Gold news | బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల కేంద్రం గోల్డ్(Gold), సిల్వర్ దిగుమతులపై పన్నులు పెంచడంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల నేపథ్యంలో మళ్లీ దిగివస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు సూచిస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు శనివారం ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,57,900 పలికింది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ. 4,420 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర ప్రస్తుతం రూ.1,44,740 ఉండగా.. శుక్రవారం 1,48,790 ఉన్న విషయం తెలిసిందే. ఇది కూడా ఏకంగా రూ. 4,050 తగ్గింది. వెండి ప్రస్తుతం రూ.2,89,900 ఉండగా నిన్నటితో పోల్చితే రూ. 10వేల వరకు తగ్గింది.
మిగతా ప్రాంతాల్లో (10గ్రాములు) ఇలా..
ఢిల్లీలో.. 24 క్యారెట్లు రూ.1,58,050, 22 క్యారెట్లు రూ.1,44,890
చెన్నైలో.. 24 క్యారెట్లు రూ.1,61,070, 22 క్యారెట్లు రూ.1,47,640
బెంగళూరులో.. 24 క్యారెట్లు రూ.1,57,900, 22 క్యారెట్లు రూ.1,44,740
కోల్‌కతాలో.. 24 క్యారెట్లు రూ.1,57,900 , 22 క్యారెట్లు రూ.1,44,740
ముంబైలో.. 24 క్యారెట్లు రూ.1,57,900 , 22 క్యారెట్లు రూ.1,44,740
ఇది కూడా చదవండి.. ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వర్క్ ఫ్రం హోం షురూ




