Monday, July 27, 2026
Home Blog Page 11

US-Iran war |దూకుడు ఆపని ఆమెరికా.. వెనక్కి తగ్గని ఇరాన్‌.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!

US-Iran war | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగు తూనే ఉన్నాయి. ఇజ్రాయిల్‌ సహ అమెరికా దాడులకు భయపడని ఇరాన్‌ గట్టిగానే స్పందిస్తోంది. తాజాగా బుషేహర్‌లోని న్యూక్లియర్ US-పవర్ ప్లాంట్ లక్ష్యంగా అగ్రరాజ్యం క్షిపణి దాడులకు పాల్పడగా.. యూఎస్ కు చెందిన కీలక యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేస్తూ ధీటుగా బదిలిస్తుంది.హోర్మజ్ జలసంధి విషయంలో ‘మరో 48 గంటల సమయమే ఉందని.. స్పందించకుంటే ప్రళయం తప్పదు’ అంటూ తాజాగా ట్రంప్ చేసిన హెచ్చరికలను సైతం డోంట్ కేర్ అంటుంది ఇరాన్. ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన వంతెనను టార్గెట్ చేయడాన్ని ఇరాన్ సీరియస్ గా తీసుకుంది. తమ సత్తా కూడా చూపిస్తామని ప్రకటించింది. గల్ఫ్ దేశాల లక్ష్యంగా దాడులు ఉంటాయని వెల్లడించింది.
టేక్ కంపెనీలపై దృష్టి..
ప్రపంచ దేశాలకు తమ సత్తా చూపాలని భావించిన ఇరాన్ ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఇప్పటికే హార్మోజ్ జలసంధి పై పూర్తి ఆధిపత్యం సాధించి.. అగ్ర రాజ్యానికి ముచ్చెమటలు పట్టించింది. తాజాగా ఇజ్రాయిల్, అమెరికా లోని ప్రముఖ టెక్ కంపెనీలపై దాడులకు సిద్ధమైంది. 18 సంస్థలను లక్ష్యంగా చేసుకుంది. అంతేకాకుండా యూఎస్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని భావిస్తూ ఆ దేశానికి చెందిన కొన్ని బ్యాంకులను కూడా ఇందులో చేర్చింది.
యుద్ధం తీవ్రమైతే
యుద్ధం విషయంలో అమెరికాలో ఓవైపు నిరసనలు వెలువెత్తుతున్నా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు వార్ కు ముందు ఆ దేశంలో కొంత వ్యతిరేకత ఉన్నా అగ్రరాజ్యం దాడుల నేపథ్యంలో ఇరానీయులు ప్రస్తుతం ఒక్కటిగా గళమెత్తుతున్నారు. తమను తక్కువ అంచనా వేసిన యుఎస్ కు సత్తా చూపిస్తామని.. ప్రతి దాడులతో ఆ దేశం డ్రోన్లతో విరుచుకుపడుతుంది ఈ క్రమంలో అంతర్జాతీయ క్రూడాయిల్ వర్తకానికి కీలక రవాణా మార్గమైన హార్మోజ్ ను వజ్రాయుధంగా వాడుకుంటోంది. ఈ ప్రభావం గల్ఫ్ తో పాటు మిగతా దేశాలపై తీవ్రంగా చూపుతుంది. ఇప్పటికే పలు దేశాల్లో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల పైనా ఎఫెక్ట్ చూపుతుండడంతో మునుముందు ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి : యుద్ధం..ఇంకెంతకాలం.. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ మధ్యలో ట్రంప్..

Fee reimbursement |వారికి షాక్‌..! ఉన్నత విద్య ఇక అందని ద్రాక్షేనా.. కోర్టు తీర్పు ఏంటి.. సర్కారు వైఖరి ఎలా ఉండబోతుంది..?

