Petro rate hike | వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. మరోసారి పెట్రో ధరలను పెంచింది. నాలుగు రోజుల వ్యవధిలో రెండో సారి వడ్డించింది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 86పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి అమలులోకి తెచ్చింది.ఈ పెంపు ఎంత దూరం పోతుందో అని జనం బెంబేలెత్తుతున్నారు.
భగ్గుమంటున్న ఇంధనం
ఈనెల 15న లీటర్ పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ. 3చొప్పున పెంచుతూ ఆయిల్ కంపెనీలు ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగు రోజులు కాకముందే మరోసారి పెంపు నిర్ణయం ప్రకటించడంతో వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇప్పటికే ఈ ప్రభావం నిత్యావసరాల ధరలపై పడి సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. మధ్యతరగతి బడ్జెట్ మారిపోతుంది.
మరింత పెరిగే అవకాశం..
పెట్రో ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు సూచిస్తున్నారు. భారీగా కాకుండా కొద్దికొద్దిగా పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత నాలుగేళ్లుగా పెట్రో ధరలు స్థిరంగా ఉండగా తాజాగా వారంలోపై రెండుసార్లు పెరగడం గమనార్హం.
ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.111.88లకు చేరువైంది. అలాగే డీజిల్ రూ.99.99లకు చేరింది. విజయవాడలో రూ.114.48, డీజిల్ ధర రూ.102.17, వరంగల్‌లో పెట్రోల్ రూ.111.49లు, డీజిల్ రూ.99.65లు, కరీంనగర్‌లో రూ.111.53లు, డీజిల్ రూ.99.88లకు చేరువయ్యయి. ఇక ఢిల్లీలో పెట్రోల్ రూ.రూ.97.77, డీజిల్ రూ.90.67, ముంబాయిలో రూ.107.59, డీజిల్ రూ.94.08, కోల్‌కతాలో పెట్రోల్ రూ. 109.70, డీజిల్ రూ. 96.07, చెన్నైలో పెట్రోల్ రూ. 104.49, డీజిల్ రూ.96.11లకు పెరిగాయి.
ఇది కూడా చదవండి.. సర్కారు కొలువులకు ఏజ్ లిమిట్ పెరిగిందోచ్..




