PETRO SHOCK | పశ్చిమాసియా పరిస్ఠితుల నేపథ్యంలో ఇప్పటికే గ్యాస్ ధరలను పెంచిన కేంద్రం తాజాగా పెట్రో వడ్డన చేసింది. లీటర్ పెట్రోల్(petrol)పై రూ.3, డీజిల్‌పై రూ. 3చొప్పున పెంచుతూ ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. శుక్రవారం ఉదయం నుంచే ఈ పెంపుదలను అమలులోకి తెచ్చాయి. ఈ ప్రభావం నిత్యావసరాల ధరలపై పడనున్నాయి. సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది.
మరింత పెరిగే అవకాశం…?
పెట్రో ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కసారిగా భారీగా కాకుండా కొద్దికొద్దిగా పెంచుతూ పోనున్నట్లుగా తెలుస్తోంది. గడిచిన నాలుగేళ్లుగా పెట్రో ధరలు స్థిరంగా ఉండగా తాజా పెంపు ఎంత వరకు వెళుతుందో అని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు ఇలా …
హైదరాబాద్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.3.39 పెరిగి రూ.110.89కు చేరువైంది. అలాగే డీజిల్ రూ.98.96కు చేరింది. వరంగల్‌లో పెట్రోల్ రూ.110.53లు, డీజిల్ రూ.98.65లు, కరీంనగర్‌లో రూ.110.55లు, డీజిల్ రూ.98.78లకు చేరువయ్యయి.
ఇది కూడా చదవండి.. వాళ్లు మామూలు దొంగలు కాదు.. ప్రొఫెషనల్ కేటుగాళ్లు.. జీతాలుంటయట.. కమీషన్లు వస్తయట!