పేద విద్యార్థులకు ఇక ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందా..అంటే తాజా పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. రూ.కోట్లలో ఫీజు బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు తాజాగా హైకోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలో న్యాయస్థాన తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఫీజు రీయీంబర్స్‌మెంట్‌ పథకం..
పేద, నిరుపేద వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల సంక్షేమం కోసం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫీజు రీయీంబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. కొత్త రాష్ట్రం ఏర్పడినా.. ప్రభుత్వాలు మారినా ఈ పథకం అమలు మాత్రం కొనసాగుతోంది. అయితే బకాయిలు మాత్రం ఏటా రూ.కోట్లలో పేరుకుపోతుండడం గమనార్హం. దీంతో ఆయా కళాశాలలు ఏటా ఆందోళనలకు దిగడం.. ప్రభుత్వం నామమాత్రంగా నిధులు విడుదల చేయడం షరా మామూలుగా మారింది.
హైకోర్టును ఆశ్రయించిన కాలేజీలు
బకాయిల చెల్లింపు విషయంలో టోకెన్లు జారీ చేసిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్‌ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగులకు వేతనాలు సైతం చెల్లించలేకపోతున్నామని, కళాశాలలు నడిపే పరిస్థితి లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాయి. విచారణ జరిపిన కోర్టు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి (2026-27 విద్యా సంవత్సరం) ఫీజు వసూలు చేసుకోవచ్చని ప్రైవేటు కళాశాలలకు సూచించింది. ప్రభుత్వం చెల్లించిన వెంటనే వారికి అందజేయాలని మధ్యంతర తీర్పు ద్వారా వెల్లడించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.
ఆందోళనలో తల్లిదండ్రులు
ఈ విద్యా సంవత్సరం ఏప్ సెట్ రాస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో కోర్టు తీర్పు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఆయా కళాశాలల ఫీజులు భారీగా పెరిగిన నేపథ్యంలో రూ.లక్షల్లో చెల్లించడం పేద కుటుంబాలకు పెనుభారంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో మెరిట్‌ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం
నాడు వైఎస్సార్ హయాంలో తీసుకువచ్చిన ఈ పథకానికి ఒకవేళ బ్రేక్ పడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో రేవంత్ సర్కారు తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బకాయిల చెల్లింపులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అండగా నిలుస్తారా.. లేదా కోర్టు తీర్పు ప్రకారం ముందుకు సాగుతారా అనేది వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి : రాఘవపై ఆప్ గుర్రు.. ఆయ‌న‌కు మైక్ ఇవ్వొద్దంటూ ‘రాజ్య‌స‌భ’ కు అధిష్టానం లేఖ‌!

Mahila reservation | ‘ఆమె’కు అందలం దక్కేనా.. రానున్న ఎన్నికల్లో మహిళా శక్తి కీలకం కానుందా?.. ఎవరికి కలిసొచ్చేనో..!

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయా.. జాతీయ పార్టీ పాగా వేస్తుందా….లేదా ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయా.. మహిళా శక్తి ప్రభావం ఎవరికి కలిసివస్తుంది.. డీలిమిటేషన్ సన్నాహాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో..
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆయా పార్టీలు ఇప్పటికే అంతర్గతంగా ఫోకస్ కూడా పెంచినట్లు తెలుస్తుంది. జాతీయ పార్టీలతో పాటు కొత్త పార్టీ దిశగా పావులు కదుపుతున్న కవిత కూడా దీనిపై గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. స్వయంగా ఆమె అధ్యక్షురాలుగా పార్టీ రూపుదిద్దుకుంటున్న తరుణంలో మహిళా ప్రాధాన్యం కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది.

కవితకు ఢిల్లీ వేదికగా పోరాటం కలిసొచ్చేనా
మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కవిత మూడేళ్ల క్రితం ఢిల్లీ వేదికగా ఆందోళనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షతోపాటు బిల్లుకు ఏకాభిప్రాయం కోసం దేశవ్యాప్తంగా 47 రాజకీయ పార్టీలకు లేఖలు కూడా రాశారు. ఈ క్రమంలో ‘నారీ శక్తి వందన్ అదినియమ్’ పేరిట మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఇటీవల ఆమోదించింది. వచ్చే ఎన్నికల్లో దీనిని అమలు చేసే దిశగా కేంద్రం సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : తండ్రిని ఫాలో అవుతున్న తనయ.. పార్టీ విషయంలో ఆచీతూచి వ్యవహరిస్తున్న కవిత

