స‌ర్కిల్లో టాక్. అధిష్టానం స‌త్వ‌రం స్పందించి చ‌ర్య‌లు చేప‌డితే మాత్రం మెజార్టీ స్థానాలు ద‌క్కే అవ‌కాశం లేక‌పోలేదు.
  • ఇటీవ‌ల కల్వ‌కుంట్ల క‌విత సార‌థ్యంలో ఆవిర్భ‌వించిన టీఆర్ఎస్ ( తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌) పార్టీ ఈ ఎన్నిక‌ల్లో తొలిసారిగా బ‌రిలో నిల‌వాల‌ని భావిస్తున్నారు. ఆ పార్టీ చీఫ్ ఇటీవ‌ల గ్రేటర్ ప‌రిధిలో వ‌రుస స‌మీక్ష‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. క్షేత్ర‌స్థాయి బ‌లోపేతంపై దృష్టి సారిస్తున్నారు. గ్రేట‌ర్‌ప‌రిధిలోని మాజీ ప్ర‌తినిధుల చేరిక‌పై ఫోక‌స్ పెంచారు. మొన్న‌టి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ బ‌ల ప‌రిచిన అభ్య‌ర్థులు ప‌లుచోట్ల విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ గ్రేట‌ర్‌లోనూ స‌త్తా చాటి రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాము కీల‌కం కానున్నామ‌నే సంకేతం ఇవ్వాల‌ని భావిస్తున్నారు.
  • ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ బ‌లంగా ఉండేది. గ‌తంలో ఆ పార్టీ గ్రేటర్ ప‌రిధిలో మంచి ఫ‌లితాల‌నే సాధించింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత పార్టీ పూర్తిగా ఏపీకే ప‌రిమిత‌మైనా రెండుసార్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి స‌త్తా చాటింది. మూడో సారి మాత్రం పోటీకి ఆస‌క్తి చూప‌లేదు. ప్ర‌స్తుతం ఏపీలో కూటిమి ప్ర‌భుత్వంగా అధికారంలో ఉన్న ఆ పార్టీ తెలంగాణ‌లోనూ పార్టీకి పూర్వ‌వైభ‌వం తీసుకురావాలని భావిస్తోంది. ఇటీవ‌ల నిర్వ‌హించిన‌ మ‌హానాడులో ఆ పార్టీ నేష‌న‌ల్‌ వ‌ర్కింగ్ ప్రెసిడింట్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. రానున్న గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లుగాన నారా లోకేశ్ సంకేతాలివ్వ‌డం గ‌మ‌నార్హం.
  •  ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక నుంచి తెలంగాణ‌లోనూ తాము పోటీచేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఏపీలో టీడీపీ, బీజేపీతో కూట‌మిగా ఉన్న జ‌న‌సేన ఇక్క‌డ మాత్రం ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు. అయితే ఎన్నిక‌ల వ‌ర‌కు ఒక‌వేళ పొత్తు పొడిస్తే మాత్రం సానుకూల ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.
  • ఇది కూడా చ‌ద‌వండి.. : స‌ర్కారు బడి @ కార్పొరేట్ స్ట‌డీ .. ఇందులో సీటు హాట్ కాదా మ‌రి!