Rythu Bharosa | కొత్త రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నూతనంగా పట్టాదారు పాస్ బుక్ పొందిన వారిని రైతు భరోసా(Rythu Bharosa) పథకానికి అర్హులుగా ప్రకటించింది. వారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మండల వ్యవసాయాధికారులను సంప్రదించాలని వెల్లడించింది.
కటాఫ్ డేట్ ప్రకటన..
ఈ నెల 15వ తేదీలోపు భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన రైతులను ఈ పథకానికి అర్హులుగా పేర్కొంది. వారికి జూలై 5లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు జూన్ 30నుంచి పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో కొత్త వారికి కూడా ఈ విడతలోనే లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది.
దరఖాస్తు విధానం ఇలా..
దరఖాస్తు చేసుకునే వారు తమ ఆధార్, కొత్త పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్ ప్రతులను పూర్తి చేసి దరఖాస్తుతో జతచేసి మండల వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో)లకు సమర్పించాలి. అధికారులు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే లబ్దిదారులుగా ప్రకటిస్తారు.
ఈ పథకానికి అర్హులు ఎవరంటే..
దరఖాస్తు దారు తెలంగాణకు చెందిన రైతు అయి ఉండాలి. అలాగే కనీస వయస్సు 18ఏళ్లు తప్పనిసరి. అంతేకాదు భూమి దరఖాస్తు దారుడి పేరిటే ఉండాలి. అలాగే భూమి సాగుకు యోగ్యంగా ఉండాలి. ఆర్‌వో ఎఫ్ ఆర్ పట్టాదారులు కూడా అర్హులే . అయితే బీడు భూములు, కొండలు, రియల్ ఎస్టేట్ స్థలాలకు మాత్రం ఈ పథకం వర్తించదు.
ఎల్లుండి నుంచే పెట్టుబడి సాయం
ఈనెల 30 నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే ప్రకటించింది. తొలుత ఎకరం వరకు ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకానుంది. మిగతా వారికి విడతల వారీగా జమ చేయాలని నిర్ణయించింది. పది రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో వైపు కొత్త వారికి ఈ విడత నుంచే రైతు భరోసా షురూ కానుంది.
ఇది కూడా చదవండి.. ఇన్నారుల్లా.. పాస్‌పోర్ట్ ఫీజులు పెరుగుతున్నయ్!