స్త్రీ శక్తి కీలకం కానుందా..
రాష్ట్ర జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలు రానున్న ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటివరకు చాలా పార్టీలు ఈ అంశాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. ఒకవేళ రిజర్వేషన్ అమలు జరిగితే తప్పనిసరిగా కోటా ప్రకారం కేటాయించాల్సిందే. జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ దీనిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నప్పటికీ ప్రధానంగా మహిళా అధ్యక్షురాలు గా రానున్న కవిత పార్టీకి కలిసి వచ్చే అవకాశం లేకపోలేదు.

kavitha party| తండ్రిని ఫాలో అవుతున్న తనయ.. పార్టీ విషయంలో ఆచీతూచి వ్యవహరిస్తున్న కవిత

కవిత కొత్త పార్టీ ముహూర్తం ఈ నెల 25న ఖరారైన విషయం తెలిసిందే. ఈ మేరకు విధివిధానాల ఖరారుపై ఆమె పూర్తి దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మేధావులు, ఆయా రంగాల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించి అన్ని వర్గాలను కలుపుకొని పోయే దిశగా ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.
వరుస సమావేశాలు
గతంలో టిఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా కేసీఆర్ ఆయా రంగాల ప్రముఖులు, నిపుణులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్లుగానే జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా అలాగే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా పార్టీ విధి విధానాలు, చేరికలపై ఆమె ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా నెరవేరని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సమస్యలు, మెజారిటీ వర్గాల శ్రేయస్సు వంటి వాటిపై ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. విద్య, వైద్యం, నిరుద్యోగం, నీటి పారుదల వంటి కీలక అంశాలతో పాటు సబ్బండ వర్గాలకు మేలు జరిగే కార్యక్రమాల రూపకల్పనపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే చేరికల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రానున్న జీహెచ్ఎంసీ, పరిషత్ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పాటు తనకు పట్టున్న ఉత్తర తెలంగాణలో కీలక ప్రాంతాలపై గురి పెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది.
యువత, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ల పై ఫోకస్
యువతరం తో పాటు ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారులను పార్టీలో కి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మిగతా పార్టీల కంటే భిన్నంగా మహిళలకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తుంది
ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్
నవమి రోజున ప్రకటించిన విధంగా ప్రజల నుంచి కూడా కవిత ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. తన తండ్రి మాదిరిగా పార్టీ విషయంలో పూర్తిస్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : తెలం’గానం’.. కలిసొచ్చేనా ‘జాగృతి’కి జనం హారతిచ్చేనా?

AAP is angry with Raghava |రాఘవపై ఆప్ గుర్రు.. ఆయ‌న‌కు మైక్ ఇవ్వొద్దంటూ ‘రాజ్య‌స‌భ’ కు అధిష్టానం లేఖ‌!

