Monday, July 27, 2026
Home Blog Page 7

Vijay what next | విజ‌య్‌కు రికార్డుస్థాయి మెజారిటీ..?

Vijay what next | అవును మీరు వింటుంది నిజ‌మే.. టీవీకే ఇక సొంతంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుందా అంటే అవున‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఆ స్ట్రాట‌జీ వ‌ర్క‌వుట‌యితే ప్ర‌స్తుతం త‌మిళ‌నాడుకే ప‌రిమిత‌మైన విజ‌య్ ఇక దేశ‌రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన మార్కు చూపే అవ‌కాశం లేక‌పోలేదు.
విజ‌య్ రాజీనామా అస్త్రం..?
మే 5న విడుద‌లైన ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత త‌మిళ‌నాట చోటు చేసుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాలు క్ష‌ణ‌క్ష‌ణం ఉత్కంఠ క‌లిగిస్తున్నాయి. నాలుగు రోజుల్లోనే 40 ట్విస్టులు చోటు చేసుకోగా దేశం మొత్తం అర‌వ పాలిటిక్స్‌ను ఆస‌క్తిగా వీక్షిస్తోంది. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థపై స‌ర్వ‌త్రా చ‌ర్చ మొద‌లైంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీవీకే(TVK) 108 స్థానాలతో ముందు వ‌రుస‌లో నిలిచిన విష‌యం తెలిసిందే. మ్యాజిక్ ఫిగ‌ర్ 118కి మ‌రో ప‌ది అడుగులే. మిగ‌తా కూట‌ముల‌కు ఇది అంద‌నంత దూరంలో ఉంది. అయినా విజ‌య్ పార్టీకి గ‌వ‌ర్న‌ర్ నుంచి మూడు సార్లు చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. మ‌రోవైపు బ‌ద్ధ‌శ‌త్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే చేతులు క‌ల‌ప‌డం త‌మిళ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఒక‌వేళ వారికి గ‌వ‌ర్న‌ర్ అవ‌కాశం ఇస్తే టీవీకే అధినేత సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లుగా తెలుస్తోంది. మొత్తం 107 మంది (ఇందులో విజ‌య్ రెండు చోట్ల గెలుపొందాడు) రాజీనామా చేసి తిరిగి ఎన్నిక‌ల‌కు వెళ్లే యోచ‌న‌లో ఉన్న‌ట్లుగా ఆ పార్టీ వ‌ర్గాల నుంచి వినిపిస్తుంది.
మారుతున్న ప‌రిణామాలు..
ఇప్ప‌టికే టీవీకే కు కాంగ్రెస్ (5)మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. శుక్ర‌వారం జ‌రిగిన చ‌ర్చ‌ల సంద‌ర్భంగా లెఫ్ట్ పార్టీలు (చెరి రెండు చొప్పున 4సీట్లు) స‌పోర్ట్ చేస్తామ‌ని వెల్ల‌డించాయి. వీసీకే (2) మ‌ద్ద‌తు ప్ర‌క‌టించినా త‌ర్వాత వెన‌క్కి వెళ్ల‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఐయూఎంఎల్ ముందు ఓకే అన్నా ఆ వెంట‌నే మాట మార్చ‌డంతో మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన‌ట్ల‌యింది. ఈ క్ర‌మంలో శ‌నివారం ఉంటుంద‌నుకున్న‌విజ‌య్ ప్ర‌మాణస్వీకార కార్య‌క్ర‌మం ర‌ద్ద‌వ‌డం గ‌మ‌నార్హం.
దళపతి ఏం చేయ‌బోతున్నారు..
ఒక‌వేళ ప్ర‌భుత్వ ఏర్పాటుకు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తించ‌క‌పోతే విజ‌య్‌ సుప్రింకోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశ‌మున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా త‌న పార్టీ నుంచి గెలిచిన వారంద‌రితో రాజీనామా చేయించాల‌ని యోచిస్తున్నట్లుగా సమాచారం. ఇదే జ‌రిగితే అసెంబ్లీ ర‌ద్ద‌య్యే అవ‌కాశంతో పాటు తాత్కాలికంగా రాష్ట్రప‌తి పాల‌న‌.. త‌ర్వాత ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుందనే చర్చ సాగుతుంది. మళ్లీ ఎన్నికలు వస్తే ప్ర‌స్తుతం ఉన్న సానుభూతి విజ‌య్ కు రికార్డు స్థాయి స్థానాల‌ను తెచ్చిపెట్టే అవ‌కాశం లేక‌పోలేదు. అంతేకాకుండా భ‌విష్య‌త్‌లో దేశ రాజ‌కీయాల్లోనూ కీల‌కంగా మారే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.
బ‌లాబ‌లాలు ఇలా..
234 సీట్లున్న త‌మిళ అసెంబ్లీలో బ‌లాబ‌లాలు పార్టీల వారీగా.. టీవీకే-108 సీట్లు, డీఎంకే – 59, అన్నాడీఎంకే – 47, కాంగ్రెస్ – 5, పీఎంకే – 4, ఐయూఎంఎల్ – 2, సీపీఐ – 2, వీసీకే 2, సీపీఎం -2, బీజేపీ- 1, డీఎండీకే-1, ఏఎంఎంకేఎంఎన్‌కేజెడ్ -1.

