petro rate hyke | పెట్రో ధరలపై కేంద్రం బాదుడు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇంధన చార్జీలను పెంచిన ఆయిల్ కంపెనీలు తాజాగా మరోసారి హైక్‌చేశాయి. శనివారం ముచ్చటగా మూడోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా పెట్రోల్‌పై లీటరుకు రూ.0.87 పైసలు, డీజిల్‌పై రూ0.91పైసలు పెంపును ఉదయం నుంచి అమలు చేశాయి.
లీటర్‌కు రూ. ఐదుకు పైగానే పెంపు..
ఈనెల 15న లీటర్ పెట్రోల్(petrol), డీజిల్‌పై రూ. 3చొప్పున పెంచిన విషయం తెలిసిందే. 19న మరోసారి పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంపుదల చేశాయి. నాలుగు రోజులకే వినియోగదారులకు మరోసారి షాకిచ్చాయి ఇంధన కంపెనీలు. తాజాగా శనివారం ఉదయం నుంచి లీటర్‌కు దాదాపు రూ.చొప్పున బాదేశాయి. 8 రోజుల వ్యవధిలో ఇతర చార్జీలతో కలిపి లీటర్‌పై ఏకంగా రూ.5లకు పైగా పెరుగుదల కనిపించడం గమనార్హం. ఈ పెట్రో భారం సామాన్యుడి నడ్డి విరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం నిత్యావసరాల ధరలపై పడుతున్నాయి. మధ్య తరగతి బడ్జెట్ తలకిందులవుతోంది.
ఇంకెంత పెరుగుతాయో..
పెట్రో ధరలు మున్ముందు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ పెంపు ఒక్కసారిగా కాకుండా కొద్దికొద్దిగా పెంచుతూ పోనున్నట్లుగా తెలుస్తోంది. గడిచిన నాలుగేళ్లుగా పెట్రో ధరలు స్థిరంగా ఉండగా తాజా పెంపు ఎంత వరకు వెళుతుందో అని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి.
నగరం పెట్రోల్ డీజిల్
ఢిల్లీ రూ. 99.51 రూ.92.49
ముంబై రూ.108.45 రూ.94.99
చెన్నై రూ. 105.40 రూ.97.05
హైదరాబాద్ రూ.112.84 రూ.100.94
వరంగల్ రూ.111.53 రూ.100.65
కరీంనగర్ రూ.112.54 రూ.100.80
ఇది కూడా చదవండి.. త్వరలోనే అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్..?