రాజ్య‌స‌భలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఎలుగెత్తి సామాన్యుని గొంతుక‌గా నిలిచిన ఆప్‌ ఎంపీ రాఘ‌వ చ‌డ్డా ఇటీవ‌ల వార్త‌ల్లోకెక్కి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆయ‌న‌పై సొంత పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ లైన్ కాకుండా సొంత ఇమేజ్ కోసం వ్య‌వ‌హరిస్తున్న‌ట్లుగా భావించిన అధిష్టానం అత‌డిపై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ ప‌ద‌విని తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాదు అత‌డికి స‌భ‌లో పార్టీ త‌ర‌ఫున మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని చైర్మ‌న్‌కు పంపిన లేఖ‌లో పేర్కొంది. ఆ స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిఠ‌ల్‌ను నియ‌మించాల‌ని కోరింది.
అస‌లేమైంది..
ఆప్ ప్రారంభం నుంచి కేజ్రీవాల్ వెంట న‌డిచారు రాహుల్‌. 2012 నుంచి క్రీయాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఢిల్లీ ఎమ్మెల్యేగానూ ప‌నిచేశారు. తాజాగా పంజాబ్ రాష్ట్ర కో ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూనే అక్క‌డి నుంచి రాజ్య‌స‌భ ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తు న్నారు. అయితే కేజ్రీవాల్ అరెస్టు, జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత రాహుల్ పార్టీ కార్య‌కలాపాల్లో అంటీముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం కొంత ఆస‌క్తిక‌రంగా మారింది. పార్టీ లైన్ కాకుండా సొంతంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స‌భ‌లో ప్ర‌స్తావించ‌డం వంటి అంశాల‌ను అధిష్టానం సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌నపై వేటుకు రంగం సిద్ధం చేసిన‌ట్లుగా సమాచారం. ఇందులో భాగంగా తొలుత ఫ్లోర్ లీడ‌ర్‌గా తొల‌గింపు అంశం తెర‌పైకి తెచ్చిన‌ట్లు తెలుస్తోంది.
వేటు ప‌డితే రాహుల్ అడుగులు ఎటువైపు
ఒక‌వేళ పార్టీ అత‌డిపై వేటు వేస్తే అత‌డి అడుగులు ఎటువైపు ఉంటాయ‌నేది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది. కొత్త పార్టీ పెడ‌తారా.. లేదా జాతీయ పార్టీల వైపు వెళ‌త‌రా అనేది ప్ర‌స్త‌తం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది.
ఓడిపోలేదు..: రాహుల్ చ‌డ్డా
పార్టీ త‌న‌పై తీసుకున్న చ‌ర్య‌ల నేప‌థ్యంలో రాహుల్ చ‌డ్డా తాజాగా స్పందించారు. తాను ప్ర‌జ‌ల మ‌నిషిని.. వారి స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌డం త‌ప్పేంట‌ని.. త‌న గొంతు ఎందుకు నొక్క‌తున్నార‌ని పార్టీ అధిష్టానాన్ని ఆయ‌న మెసేజ్ ద్వారా ప్ర‌శ్నించారు. తన మౌనం ఓట‌మి కాదంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తాను ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడుతూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి : పార్లమెంటులో ‘సామాన్య’ గొంతుక.. రాఘవ

oracle dangerbells| డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఒరాకిల్ ! టేకిల్లో గుబులు రేపుతున్న మెయిల్స్

oracle dangerbells| నిన్నటిదాకా సాఫ్ట్వేర్ కొలువంటే ఓ క్రేజ్. ఆరంకెల ప్యాకేజీలు అందరినీ ఆలోచింపజేసేవి. ప్రస్తుతం సీన్ రివర్స్ అవుతుంది. ఇప్పటికే ఒరాకిల్ లే-ఆఫ్ ప్రకటించి 30 వేల ఉద్యోగులను ఇంటి బాట పట్టించింది. త్వరలో మరికొందరు కూడా ఉంటారని డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఇది ఒక్కటే కాదు.. మరిన్ని కంపెనీలు ఇదే బాట పడుతున్నట్లుగా తెలుస్తుంది.
టేకిల్లో గుబులు
ఇంజినీరింగ్ పూర్తి కాగానే క్యాంపస్ కొలువులు కొట్టిన యువత మంచి ప్యాకేజీలతో భవితకు బంగారు బాటలు వేసుకున్నారు. పెళ్లిళ్లు కాగానే సిటీలో సొంతిల్లు..కారు.. వంటివి కామన్ గా మారాయి. వేతనానికి తగ్గట్లు ఈఎంఐల ఖాతాలో చేరారు. పిల్లలకు మంచి విద్య అందిస్తున్నారు. సీన్ కట్ చేస్తే.. ఏఐ రాకతో పలు కంపెనీలు లే ఆఫ్ బాట పట్టాయి. ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టాయి. ప్రస్తుతం ఒరాకిల్ 30 వేల మందిని తొలగించింది. ఇందులో భారతీయులు 12వేల మంది వరకు ఉన్నారు.త్వరలో మరికొందరికి కూడా ఉధ్వంసం ఉంటుందని మెయిల్స్ ద్వారా హెచ్చరికలు పంపుతుంది. ఉన్నఫలంగా కొలువులు పోవడంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తం అవుతుండగా.. ఉన్నవారిలోనూ ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వెంటాడుతుంది. మిగతా కంపెనీల పరిస్థితి కూడా ఇలాగే ఉండడంతో ప్రత్యామ్నాయం పై దృష్టి సారిస్తున్నారు.
ఐటీ రంగం బెంబేలు
దాదాపు 15 ఏళ్ల సీనియర్లను సైతం ప్యాకేజీలు ఇచ్చి వదులుకుంటుండడంతో ఉద్యోగుల్లో ఒక్కసారిగా ఆందోళన కనిపిస్తుంది. ఓరాకిల్ తో మొదలైన ఈ ముప్పు ఎక్కడికి దారితీస్తుందో అనే చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న 60 లక్షల ఉద్యోగుల్లో వాట్ నెక్స్ట్ అనే ఆలోచన వినిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎన్ని పొట్టలు కొడుతుందో వేచి చూడాల్సిందే మరి.

