Passport | అవున్నల్ల మీరు విన్నది నిజమే. జూలై 1 నుంచి పాస్ పోర్ట్ ఫీజులు పెరుగుతున్నయ్. ఈమేరకు కేంద్రం నిర్ణయించింది. ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇక నుంచి స్టాండర్డ్ పాస్ పోర్ట్ ఫీజు రూ. 2500 ఉండనుంది. తత్కాల్ విధానంలో అయితే రూ.5,000 చెల్లించాల్సిందే. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 14 ఏళ్ల అనంతరం పెంచుతున్నట్టుగా విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ ఫీజులు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. నిర్వహణ, సాంకేతిక ఖర్చులు పెరగడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి.
18 ఏళ్లు పైబడిన వారికి (సాధారణ, తత్కాల్)..
- 36 పేజీల స్టాండర్డ్ పాస్‌పోర్టు ఇంతవరకు రూ.1,500 ఫీజు ఉండేది. దీనిపై తాజాగా రూ. 1000 పెంచారు. ఇకపై రూ.2,500 వసూలు చేయనున్నారు. ఇక తత్కాల్ పై తాజాగా రూ. 1500 పెంచారు. దీంతో ప్రస్తుతమున్న రూ.3,500 ఫీజు రూ.5,000కు పెరిగింది.
- 60 పేజీలు ఉన్న సాధారణ పాస్‌పోర్ట్‌పై రూ.1500 పెంచారు. ఫలితంగా ఇప్పుడున్న ఫీజు రూ.2,000 నుంచి రూ.3,500కు చేరింది. ఇదే తత్కాల్ విధానంలో ఇప్పటి వరకు రూ.4,000 చెల్లిస్తుండగా, ఇకపై రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది.
పాస్‌పోర్ట్ పోయినా లేదా పాడైపోయినా (పునరుద్ధరణ).. - 36 పేజీలకు సంబంధించి సాధారణ విధానంలో రూ.5వేలు, తత్కాల్ లో అయితే రూ.7,500 చెల్లించాలి.
60 పేజీలకు సాధారణ విధానంలో ఇక నుంచి రూ.6వేలు, తత్కాల్ విధానంలో ₹8,500 వసూలు చేస్తారు. - 18 ఏళ్ల లోపు మైనర్లకు36 పేజీల పాస్‌పోర్ట్ విషయానికి వస్తే..
- సాధారణ విధానంలో రూ.1,750 , తత్కాల్ విధానంలో రూ.4,250 ఫీజుగా నిర్ణయించారు.
- పాడైన/పోయిన వాటి స్థానంలో కొత్తది కావాలనుకుంటే.. ఇకపై సాధారణ విధానంలో రూ. 4,250, తత్కాల్ విధానంలో ₹6,750 చెల్లించాల్సిందే.
ఇతర సేవలపై పెరిగిన చార్జీలు ఇలా..
పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ విషయానికి వస్తే.. మనదేశంలో అయితే ఫీజు రూ.750 వసూలు చేస్తారు. విదేశాల్లో అయితే రూ. 4వేలు చెల్లించాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్ ఆఫ్ ఐడెంటిటీ విషయంలో భారత్‌లో రూ. వెయ్యి, విదేశాల్లో అయితే సుమారు రూ.5వేల ఫీజుగా ఖరారు చేశారు. - ఇది కూడా చదవండి.. ‘బయలాట’కు కొత్త ఊపిరి