ఇది కూడా చదవండి.. ‘కమలం’ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ.. రంగంలోకి మోదీ

Good news | నిరుద్యోగుల‌కు తీపిక‌బురు .. త్వ‌ర‌లోనే దేవాదాయ శాఖ నుంచి నోటిఫికేష‌న్‌

Good news |  రాష్ట్రంలోని నిరుద్యోగులపై ఆ “దేవుడు” ఎట్ట‌కేల‌కు క‌రుణ చూపిన‌ట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం త‌ర్వాత దేవాదాయ‌ శాఖ‌లో 190 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. ఈ మేర‌కు ఏప్రిల్ 30, 2026న జీవో ఎంఎస్ 42 ద్వారా ఫైనాన్స్ శాఖ వివ‌రాల‌తో కూడిన ఉత్త‌ర్వులు జారీ చేసింది.
మొత్తం 190 పోస్టులు..
దేవాదాయ శాఖ‌లో ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గ్రేడ్-1, 2, 3పోస్టుల కోసం 190 ఖాళీలను ప్రకటించింది. జోన‌ల్ విధానంలో రెవెన్యూ/టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ నియామ‌క ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. వ‌యో ప‌రిమితి ప్ర‌స్తుతం 34 సంవ‌త్స‌రాలుగా ఉండగా దీనిని ఇది వ‌ర‌కు మాదిరిగా 46 ఏళ్ల‌కు పెంచే అవ‌కాశం లేక‌పోలేదు. త్వ‌ర‌లోనే దీనిపై ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. త‌ద‌నంత‌రం పూర్తిస్థాయిలో నోటిఫికేష‌న్ వెలువ‌డే అవ‌కాశం ఉంది.
జోన్ల వారీగా ఖాళీల వివ‌రాలు..
రాష్ట్రంలో ఏడు జోన్లు ఉన్నాయి. వీటి ప‌రిధిలో మొత్తం 190 పోస్టులుండ‌గా.. ఇందులో గ్రేడ్-1: 41, గ్రేడ్-2: 62, గ్రేడ్-3: 87 ఉన్నాయి. జోన్ల వారీగా ప‌రిశీలిస్తే .. కాళేశ్వ‌రం జోన్‌లో 6, బాస‌ర‌లో 14, రాజన్న ప‌రిధిలో 7, భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 20, యాదాద్రి భువ‌న‌గిరిలో 48, చార్మిన‌ర్ జోన్‌లో 67, జోగులాంబ‌లో 28 పోస్టులున్నాయి.
డిగ్రీ అర్హ‌త…
డిగ్రీ విద్యార్హ‌త‌గా వీటిని భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి నోటిఫికేష‌న్‌లో సిల‌బ‌స్, ప‌రీక్ష‌విధానం త‌దిత‌ర విష‌యాలు వెల్ల‌డి కానున్నాయి.
నిరుద్యోగులు అల‌ర్ట్‌..
చాలా రోజుల విరామం త‌ర్వాత నోటిఫికేష‌న్‌కు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధం అవుతున్న తరుణంలో నిరుద్యోగుల్లో ఆశ‌లు చిగురించాయి. అట‌కెక్కించిన పుస్త‌కాలను తిరిగి స్ట‌డీ చైర్‌పై చేరుస్తున్నారు. ప‌రీక్ష‌లో రెండు పేప‌ర్లు (ఒక‌టి జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌, రెండోది ఎండోమెంట్ సంబంధిత అంశాలు) ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తుంది.నోటిఫికేష‌న్ వ‌చ్చే వ‌ర‌కు జీఎస్‌పై దృష్టి సారించాల‌ని స‌బ్జెక్ట్ ఎక్స్‌ప‌ర్ట్స్‌, కోచింగ్ సెంట‌ర్ల నిర్వాహ‌కులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. 46 నుంచి 34.. ! త‌గ్గిన వ‌యోప‌రిమితిపై నిరుద్యోగుల్లో మండిపాటు

Tamilnadu politics | విజ‌య్‌కు షాక్‌.. ఒక్కటవుతున్న ద్ర‌విడ పార్టీలు?