ఇది కూడా చ‌ద‌వండి : పని లేకుంటే జీతం తీసుకోలేను.. రాజీనామా ఆమోదించండి.. రాష్ట్రపతికి ఓ ఐఏఎస్ నివేదన!

Ias rinkusingh | పని లేకుంటే జీతం తీసుకోలేను.. రాజీనామా ఆమోదించండి.. రాష్ట్రపతికి ఓ ఐఏఎస్ నివేదన!

Ias rinkusingh | స‌ర్కారు కొలువంటే ఆషామాషీ కాదు.. అదీ సివిల్స్ అయితే చెప్ప‌న‌క్క‌ర లేదు.. ఏళ్ల పాటు పుస్త‌కాల‌తో య‌జ్ఞం చేయాల్సిందే. ఎన్నో వ‌డ‌పోత‌ల త‌ర్వాత కానీ నెర‌వేర‌దు ఆ క‌ల. అలాంటి ఉన్న‌తోద్యోగాన్ని సైతం త‌న‌కు వ‌ద్దంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు ఈ యువ ఐఏఎస్‌. తాను విధులు నిర్వ‌హించ‌కుండా వేత‌నం తీసుకోలేనంటూ జాబ్‌కే రాజీనామా చేశాడు. ఆమోదించాలంటూ ఏకంగా రాష్ట్ర‌ప‌తికి లేఖ రాసి దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాడు. ఆయ‌నే యూపీ కేడ‌ర్ కు చెందిన యువ ఐఏఎస్ రింకూసింగ్ రాహి.

అసలేం జరిగిందంటే..

  • 2023 బ్యాచ్‌కు చెందిన ఈయ‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని షాజాహాన్‌పూర్ జిల్లా పువాయా ప‌ట్ట‌ణ సబ్ కలెక్టర్ గా ఏడాది క్రితం నియామకమయ్యారు. ఈ క్రమంలో ఒక లాయర్ రోడ్డుపై మూత్ర విసర్జన చేస్తుండగా అతడిని గుంజీలు తీయించారు. న్యాయవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆయన వారిని పిలిచి మాట్లాడారు. అయితే నగరంలో పారిశుద్ధ్యంతోపాటు టాయిలెట్ల నిర్వహణ సరిగా లేదనివారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏకీభవించిన ఆయన బాధ్యత వహిస్తూ వారి ముందు స్వయంగా గుంజీలు తీయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో అతడిని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూబోర్డుకు అటాచ్ చేసింది.

ఎనిమిది నెల‌లుగా పోస్టింగ్ లేదు..

