Thirupathi trip | వేసవి సెలవులు వచ్చేశాయి. తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. స్వామి వారి దర్శన టికెట్ బుక్ చేసుకోలేదా.. అయినా చింతించకండి.. ఇలా చేస్తే మీ మొక్కు త్వరగా తీర్చుకోవచ్చు. స్వామి వారి సన్నిధిలో అందుబాటులో ఉండే ఉచిత దర్శనం, ఇతర సేవల వివరాలు చూద్దామా మరి.
- ఉచిత దర్శన టోకెన్లు అందుబాటులో ఉండే ప్రాంతాలు
- విష్ణు నివాసం (రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటుంది)
- శ్రీనివాసం (బస్టాండ్ దగ్గర)
- భూదేవి కాంప్లెక్స్ (అలిపిరి దగ్గర) ఎస్ఎస్డీ, దివ్యదర్శన టోకెన్లు
అన్ని కేంద్రాల్లో ఉదయం ఐదు గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి. - కాలినడకన మార్గాలు
కాలినడకన వెళ్లాలనుకునేవారు అలిపిరి, శ్రీవారి మెట్ల ద్వారా కొండపైకి చేరుకోవచ్చు. - అలిపిరి(alipiri) మెట్ల మార్గం (ఉదయం 4 నుంచి రాత్రి 9:30 గంటల వరకు) మొత్తం 3,550 మెట్లు ఉంటాయి. సుమారు మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది.
- శ్రీవారి(srivari) మెట్ల మార్గం: మొత్తం 2,380 మెట్లు ఉంటాయి. ప్రారంభంలో టోకెన్ ఇస్తారు. మధ్యలో స్కానింగ్ తప్పనిసరి. (ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు)
లాకర్ సదుపాయం - భక్తుల సౌకర్యార్థం ఉచిత లాకర్ సదుపాయాన్ని టీటీడీ అందుబాటులో ఉంచింది. అవి యాత్రి సదన్, శ్రీ పద్మనాభ నిలయం, వెంకటాద్రి నిలయం, విష్ణు నివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో ఈ సేవలు లభిస్తాయి.
ఫ్రీ బస్ - కొండపై స్వామివారి దర్శన నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే టీటీడీ(TTD) వారు ఉచిత బస్సు సదుపాయం అందుబాటులో ఉంచారు.
నిత్యాన్నదానం
కొండపై భక్తులకు అల్పాహారం తో పాటు భోజనం కూడా ఉచితంగా అందిస్తున్నారు. - వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్ లో అల్పాహారం ఉదయం 8 నుంచి 10:30 వరకు అందుబాటులో ఉంటుంది.
- భోజనము 10:30 నుంచి సాయంత్రం 4గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
గదులు( ఆఫ్‌లైన్‌లో) - సీఆర్ఓ ఆఫీసులో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. భక్తుల సంఖ్యకు అనుగుణంగా రూమ్ రూ.50, రూ.100ల గదులను కేటాయిస్తారు.
- సుపదం దర్శనం
- ఏడాది లోపు పసిపిల్లలతో ఉన్న తల్లిదండ్రులు, ఎన్నారైలు, రక్షణ సిబ్బంది వంటి వారికి ఈ సేవలు ప్రత్యేకం. సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుంది.
- మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
దర్శనం గదులు, లాకర్ వంటి సేవలకు భక్తులు తప్పనిసరిగా ఆధార్ గుర్తింపు కార్డును కలిగి ఉండాలి.
టోల్ ఫ్రీ నంబర్ కాల్ సెంటర్ (24X7): 155257
ఇది కూడా చదవండి..: 46 నుంచి 34.. ! వయోపరిమితిపై నిరుద్యోగుల్లో మండిపాటు




