Wednesday, April 22, 2026
spot_img

ఇక పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరుగుతాయా.. యుద్ధం ప్రభావం మనపై ఎలా ఉంటుంది.

భారత్‌లో కొద్ది రోజులుగా పెట్రో ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజాగా పశ్చిమాసియాలో యుద్ద వాతావరణం మొదలవడంతో ఇక అందరి దృష్టి ఇంధన ధరలపై పడింది. ఇప్పటికే యూరప్ లో పెట్రో ధరలపై ప్రభావం పడింది. స్వల్ప వ్యవధిలోనే 50 శాతం వరకు పెరిగాయి. మరోవైపు ఇరాన్- దుబాయ్- ఒమన్ దేశాలం మధ్య గల్ హార్మూజ్ జలసంధి మూతపడింది. అంతర్జాతీయ రవాణాకు కీలకమైన ఈ జల సంధి మూసివేతతో భారత తదితర దేశాలపై ప్రభావం పడనుంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోయింది.
నిండుకుంటున్న నిల్వలు
ఇరాన్ ప్రతీకార చర్యల్లో భాగంగా గల్ఫ్ దేశాల ఆయిల్ నౌకలపై దాడులు ముమ్మరం చేసింది. ఇది క్రూడ్ ఆయిల్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఓవైపు భారత్ లోనూ ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయి.ప్రత్యామ్నాయ చర్యలపై ఇండియా దృష్టి సారిస్తుంది. అయితే రవాణా భారం ఎక్కువ అవుతున్న క్రమంలో ధరలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది.
భారీగా పెరగనున్నాయా..
క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా భగ్గుమంటున్నాయి. మార్చి తోపాటు ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌ బ్యారెల్‌కు 10 శాతం పెరుగుదల ఉంటున్నట్లుగా తెలుస్తుంది. బ్యారెల్‌కు ఒక డాలర్‌ పెరిగినా ఏడాదికి భారత్‌పై రూ.13 వేల కోట్ల భారం పడనున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మన దగ్గర కూడా కొద్ది రోజుల్లో మళ్లీ పెట్రో ధరలకు లెక్కలు రావడం ఖాయం అంటున్నారు నిపుణులు.

spot_img

Hot Topics

Related Articles