  • ఈ క్రమంలో 8 నెలలుగా పోస్టింగ్ లేదు. విధులు లేకపోవడంతో తాను వేతనం తీసుకోవడం సరికాదని భావించిన ఆయన రాజీనామాకు ఉపక్రమించారు. లేఖను రాష్ట్రపతికి నివేదించారు.సీనియ‌ర్ ఉన్నతాధికారు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.మరోవైపు విషయాన్ని ఆలీఘడ్ లో ఆయన కుటుంబం బుధవారం మీడియా ఎదుట వెల్లడించింది. నిజాయితీ గల అధికారికి న్యాయం చేయాలని కోరింది.
  • స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరు
  • ఈయిన గతంలో ముజఫర్ నగర్ లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పని చేశారు. ఆ సమయంలో భారీ కుంభకోణాన్ని బయట పెట్టారు. దీంతో అతనిపై దాడి కూడా జరిగింది. అయినా అదే పంథా కొనసాగిస్తూ తన మార్కును చూపుతుండడం గమనార్హం.

Kavitha Vijayashanthi : ఉద్యమ గొంతుకలు ఒకటవుతాయా.. ‘బతుకమ్మ’తో రాములమ్మ జత కట్టేనా?

ఖుల్లంఖుల్లా: kavitha vijayashanthi :తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని ఒకరు..పోరు బిడ్డలను విస్మరిస్తున్నారని మరొకరు ‘మండలి’ వేదికగా గొంతెత్తారు. ఇందులో ఒకరు జాగృతి అధ్యక్షురాలు కవిత కాగా మరొకరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి. ఇప్పటికే కవిత బీఆర్ఎస్ వీడి సొంత కుంపటిని సిద్ధం చేసుకుంటుండగా.. ఫైర్ బ్రాండ్ రాములమ్మ తాజాగా సొంత పార్టీ పైనే విమర్శనాస్త్రాలు సందించడం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు ఒక్కతావుతారా.. తెలంగాణ రాజకీయాల్లో మహిళా శక్తిని చాటుతారా.. అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇద్దరూ ఉద్యమకారులే..

తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మతో ప్రస్థానం ప్రారంభించిన కవిత ఇటీవల జరిగిన తాజా పరిణామాల నేపథ్యంలో సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన అనంతరం మండలి వేదికగా చేసిన ఆమె చివరి ప్రసంగం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తాను ప్రస్తుతం ‘ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని.. బలమైన శక్తిగా తిరిగి చట్టసభల్లోకి వస్తానని’ శపథం చేసిన విషయం విధితమే. అనుకున్నట్లుగానే ఆమె తన రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 25న పార్టీ ప్రకటన చేస్తానని ఇప్పటికే ఆమె వెల్లడించారు కూడా. ఇందులో భాగంగా జాగృతి శ్రేణులతో పాటు కలిసి వచ్చే నేతలతో ఆమె పూర్తిస్థాయిలో సంప్రదింపులు చేస్తున్నారు.

విజయశాంతి రాజకీయ ప్రస్థానం

సినీ రంగంలో లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి రాజకీయ అరంగేట్రం 1998లో బీజేపీతో మొదలైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2005లో ‘తల్లి తెలంగాణ’ పార్టీ ప్రారంభించిన ఆమె అనంతరం టీఆర్ఎస్ లో విలీనం చేశారు. ఆ పార్టీతో కలిసి కొంతకాలం పనిచేసిన ఆమె 2009లో మెదక్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఏమైందో ఏమో 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నావంటూ విజయశాంతి పై గులాబీ బాస్ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఆమె 2014లో కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత కొంతకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తిరిగి 2020లో కమలం గూటికి చేరువయ్యారు. అక్కడ ఇమడలేక 2023లో హస్తం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆమె తాజాగా మండలి వేదికగా కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. ఉద్యమకారులకు న్యాయం చేయాలని సొంత ప్రభుత్వం పైనే విమర్శనలు ఎక్కు పెట్టడం ఆసక్తి కలిగిస్తుంది.

కవితమ్మతో రాములమ్మ కలిసి నడుస్తారా

ఉద్యమ ఆకాంక్షలే లక్ష్యంగా తెలంగాణ ప్రజా జాగృతి పేరిట కవిత కొత్త పార్టీని త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో విజయశాంతి మండలిలో తాజాగా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనున్న క్రమంలో తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి నడుస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా,రాష్ట్రంలో సొంత ఇమేజ్ కలిగి ఉన్న ఈ ఇద్దరూ బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురి అయిన వారూ కావడం గమనార్హం.

