Tuesday, June 9, 2026

Eapcet counseling | ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు వేళాయె..

  • ఈనెల 19 నుంచి షురూ
  • షెడ్యూల్ విడుద‌ల చేసిన ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ
    Eapcet counseling | ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వం ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఏర్పాటుకు సిద్ధమైంది. గ‌త నెల‌లో ప్రవేశ‌ ప‌రీక్ష నిర్వ‌హించి ఫ‌లితాల‌ను కూడా ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. ఫీజుల చెల్లింపు అంశం కోర్టుప‌రిధిలో ఉండ‌డంతో కొంత‌ ఆల్య‌మైన‌ట్లుగా తెలుస్తోంది. తాజాగా కౌన్సెలింగ్ ప్రక్రియకు శ్రీ‌కారం చుట్టింది . ఈ నెల 19 నుంచి షురూ కానుంది. ఈ సారి కూడా మూడు విడతల్లో నిర్వ‌హించాల‌ని ఎప్‌సెట్ ప్ర‌వేశాల క‌మిటీ నిర్ణ‌యించింది. తొలి విడత జూలై 14 నాటికి, రెండో విడత జూలై 19 వ‌ర‌కు, తుది విడత జూలై 29 వ‌ర‌కు నిర్వ‌హించేలా షెడ్యూల్ ఖ‌రారు చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ సారి కౌన్సెలింగ్‌తోపాటు బి కేటగిరీ సీట్ల భర్తీ ఒకేసారి కొన‌సాగ‌నుంది.

మొద‌టి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ..

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ : జూన్ 19 నుంచి 28 వరకు
    స‌ర్టిఫికెట్ల పరిశీలన : 22 నుంచి 29 వరకు
    వెబ్ ఆప్షన్ల ప్రక్రియ : 25 నుంచి జూలై 1 వరకు
    మాక్ సీట్ల కేటాయింపు : జూలై 4 లోపు
    వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం : జూలై 5 నుంచి 7 వరకు
    సీట్ల కేటాయింపు : జూలై 10 లోపు
    సెల్ఫ్‌ రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు : జూలై 18 నుంచి 22 వరకు

రెండు, మూడు విడతల కౌన్సెలింగ్‌ ఇలా..

  • రెండో విడత : జూలై 17 – 28 వరకు
    చివరి విడత : జూలై 31 – ఆగస్టు 7వరకు

ఇవి గుర్తుంచుకోండి..

  • కౌన్సెలింగ్ ప్ర‌క్రియ పూర్త‌య్యాక‌ ఆగ‌స్టు 12 నుంచి 17వ తేదీ వరకు ఇంట‌ర్న‌ల్ స్లైడింగ్‌కు అవ‌కాశం ఉంటుంది. విద్యార్థులు అప్పటికే చేరిన కళాశాలలో కోరుకున్న బ్రాంచిలో ఇంకా సీట్లు ఖాళీ ఉంటే అందులోకి సుల‌భంగా మార‌వ‌చ్చు. ఇలా మారినా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది.
  • తొలి విడతలో సీట్లు పొందిన వారు బెట‌ర్ క‌ళాశాల‌, బెట‌ర్ బ్రాంచి క‌నుక కోరుకుంటే రెండో విడ‌త‌లో మ‌ళ్లీ ఫ్రెష్‌గా వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చుకోవాలి.
  • రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థులు సీటు పొందిన కళాశాలలో తప్పనిసరిగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆ సమయంలో టీసీ మాత్రమే ఒరిజిన‌ల్‌ది అంద‌జేయాలి. మిగిలిన స‌ర్టిఫికెట్స్‌ జిరాక్స్ ఇస్తే సరిపోతుంది.
  • అయితే సెకండ్ ఫేజ్ వ‌ర‌కు సీట్లు రద్దు చేసుకోవచ్చు. చెల్లించిన ఫీజు కూడా వెనక్కి ఇస్తారు. చివరి విడతలో మాత్రం అలాంటి అవకాశం ఉండదు.

ఇది కూడా చ‌ద‌వండి.. ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల ఫీజులు ఎంతో తెలుసా..

Hot Topics

Related Articles