Modi mantra | ఈనెల 10న హైదరాబాద్ వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ఉపదేశించిన పొదుపు మంత్రం ఆచరణలోకి వస్తుంది. ఇప్పటికే ఢిల్లీ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు ప్రధాని మొదలుకొని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పొదుపు మంత్రం పై దృష్టి సారించారు. తమ కాన్వాయ్ ని భారీగా తగ్గించుకుంటున్నారు.
ఢిల్లీలో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ ..
ప్రధాని సూచన మేరకు దేశ రాజధానిలో వర్క్ ఫ్రం హోం(Work from Home) ను ఢిల్లీ సర్కారు అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా వారానికి రెండు రోజులు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సైతం వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని సీఎం రేఖ గుప్తా వెల్లడించారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నాయి.
కాన్వాయ్ ను తగ్గించుకున్న మోడీ
పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని మోడీ తన కాన్వాయ్ ను భారీగా తగ్గించుకున్నారు. కేవలం రెండు కార్లకే పరిమితమయ్యారు. అందరికీ ఆదర్శంగా మారారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంత్రుల కాన్వాయ్ గతంలో 17 వరకు ఉండగా ప్రస్తుతం 4 వాహనాలకు తగ్గించుకున్నారు. అందులోనూ ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. పీఎం స్ఫూర్తితో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ కాన్వాయ్ ను ఇప్పటికే తగ్గించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాలుగు వాహనాలకే పరిమితం గా డిప్యూటీ సీఎం పవన్ మూడు వాహనాలకు తగ్గించుకున్నారు. మంత్రి లోకేష్ ఏకంగా ఒకే వాహనానికి పరిమితమయ్యారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ కూడా తన కాన్వాయని మూడు వాహనాలకు తగ్గించుకోవడం గమనార్హం. మంత్రులు కూడా అదే దారిలో సాగనున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర క్యాబినెట్లు పూర్తిగా ఈ విధానం అవలంబిస్తుండడంతో ప్రజలు కూడా సొంత వాహనాల వినియోగం తగ్గించుకునే అవకాశం లేకపోలేదు. ప్రజా రవాణాపై దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ సేవలు జూన్ 2 నుంచి ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు రేవంత్ సర్కారు సన్నద్ధమవుతున్నట్లు టాక్.
ఇది కూడా చదవండి.. పెట్రో ధరలు పెరిగినయండోయ్.. ఏ ప్రాంతంలో ఎంతెంతో తెలుసుకోండి