దీనిని కూడా చదవండి : కళ్ల ముందున్నా.. కలవనంత దూరమాయే! తండ్రి ఆజ్ఞ.. బిడ్డ ప్రతిజ్ఞ..ఆ తల్లికి మాత్రం తప్పని క్షోభ!

Surya Vamshi : రికార్డులతో మెరుస్తున్న సూర్యవంశి

ఖుల్లంఖుల్లా: surya vamshi : వైభవ్ సూర్యవంశి.. ప్రస్తుతం క్రికెట్లో మారుమోగుతున్న పేరిది. ఐపీఎల్ సీజన్ ప్రారంభంలోనే తన సత్తా చేటాడు ఈ బుగ్గ చెంపల బుడ్డోడు. మొన్ననే 15 ఏట అడుగుపెట్టిన ఈ యువబాల క్రికెటర్ పై ఓ లుక్కేద్దామా మరి.
కుటుంబ నేపథ్యం..
సూర్యవంశి 2011 మార్చి 27న బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లా తాజ్పూర్ లో జన్మించాడు. తండ్రి సంజీవ్, తల్లి ఆర్తి. తాను కాకపోయినా తన కుమారుడిని ఎలాగైనా క్రికెటర్ చేయాలన్నది ఆ తండ్రి ఆకాంక్ష. ఈ క్రమంలో నాలుగేళ్ల వయసులోనే సూర్యవంశికి క్రికెట్ ఓనమాలు నేర్పించాడు. తొమ్మిదవ ఏట అకాడమీలో జాయిన్ చేశాడు. ఇందుకోసం తన భూమిని సైతం అమ్మాడు. నాన్న ఆశయానికి అనుగుణంగా 12 ఏళ్ల వయసులోనే బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగు పెట్టాడు సూర్య వంశీ.
ఐపీఎల్ అరంగేట్రం..

  • సూర్య వంశీ ఎడమచేతి బ్యాటర్. బంతి ఎలా వచ్చినా బౌండరీ దాటించడమే తన లక్ష్యం. కళ్ళు చెదిరే సిక్సర్లతో విరుచుక పడడం తన నైజం.14 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ లోకి అడుగు పెట్టాడు ఈ చిన్నోడు. అతి చిన్న వయస్కుడిగా(14 ఏళ్ల 23 రోజుల) రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లో శతకం (సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ) సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం విధితమే. 2025 సీజన్ లో మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 252( 24 సిక్సులు, 18 ఫోర్లు) పరుగులు సాధించాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ(century), ఒక సెంచరీ ఉన్నాయి. మొత్తం 36 సగటుతో 206.56 స్ట్రైక్ రేట్ ఉండడం గమనార్హం.
  • ప్రస్తుత ఐపీఎల్ (ipl)సీజన్లో చెన్నై తో జరిగిన తొలి మ్యాచ్లోనే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి తన విధ్వంసకర బ్యాటింగ్ తీరును మరోసారి చాటాడు. మునుమందు మరిన్ని రికార్డులు సొంతం చేసుకునేందుకు ఉవ్విల్లూరుతున్నాడు. మనం కూడా ఆల్ ద బెస్ట్ చెబుదామా మరి.

Kavitha Party : తెలం’గానం’.. కలిసొచ్చేనా ‘జాగృతి’కి జనం హారతిచ్చేనా?

