Eapcet results | ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2026(EAPCET) ఫలితాల డేట్ వచ్చేసింది. ఈ నెల 17న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు విడుదల చేయనున్నారు. అభ్యర్థులకు వచ్చిన మార్పులను ర్యాంకు కార్డు ద్వారా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్షలు హాజరు ఇలా..
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశ పరీక్షలను ఈనెల 4, 5 తేదీల్లో, అలాగే ఇంజినీరింగ్ పరీక్షలను 9, 10, 11తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలకు 90 వేల మంది దరఖాస్తు చేసుకోగా 84 వేల మంది హాజరయ్యారు. ఇక ఇంజినీరింగ్ పరీక్షల కోసం 2.10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 1.97 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ప్రాథమిక కీ ని మంగళవారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈనెల 14 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. 17న ఫలితాలు ప్రకటించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది
ఇది కూడా చదవండి…బంగారం ధరలు డౌన్.. కొనుగోలు ఇదే మంచి సమయమా?