Tamilnadu politics | ద్ర‌విడ పార్టీలు మ‌ళ్లీ ఒక్క‌ట‌వుతున్నాయా అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నాయి తాజా ప‌రిస్థితులు. త‌మిళ‌నాట‌ రాజ‌కీయాలు గంట‌గంట‌కు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించినా.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు 10 సీట్ల‌ దూరంలో నిలిచింది. కాంగ్రెస్ ‘హ‌స్తం’ అందించినా పూర్తిస్థాయిలో మెజారిటీ ద‌క్క‌ని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలో విజ‌య్ ప్ర‌భుత్వ ఏర్పాటుపై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి.
ఎవ‌రి బ‌లాలు ఎంతెంత‌..
తాజాగా జ‌రిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌రు తీర్పు విల‌క్ష‌ణంగా మారింది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ ద‌క్క‌ని ప‌రిస్థితి. 234 సీట్లున్న అసెంబ్లీలో 108 స్థానాల‌తో టీవీకే(Tvk) అతిపెద్ద పార్టీగా నిలిచింది. త‌ర్వాత స్ధానంలో డీఎంకే(Dmk)కూట‌మి 73, అన్నాడీఎంకే(anna Dmk) కూట‌మి 53 నిలిచాయి.
పార్టీల వారీగా ప‌రిశీలిస్తే..
టీవీకే- 108 సీట్లు, డీఎంకే – 59, అన్నాడీఎంకే – 47, కాంగ్రెస్ – 5, పీఎంకే – 4, ఐయూఎంఎల్ – 2, సీపీఐ – 2, వీసీకే 2, సీపీఎం -2, బీజేపీ 1, డీఎండీకే1, ఏఎంఎంకేఎంఎన్‌కేజెడ్ 1.

డీఎంకే, అన్నాడీఎంకే మ‌ధ్య చ‌ర్చ‌లు?
ద‌శాబ్దాలుగా బ‌ద్ద‌శ‌త్రువులుగా నిలిచిన డీఎంకే, అన్నాడీఎంకే ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఫోక‌స్ పెంచిన‌ట్లుగా తెలిసింది. విజ‌య్‌కు పీఠం ద‌క్క‌కుండా చ‌క‌చ‌క పావులు క‌దుపుతున్న‌ట్లు స‌మాచారం. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 సీట్ల‌ను సాధించ‌గా జాతీయ పార్టీల‌ను మిన‌హాయంచి లెఫ్ట్, ఇత‌ర పార్టీల‌తో క‌లిపి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. చెరి రెండున్న‌రేళ్లు పాల‌న సాగించేలా ఒప్పందం సాగుతున్న‌ట్లు స‌మాచారం.

అస‌లేం జ‌రుగుతుంది..
అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన విజ‌య్ పార్టీకి.. ఎన్నిక‌ల్లో డీఎంకేతో క‌లిసి పోటీ చేసిన కాంగ్రెస్ మంగ‌ళ‌వారం టీవీకే కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. మ్యాజిక్ ఫిగ‌ర్ 118 కాగా.. హ‌స్తం మ‌ద్ద‌తుతో కలిపి విజ‌య్ బ‌లం 112(విజయ్ రెండు చోట్ల గెలుపు పరిగణలోకి తీసుకొని)కు చేరింది. మ‌రో ఆరుగురు మ‌ద్ద‌తు అవ‌స‌రం కాగా.. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ద‌ళ‌ప‌తి కోరారు. అయితే పూర్తి మెజారిటీ ఉండాల్సిందే అని గ‌వ‌ర్న‌ర్ స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిసింది. ఈ క్ర‌మంలో ఒక్క‌సారిగా డీఎంకే , అన్నాడీఎంకే పొత్తుల చ‌ర్చ‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

ఇది కూడా చ‌ద‌వండి.. ‘కమలం’ నెక్స్ట్ టార్గెట్.. తెలంగాణ.. రంగంలోకి దిగుతున్న మోదీ

Bjp focus telangana | ‘కమలం’ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ.. రంగంలోకి మోదీ

Bjp focus telangana | ఉత్తరాదిన వరుస విజయాల బాట పట్టిన బీజేపీ (Bjp) ఇక దక్షిణాదిపై ఫోకస్ పెంచింది. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిని కైవసం చేసుకున్న ఆ పార్టీ.. ఏకంగా మమత కంచుకోటను బద్దలుకొట్టింది. బెంగాల్ లో తొలిసారిగా అడుగుపెట్టి కాషాయ జెండాను రెపరెపలాడించింది. ఇదే ఊపులో తెలంగాణపై ఫోకస్ పెంచింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాగా వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.
మోదీ సభతో శ్రీకారం
ఈనెల 10న హైదరాబాద్‌లో ప్ర‌ధాని మోడీ సభను కాషాయ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బూత్ స్థాయిలో “కమలం” బ‌లోపేత‌మే లక్ష్యంగా శ్రేణుల‌ను స‌న్న‌ద్ధం చేయాల‌ని అధినాయ‌క‌త్వం భావిస్తోంది. ప్ర‌ధానంగా ఈ స‌భ ద్వారా వారిలో జోష్ నింపేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. మ‌రోవైపు బెంగాల్‌ విజయంలో కీల‌క పాత్ర వ‌హించిన టీంకు తెలంగాణ బాధ్యతలు అప్పగించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
గ్రూపుల‌కు చెక్ పెట్టేలా..
రాష్ట్రంలో గ‌త ఎన్నిక‌ల్లో స‌గం ఎంపీ సీట్ల‌ను కైవ‌సం చేసుకున్న పార్టీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆ స్థాయిలో ఎందుకు సాధించ‌లేము.. అనే దానిపై కమలం అధిష్టానం ప్ర‌ధానంగా దృష్టి సారిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఉత్త‌ర తెలంగాణ‌లో బ‌లంగా క‌నిపిస్తున్న పార్టీ మిగ‌తా చోట్ల పుంజుకోక‌పోవ‌డానికి కార‌ణాలను అన్వేషిస్తోంది. నిత్యం త‌ల‌నొప్పిగా మారిన గ్రూపు త‌గాదాలపై ఫోక‌స్ పెంచి రాష్ట్ర, జిల్లాల నాయ‌క‌త్వాన్ని స‌మ‌న్వ‌య‌ప‌రిచే దిశ‌గా ఫోక‌స్ పెంచుతున్నట్లుగా తెలుస్తోంది.
రేవంత్ స‌ర్కారు వైఫ‌ల్యాల‌పై ఫోక‌స్‌..
ప్ర‌ధానంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ స‌ర్కారు లక్ష్యంగా పావులు క‌ద‌పాల‌ని అధిష్టానం భావిస్తోంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ పెంచ‌డంతో పాటు కేంద్ర ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయిలోకి తీసుకెళ్లాల‌ని యోచిస్తోంది. ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల్లో డ‌బుల్ ఇంజిన్‌ (Double engine) స‌ర్కారు ఆలోచ‌న రావాల‌నే లక్ష్యంతో ముందుకు సాగేలా వ్యూహాల‌ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత మోడీ స‌భ స‌క్సెస్‌పై దృష్టి సారిస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి… ఆ ‘విజయం’ ఎందరికో రాజకీయ పాఠం..