kavitha party | జై తెలంగాణ.. నాడు పది జిల్లాల నినాదం. స్వరాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలను ఐక్యం చేసిన వజ్రాయుధం. మలి దశ పోరుతో సిద్దించిన దశాబ్దాల స్వప్నం. జనం ఆకాంక్షకు అద్దం పట్టేలా ఆ పేరుతో పుట్టిన ఉద్యమ పార్టీకి కలిసాచ్చింది కూడా. రెండు పర్యాయాల ఏలుబడే నిదర్శనం. సీన్ కట్ చేస్తే.. మళ్లీ అదే సెంటిమెంట్ తో రాష్ట్రంలో మరో పార్టీ పురుడు పోసుకునేందుకు రంగం సిద్ధమైంది. దీనికి నేతృత్వం వహిస్తున్నది ఎవరో కాదు.. మలిదశ ఉద్యమ పితగా పేరుగాంచిన కేసీఆర్ తనయ. తాజాగా కవిత కొత్త పార్టీతో జనం ముందుకు రాబోతున్నారు. నవమి రోజున స్వయంగా జాగృతి అధ్యక్షురాలు విషయాన్ని ప్రకటించగా.. జనం హారతి ఇచ్చే తీరు ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
బతుకమ్మ తో మొదలైన ప్రస్థానం..
కవిత రాజకీయ ప్రస్థానం బతుకమ్మ(bathukamma) తోనే మొదలైంది. ఉద్యమ సమయంలో ఈ ప్రాంత అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే పూలసింగిడికి ఆమె పూర్వ వైభవం తీసుకొచ్చారు. జాగృతి వేదికగా పోరు బాట పట్టి ఉయ్యాల పాటలను ఊరురా మారు మోగించారు. ఢిల్లీ పెద్దలతో నాటి ఉద్యమ నేతను సమన్వయపర్చడంలో కీలక పాత్ర పోషించారు. స్వరాష్ట్ర సాధనలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు.
రాజకీయ అరంగేట్రం
మెట్టినిల్లు అయిన నిజామాబాద్ నుంచి ఎంపీగా పొలిటికల్ అరంగేట్రం చేసిన కవితకు రెండోసారి మాత్రం చేదు అనుభవం ఎదురయింది. ఎమ్మెల్సీగా వచ్చిన అవకాశం చివరకు రాజీనామాతో బ్రేక్ పడింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి
రెండోసారి ఓటమి వైఫల్యాలపై లేఖాస్త్రం సంధించిన ఆమెపై అధిష్టానం కన్నెర్ర జేసింది. సస్పెన్షన్ వేటువేయగా.. అంతే దీటుగా ఆమె రాజీనామాస్త్రాన్ని ప్రయోగించారు. రాజకీయ శక్తిగా తిరిగి వస్తానని మండలిలో ప్రతీనభూనారు. నాటి ఉద్యమ పాఠాలతో జనం బాట పట్టారు. సర్కారు తీరును ఎండగడుతూనే కన్నీటికి తోడయ్యారు. బాధితులకు భరోసాగా నిలిచారు.
జైలుకెళ్లి..తిరిగొచ్చాక
లిక్కర్ కేసులో జైలు(jail) కెళ్లిన ఆమె తాజాగా కోర్టు తీర్పు వచ్చాక సత్యమేవ జయతే అంటూ నినదించారు. తాను ఏ తప్పు చేయలేదని.. చేయబోనని స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్యలకు తాను బలయ్యానని చెప్పుకొచ్చారు. సామాజిక తెలంగాణ తన లక్ష్యమని.. రాజకీయ పార్టీగా వచ్చి సాధిస్తానని పిడికిలెత్తారు.
kavitha party | ఇందూరు నుంచి కీలక ప్రకటన
తన అత్తగారిల్లు అయిన నిజామాబాద్ నుంచి నవమి రోజున తన పార్టీపై కవిత కీలక ప్రకటన చేశారు. సస్పెన్స్ కు తెరదీస్తూ వచ్చేనెల 25న హైదరాబాద్ వేదికగా పార్టీ విధి విధానాలు ప్రకటిస్తానని వెల్లడించారు.
తెలంగాణ ప్రజల గొంతుకగా..
తెలంగాణ ప్రజా గొంతుకగా.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. ఇంటి పార్టీగా రాబోతున్నామని అన్ని వర్గాల ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకోవాలని కోరారు. ఏప్రిల్ 25న పార్టీ పేరు, విధి విధానాలు ప్రకటిస్తామని వెల్లడించారు.