తిరుమలలో పరిస్థితి
Thirumala & Gold | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం ఉదయం 8 తరువాత వెళ్లే భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతుంది. రూ.300ల శీఘ్రదర్శనానికి 3-5 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 5 నుంచి 7 గంటల సమయం పడుతుంది.
బుధవారం .. స్వామివారిని 82,255 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.76 కోట్లు ఆదాయం సమకూరింది. 4.43 లక్షల లడ్డూలను విక్రయించారు. ఇక అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య 2.64 లక్షలు.
బంగారం, వెండి ధరలు
ప్రస్తుతం ఆషాడం నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు మాత్రమే చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు (16 జూలై) హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,43,580 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల ధర పరిశీలిస్తే రూ.1,31,610గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ. 10 మాత్రమే పెరిగింది. అలాగే 18 క్యారెట్లను పరిశీలిస్తే రూ.1,07,470గా ఉన్నది. ఇక వెండి కిలో ధర రూ.2,40,100గా ఉంది.
ఇది కూడా చదవండి… ఎలక్షన్‌కు సన్నద్ధం.. కేడర్‌కు దిశానిర్దేశం