PK Politics | ఆ ‘విజయం’ రాజకీయ పాఠం.. తెలంగాణ‌లో ఆస‌క్తిక‌రం

PK Politics | తమిళనాట పార్టీ పెట్టి కేవలం రెండున్న‌రేళ్లకే ప్రభంజనం సృష్టించిన ఆ ‘విజయ’మ్ ఎందరికో పాఠంగా మారింది. రాజకీయాల్లో ఆ విజిల్ ఒక్కసారిగా ప్రతి ధ్వనించింది. ఎన్టీఆర్.. ఎంజీఆర్ సరసన చేర్చిన ఆ గెలుపు ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.  చాలా మందిని ఆలోచింప‌జేస్తుంది. తెలంగాణలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
తెర వెనక పీకే మంత్రాంగం
టీవీకే విజయం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashnth kishore) స్ట్రాటజీ కీలకంగా పని చేసిందని తెలుస్తుంది. ఏడాది క్రితం స్వయంగా పార్టీ సభలో పీకే చేసిన కామెంట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 2026 ఫలితాల తర్వాత తమిళనాడులో ఈ బిహారి తప్పకుండా పాపులర్ అవుతాడంటూ.. పార్టీ విజయంపై ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయ‌న‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కేవ‌లం 12 మంది మినహా మిగ‌తా అంతా కొత్త వారితోనే ఎన్నికల బరిలో దిగిన విజిల్ పార్టీకి ఆయన తెర వెనుక దిక్సూచిగా నిలిచారు. దశాబ్దాల చరిత్ర కల త‌మిళ పార్టీల బలాబలాలను అంచనా వేయ‌డంతో పాటు విజయ్ కి ప్రత్యర్ధులు అడుగడుగునా సృష్టించిన అడ్డంకులనూ సైతం తొలగిస్తూ తనదైన శైలిలో మంత్రాంగం నడిపారు ఈ స్ట్రాట‌జిస్టు. ఎట్టకేలకు తన టాస్కును సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడు. తాజాగా ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మ్యాజిక్ ఫిగ‌ర్‌కు చేరువ‌య్యేలా త‌న వంతు పాత్ర పోషిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కు సైతం అందని ప్ర‌శాంత‌మైన వ్యూహాలు అద్భుతమని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తుడంగా.. తాజాగా మరో టాస్క్‌పై దృష్టి సారిస్తున్నారు పీకే. తెలంగాణలో కొత్తగా రూపుదిద్దుకున్న పార్టీకి ఈయ‌న ఇప్ప‌టికే సలహాదారుడిగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కవిత పార్టీతో సంప్రదింపులు..?
ఇటీవల తెలంగాణలో కల్వకుంట్ల కవిత సారధ్యంలో కొత్త పార్టీగా రూపుదిద్దుకున్నటీఆర్ఎస్‌(Trs)కు ఆయన ఇప్పటికే సలహాదారుడిగా నియామకమైనట్లుగా తెలుస్తుంది. పలుమార్లు ఆయన కవితతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు మరో రెండున్నర సంవత్సరాలు ఉండడం.. తెలంగాణ ర‌క్ష‌ణ సేన కొత్త పార్టీ కావడం.. పేరున్న లీడర్లు ఇప్పటివరకు లేకపోవడం.. అంతా టీవీకే పార్టీని పోలి ఉండడం సారుప్య ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. 2028 ఫ‌లితం కూడా అలాగే ఉంటుంద‌ని టీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్య‌క్తం చేస్తుండం ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారిది.

