Anganwadi news | అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి తెలంగాణ (Telangana) ప్రభుత్వం సన్నద్ధమవుతోందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16వేల వరకు టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈమేరకు త్వరలోనే భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
15,982 ఖాళీలు..
ఇప్పటి వరకు పదోన్నతులు, ఉద్యోగ విరమణ పోస్టులను పరిగణలోకి తీసుకుని మొత్తం 15,982 ఖాళీలను గుర్తించారు. ఇందులో 15,274 ఖాళీలను ఇదివరకే గుర్తించగా.. తాజాగా రిటైర్మెంట్ ద్వారా మరో 708 పోస్టులను చేర్చారు. వీటిలో అత్యధికంగా హెల్పర్ పోస్టులు 12,882 వరకు ఉండగా.. టీచర్ పోస్టులు 3100 వరకు ఉండడం గమనార్హం. మరోవైపు నియామక విధానంలో మార్పులపై ఉన్నతస్థాయి చర్చలు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది.
నియామకాలపై కమిటీ..
సిబ్బంది నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ఆ కమిటీ త్వరలోనే విధి, విధానాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అనంతరం జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటించి కలెక్టర్ నేతృత్వంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే సంబంధిత గ్రామం/వార్డులో శాశ్వత నివాసితులైన మహిళా అభ్యర్థులు అర్హులుగా ఉంటారు.
ఇదికూడా చదవండి.. ఆఫ్రికాను వణికిస్తున్న ఎబోలా.. అలర్టయిన ఇండియా




