Ebola alert | ఎబోలా.. ఈ వైరస్ ప్రస్తుతం ఆఫ్రికాను వణికిస్తుంది. ప్రధానంగా కాంగో, ఉగాండా దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంతో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గతంలో కోవిడ్ సృష్టించిన మారణహోమం నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. భారత్ కూడా అప్రతమత్తమైంది.
కాంగోలో పెరుగుతున్న కేసులు
కాంగోలోని ఈస్టర్న్ ఇటూరి ప్రావిన్స్‌లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే వంద మందికి పైగా మృతి చెందినట్లుగా ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. వైరస్ వేగంగా విస్తరిస్తుండగా స్క్రీనింగ్ ప్రక్రియ ముమ్మరం చేస్తున్నట్లుగా వెల్లడించింది. అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతుండం ఆందోళన కలిగిస్తోంది. కాగా, 1976లో తొలిసారిగా కాంగోలో ఈ వైరస్ వెలుగుచూడడం గమనార్హం.
లక్షణాలు ఇవే..
ఈ వైరస్ ప్రధానంగా రక్తం వాంతులు, విసర్జనలతో పాటుస్పెర్మ్, బ్రెస్ట్ మిల్క్ వంటి వాటి ద్వారా వ్యాపిస్తుంది. ఇది అంటువ్యాధి. రోగి తాకిన పరిసరాలు, వస్తువుల్ని ఇతరులు ముట్టుకుంటే వారికి కూడా వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు పరిశీలిస్తే.. ముందు జ్వరం వస్తుంది. బలహీనత, కండరాల నొప్పులు కనిపిస్తాయి. తర్వాత వాంతులు, విరేచనాలు, రక్తస్రావం జరుగుతంది.
అప్రమత్తమైన భారత్..
ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉండడంతో భారత్ అప్రమత్తమైది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈమేరకు స్పందించింది. ప్రస్తుతానికి ఇండియాలో ఈ కేసులు నమోదు కాలేదని, ముప్పు తక్కువే అయినా అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, వైరస్ నియంత్రణకు అన్ని రకాల మెడికల్ సదుపాయాలు సిద్ధంగా ఉంచామని భరోసా ఇచ్చింది. ప్రభావిత దేశాల ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నందున ఎయిర్‌పోర్ట్‌లతో పాటు నౌకాశ్రయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స్క్రీనింగ్ ప్రక్రియతో పాటు లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఐసీఎంఆర్ వంటి ప్రధాన సంస్థలు కూడా ఫోకస్ పెంచాయి. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ఇక నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని సిద్ధం చేసింది. ఇప్పటికే నోడల్ ల్యాబ్‌గా ప్రకటించింది.
ఇది కూడా చదవండి.. సర్కారు కొలువులకు ఏజ్ లిమిట్ పెరిగిందోచ్..