ఇది కూడా చ‌ద‌వండి ..  బెంగాల్‌లో విక‌సించిన క‌మ‌లం.. త‌మ‌ళ‌నాట ఫ‌లించిన పీకే వ్యూహాం.. కేర‌ళంలో హ‌స్తం హ‌వా.. పుదుచ్చేరి, అస్సాంను కాపాడుకున్న‌ బీజేపీ..

Elections Results | బెంగాల్‌లో విక‌సించిన క‌మ‌లం.. త‌మ‌ళ‌నాట ఫ‌లించిన పీకే వ్యూహాం.. కేర‌ళంలో హ‌స్తం హ‌వా.. పుదుచ్చేరి, అస్సాంను కాపాడుకున్న‌ బీజేపీ..

Elections Results |  ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల కౌంటింగ్ సోమ‌వారం ఉత్కంఠ‌గా సాగింది. పెద్ద రాష్ట్రాల్లో ఓట‌ర్లు మార్పు కోరుకోగా.. చిన్న రాష్ట్రాల్లో గ‌త ప్ర‌భుత్వాల‌కే జై కొట్టారు. ప‌శ్చిమ బెంగాల్‌లో క‌మ‌లం రెప‌రెప‌లాడ‌గా.. త‌మిళ‌నాట విజ‌య్ విజిల్ మోగింది. కేర‌ళంలో హ‌స్తం హ‌వా సాగింది. పుదుచ్చేరి, అస్సోంలో బీజేపీ ఆధిప‌త్యాన్ని తిరిగి కొనసాగించింది.

హ్యాట్రిక్ మ‌మ‌త కు నాలుగో *సారీ*
ప‌శ్చిమ బెంగాల్‌లో మొత్తం 293 స్థానాల‌కు గాను బీజేపీ(Bjp) 208 స్థానాలు కైవసం చేసుకొని ప్రభంజనం సృష్టించింది. తొలిసారిగా స‌ర్కారు ఏర్పాటుకు స‌న్న‌ద్ధ‌మవుతోంది. ద‌శాబ్దంన్నర త‌ర్వాత ఇక్క‌డ‌ టీఎంసీకి ఎదురుదెబ్బ‌ త‌గిలింది. హ్యాట్రిక్‌ సాధించిన మ‌మ‌త బెన‌ర్జికి నాలుగో సారి మాత్రం చేదు అనుభ‌వం ఎదురైంది. టీఎంసీ (Tmc) ఇక్క‌డ 79 స్థానాల‌తో రెండోస్థానానికి ప‌రిమిత‌మైంది. ఇక కాంగ్రెస్ రెండు, లెఫ్ట్ రెండు, ఇత‌రులు రెండు స్థానాల్లో గెలుపొందారు.

మోగిన విజ‌య్ విజిల్‌..
ఇక త‌మిళనాడులో అనూహ్యంగా విజ‌య్ పార్టీ టీవీకే సంచ‌ల‌నం సృష్టించింది. మొత్తం 234 స్థానాల‌కు గాను 107 స్థానాలను కైవ‌సం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. మ్యాజిక్ ఫిగ‌ర్ ఇక్క‌డ 118. విజ‌య్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌ వ్యూహాలు ఇక్క‌డ ఫ‌లించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక అధికార డీఎంకే కూట‌మి 74 స్థానాల‌తో రెండో స్థానంలో నిలువ‌గా..అన్నాడీఎంకే కేవ‌లం53 స్థానాల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

కేర‌ళంలో కాంగ్రెస్ పాగా
కేర‌ళంలో ఎల్డీఎఫ్ ప్ర‌భుత్వానికి చుక్కెదురైంది. కాంగ్రెస్ కుట‌మీకి స్ప‌ష్ట‌మైన అధిక్య‌త ల‌భించింది. మొత్తం 140 స్థానాల‌కు గాను యూడీఎఫ్ అభ్య‌ర్థులు 102 చోట్ల విజ‌యం సాధించారు. ఇక అధికార ఎల్‌డీ ఎఫ్ 35 స్థానాల‌తో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ అనుబంధ కూట‌మి మూడు స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్ర‌స్తుత‌ ప్రతిపక్ష నేత సతీశన్‌తో పాటు కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల, సురేశ్ సీఎం రేసులో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

అస్సోంలో బీజేపీ ప్ర‌భంజ‌నం
అస్సోంలో 126 స్థానాలుండగా బీజేపీ కూట‌మి 102 స్థానాల్లో విజ‌యం సాధించింది. మ‌రో సారి అధికారంలోకి వ‌చ్చేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. హిమంత బిశ్వ శ‌ర్మ హ్యాట్రిక్ సాధించారు. ఇక్క‌డ కాంగ్రెస్ కూట‌మి కేవ‌లం 21 చోట్లకే ప‌రిమిత‌మైంది. అలాగే ఏఐయూడీఎఫ్ రెండు,ఇతరులు ఒక స్థానం కైవ‌సం చేసుకున్నాయి.

