ఈపీఎఫ్ వడ్డీ రేటు ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26) కూడా 8.25 శాతం ఖరారు చేసింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ. సోమవారం నిర్వహించిన కీలక సమావేశంలో ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది. మూడేళ్లుగా కొనసాగుతున్న వడ్డీ రేటునే ఈ సారి కూడా ఖరారు చేసింది. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఏడు కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో ఈ మొత్తం జమ కానుంది. అయితే ఈ సారి పెంపు ఉంటుందని అంతా భావించారు. ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఒకింత నిరాశకు గురయ్యారు. గడిచిన మూడేళ్లుగా వడ్డీ రేట్లు పరిశీలించినట్లయితే.. 2022-23 సంవత్సరానికి గాను 8.15 శాతం ఉండగా 2023-24, 2024-25, 2025-26 సంవత్సరాలకు 8.25శాతంగా ఉండడం గమనార్హం.