పుదుచ్చెరిలో..
పుదుచ్చేరీలో 30 స్థానాలకు గానూ బీజేపీ, ఎన్నారై కాంగ్రెస్ కూటమి 18 స్థానాల‌తో అధికారాన్ని తిరిగి ఖాయం చేసుకుంది. కాంగ్రెస్ ఆరు స్థానాలు, టీవీకే మూడు, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు.

ఇది కూడా చ‌ద‌వండి.. ఏడుకొండల బాట పడుతున్నారా.. రిజర్వేషన్ లేకున్నా స్వామి వారిని దర్శించుకోవచ్చు ఇలా

Thirupathi trip | ఏడుకొండల బాట పడుతున్నారా.. రిజర్వేషన్ లేకున్నా స్వామి వారిని దర్శించుకోవచ్చు ఇలా

Thirupathi trip | వేసవి సెలవులు వచ్చేశాయి. తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. స్వామి వారి దర్శన టికెట్ బుక్ చేసుకోలేదా.. అయినా చింతించకండి.. ఇలా చేస్తే మీ మొక్కు త్వరగా తీర్చుకోవచ్చు. స్వామి వారి సన్నిధిలో అందుబాటులో ఉండే ఉచిత దర్శనం, ఇతర సేవల వివరాలు చూద్దామా మరి.

  • ఉచిత దర్శన టోకెన్లు అందుబాటులో ఉండే ప్రాంతాలు
  • విష్ణు నివాసం (రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటుంది)
  • శ్రీనివాసం (బస్టాండ్ దగ్గర)
  • భూదేవి కాంప్లెక్స్ (అలిపిరి దగ్గర) ఎస్ఎస్డీ, దివ్యదర్శన టోకెన్లు
    అన్ని కేంద్రాల్లో ఉదయం ఐదు గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.
  • కాలినడకన మార్గాలు
    కాలినడకన వెళ్లాలనుకునేవారు అలిపిరి, శ్రీవారి మెట్ల ద్వారా కొండపైకి చేరుకోవచ్చు.
  • అలిపిరి(alipiri) మెట్ల మార్గం (ఉదయం 4 నుంచి రాత్రి 9:30 గంటల వరకు) మొత్తం 3,550 మెట్లు ఉంటాయి. సుమారు మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది.
  • శ్రీవారి(srivari) మెట్ల మార్గం: మొత్తం 2,380 మెట్లు ఉంటాయి. ప్రారంభంలో టోకెన్ ఇస్తారు. మధ్యలో స్కానింగ్ తప్పనిసరి. (ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు)
    లాకర్ సదుపాయం
  • భక్తుల సౌకర్యార్థం ఉచిత లాకర్ సదుపాయాన్ని టీటీడీ అందుబాటులో ఉంచింది. అవి యాత్రి సదన్, శ్రీ పద్మనాభ నిలయం, వెంకటాద్రి నిలయం, విష్ణు నివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో ఈ సేవలు లభిస్తాయి.
    ఫ్రీ బస్
  • కొండపై స్వామివారి దర్శన నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే టీటీడీ(TTD) వారు ఉచిత బస్సు సదుపాయం అందుబాటులో ఉంచారు.
    నిత్యాన్నదానం
    కొండపై భక్తులకు అల్పాహారం తో పాటు భోజనం కూడా ఉచితంగా అందిస్తున్నారు.
  • వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్ లో అల్పాహారం ఉదయం 8 నుంచి 10:30 వరకు అందుబాటులో ఉంటుంది.
  • భోజనము 10:30 నుంచి సాయంత్రం 4గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
    గదులు( ఆఫ్‌లైన్‌లో)
  • సీఆర్ఓ ఆఫీసులో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. భక్తుల సంఖ్యకు అనుగుణంగా రూమ్ రూ.50, రూ.100ల గదులను కేటాయిస్తారు.
  • సుపదం దర్శనం
  • ఏడాది లోపు పసిపిల్లలతో ఉన్న తల్లిదండ్రులు, ఎన్నారైలు, రక్షణ సిబ్బంది వంటి వారికి ఈ సేవలు ప్రత్యేకం. సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుంది.
  • మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

దర్శనం గదులు, లాకర్ వంటి సేవలకు భక్తులు తప్పనిసరిగా ఆధార్ గుర్తింపు కార్డును కలిగి ఉండాలి.

టోల్ ఫ్రీ నంబ‌ర్ కాల్ సెంట‌ర్ (24X7): 155257

ఇది కూడా చ‌ద‌వండి..: 46 నుంచి 34.. ! వ‌యోప‌రిమితిపై నిరుద్యోగుల్లో మండిపాటు

Age limit | 46 నుంచి 34.. ! త‌గ్గిన వ‌యోప‌రిమితిపై నిరుద్యోగుల్లో మండిపాటు

Age limit | ” ఉద్య‌మంలో ముందుండి కొట్లాడినం.. రాష్ట్రం వ‌స్తే మాకు జాబులొస్త‌య‌ని సంబుర‌ప‌డ్డాం.. ప‌దేళ్లు ఎదురుచూసినం.. మా క‌ల నెర‌వేర‌కపోవ‌డంతో ఉద్య‌మ పార్టీని ఓడించినం.. కాంగ్రెస్ స‌ర్కారును తెచ్చుకున్నం.. రెండున్న‌రేళ్లవుతున్నా ఈ ప్ర‌భుత్వానిదీ అదే తీరు.. పుష్క‌ర కాలం దాటినా మా క‌ల నెర‌వేర‌ని ప‌రిస్థితి.. నోటిఫికేష‌న్లు క‌రువైన‌య్‌.. నియామ‌కాలు మ‌రుగున ప‌డ్డ‌య్.. జాబ్ క్యాలెండ‌ర్ జాడ లేకుండా పోయింది. మ‌రోవైపు వ‌యోప‌రిమితి స‌డ‌లింపు సైతం తొల‌గించారు.. ఇదేనా మాపై మీ చిత్త‌శుద్ధి ” అంటూ రాష్ట్ర ప్ర‌భుత్వంపై నిరుద్యోగులు మండిప‌డుతున్నారు.

ఇదీ ప‌రిస్థితి..

  • ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించి గ‌రిష్ట‌ వ‌య‌సును 34 నుంచి 44 ఏళ్ల‌కు పెంచుతూ అప్ప‌టి బీఆర్ ఎస్ స‌ర్కారు మార్చి 19, 2022న జీవో నం. 42 జారీ చేసింది.
  • కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఈ వ‌యో ప‌రిమితిని మ‌రో రెండేళ్లు అంటే 46ఏళ్ల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఈమేర‌కు జీవో నంబర్ 30ను ఫిబ్ర‌వ‌రి 8, 2024న జారీ చేసింది. ఇది రెండేళ్ల పాటు అమ‌లులో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రితో ఆ గడువు ముగిసింది. మ‌రోసారి పొడిగింపు ఉత్త‌ర్వులు జారీ చేయ‌లేదు.
  • టీజీపీఎస్సీ తాజాగా విడుద‌ల చేసిన పొల్యుష‌న్ కంట్రోల్ బోర్డు నోటిఫికేష‌న్‌లో 34 ఏళ్ల‌కు ప‌రిమితం చేయ‌డంపై నిరుద్యోగులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు.

నిరుద్యోగుల డిమాండ్లు ఇలా..

  • కాంగ్రెస్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు జాబ్ క్యాలెండ‌ర్ వెంట‌నే ప్ర‌క‌టించాలి. అలాగే 2ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీపై చ‌ర్య‌లు తీసుకోవాలి.
  • వ‌యో ప‌రిమితి పెంపును తిరిగి 46 ఏళ్ల‌కు పెంచుతూ త‌క్ష‌ణ‌మే జీవో జారీ చేయ‌లి. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన పోస్టుల‌కు వ‌ర్తింప‌జేయాలి.
  • టీజీపీఎస్సీ(Tgpsc)లో సంస్క‌ర‌ణ‌లతో పాటు త్వ‌రిత‌గ‌తిన నోటిఫికేష‌న్ల ప్ర‌క్రియ చేప‌ట్టాలి.
  • సిల‌బ‌స్ క‌మిటీ వేసి ఏడాది గ‌డిచింది. ఈ ప్ర‌క్రియ సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి వివ‌రాలు వెల్ల‌డించాలి.
  • ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకు నెలవారీ భృతి అందించాలి.
  •  పోలీస్‌, మెగా డీఎస్సీ నియామ‌కాల షెడ్యూల్ త్వ‌ర‌గా ప్ర‌క‌టించాలి.

ప్ర‌భుత్వానికి విన‌తులు

  • వ‌యోప‌రిమితి పెంపు అంశం ప‌రిశీలించాల‌ని కోరుతూ నిరుద్యోగులు, విద్యావేత్త‌లు ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి విన‌తులు స‌మ‌ర్పించారు. లేకుంటే ఆందోళ‌న బాట ప‌డ‌తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మ‌రి.

ఇది కూడా చ‌ద‌వండి .. జూన్ 2.. నిరుద్యోగులకు తీపి కబురు అందబోతుందా

Gas price hike | వినియోగ‌దారుల‌కు షాక్‌ .. గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పెరిగిందండోయ్

Gas price hike | అవును మీరు వింటున్న‌ది నిజ‌మే. అనుకున్న‌ట్లుగానే గ్యాస్ ధ‌ర పెరిగింది. క‌మ‌ర్షియ‌ల్(commercial) సిలిండ‌ర్‌పై ఏకంగా రూ.993ల‌కు పెంచుతూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. గృహ అవ‌స‌రాల‌కు వినియోగించే సిలిండ‌ర్‌కు మాత్రం ప్ర‌స్తుతానికి మిన‌హాయింపు ఇచ్చింది.
క‌మ‌ర్షియ‌ల్‌పై రూ.వెయ్యి బాదుడు
ప‌శ్చిమాసియాలో యుద్ధ ప్ర‌భావం అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ స‌ర‌ఫ‌రాపై ప‌డింది. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇంధ‌న ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి. తాజాగా భార‌త్‌లోనూ ఆ ప్ర‌భావం ప‌డింది. ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన గ్యాస్ ధ‌ర‌ల‌ను కేంద్రం స‌మీక్షిస్తోంది. ఇందులో భాగంగా శుక్ర‌వారం క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్‌పై పెంపు నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 19 కిలోల వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర‌ రూ.2,076 (హైద‌రాబాద్‌లో) ఉండ‌గా ప్ర‌స్తుతం రూ.993 పెంచడంతో రూ.3,069కు చేరింది. దేశంలోని ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే ఇలా ఉన్నాయి. ఢిల్లీలో రూ.3,071 కాగా.. మంబాయిలో రూ. 3,024, బెంగ‌ళూర్‌లో రూ. 3152, అహ్మ‌దాబాద్‌లో రూ.3,091, కోల్‌క‌తాలో రూ.3,202, చెన్న‌య్‌లో రూ.3,237ల‌కు చేరాయి. ఇక 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండ‌ర్ ధ‌ర‌లో మాత్రం మార్పు లేద‌ని ప్ర‌క‌టించింది.
ప్ర‌భావం ఇలా..
గ్యాస్ ధ‌ర పెంపుతో ఇక హోటళ్లు, టిఫిన్ సెంట‌ర్ల నిర్వాహ‌కులు ఇక తినుబండారాల ధ‌ర‌లు పెంచ‌నున్నారు. ఈ మేర‌కు సామాన్యుల జేబుకు చిల్లు ప‌డ‌నుంది.

ఇది కూడా చ‌ద‌వండి.. చిల్‌ న్యూన్ మామ‌.. ఫ్లిప్‌కార్ట్‌లో స‌మ్మ‌ర్ సేల్‌ వ‌చ్చేసింది

Special Offer | చిల్ న్యూస్‌ మామ‌.. ఫ్లిప్‌కార్ట్‌లో స‌మ్మ‌ర్ సేల్‌ వ‌చ్చేసింది

Special Offer | మండే వేస‌విలో షాపింగ్ చేయాల‌నుకుంటున్నారా.. అయితే మిమ్మ‌ల్ని కూల్‌గా మార్చే ఆఫ‌ర్ల‌తో ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ముందుకు వ‌స్తుంది. సాసా లేలే సేల్(SASA LELE SALE) పేరిట ఈనెల 9 నుంచి స్పెష‌ల్ డిస్కౌంట్ల‌తో అందుబాటులోకి రానుంది. ప్లస్/బ్లాక్ మెంబ‌ర్స్ కు 24 గంట‌ల ముంద‌గానే యాక్సిస్ ఇవ్వ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే త‌న ప్లాట్‌ఫాంపై ప్ర‌క‌టించింది. డ‌బుల్ డిస్కౌంట్‌, ఎక్చ్సేంజ్‌ బోన‌స్ వంటి వాటితో పాటు బ్యాంకు ఆఫ‌ర్ల‌తో ఆక‌ట్టుకుంటుంది. అయితే ఎంత‌కాలం వ‌రకు ఉంటుంద‌నేది ఇంకా స్ప‌ష్టం చేయ‌లేదు.
ఆఫ‌ర్ల‌లో కొన్ని ఇలా..

  • మొబైల్, టీవీ అప్‌గ్రేడ్ కావాల‌నుకునే వారికి డబుల్ సేల్ పేరిట తీపి క‌బురు అందించింది. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25, ఇతర ఫ్లాగ్‌షిప్ మోడళ్ల‌పై భారీ తగ్గింపులు అందించ‌నున్న‌ట్ల‌గా వెల్ల‌డించింది.
  • ఇక 55 ఇంచెస్ 4కే టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఏసీలపై కూడా క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది.
  • వీటితో పాటు స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ఐట‌మ్స్ పై 85శాతం వరకు, వంటసామగ్రిపై 70శాతం వ‌ర‌కు, పూమా, అడిడాస్ వంటి టాప్‌లెవ‌ల్ ఫ్యాషన్ బ్రాండ్‌లపై 65శాతం వ‌ర‌కు తగ్గింపులు ఉంటాయ‌ని పేర్కొంది.
  • అద‌నంగా SBI క్రెడిట్ కార్డ్‌పై 10శాతం స్పెష‌ల్ డిస్కౌంట్ ను ప్ర‌క‌టించింది.
  • “డబుల్ సేల్స్ ” పేరిట మ‌రింత ఎక్కువ తగ్గింపులుంటాయ‌ని వెల్ల‌డించింది. ప్ర‌తీ గంట‌కు ట్రెండీ  డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయ‌ని ప్ర‌కటించింది. మ‌రిన్ని ఆఫ‌ర్ల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో సంద‌ర్శించ‌వ‌చ్చు.

ఇది కూడా చ‌ద‌వండి.. తల్లులూ.. మీ పిల్లలు జాగ్రత్త..! ఈ ఫుడ్ కు కాస్త దూరంగా ఉంచండి