Monday, July 27, 2026
Home Blog Page 12

నిన్న వెలుగుమట్ల.. నేడు ఔట్ సోర్సింగ్.. సమస్యల దారిలో ఆ ఇద్దరు!

ఖుల్లంఖుల్లా : kavitha, vishardhan| సమస్య ఏదైనా.. బాధితుల పక్షాన తామంటూ ముందుకు సాగుతున్నారు ఆ ఇద్దరు. ఇందులో ఒకరు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(kavitha), మరొకరు ధర్మ సమాజ్‌ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్‌ మహరాజ్‌.

kavitha, vishardhan| వెలుగుమట్లలో..
* ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కవిత, విశారదన్ ఇటీవల ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ నిరాహార దీక్షకు దిగారు. అరెస్ట్ కూడా అయ్యారు. ఆయా వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం స్పందించింది. బాధితులకు టోకెన్లు జారీ చేయడంతో వారు ఆందోళన విరమించారు.

kavitha, vishardhan| ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం
* తాజాగా ఇందిరా పార్క్ వద్ద ఆదివారం నిర్వహించిన ఔట్ సోర్సింగ్(outsourcing) ఉద్యోగుల జేఏసీ ధర్నాకు వీరిద్దరూ మద్దతు తెలిపారు. వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లోగా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ఇరువురు ఆందోళన బాట పడుతున్నారు. బాధితులకు అండగా ఉంటూ జనం గొంతుకగా నిలుస్తున్నారు. పరిష్కారం పై భరోసా కల్పించేలా చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలో మరికొన్ని వర్గాలు వీరిని ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. కాగా, కొత్తగా పార్టీ పెట్టనున్న కవితకు ఇది ఎంతవరకు మైలేజ్ ఇస్తుందో చూడాలి మరి.

కళ్ల ముందున్నా.. కలవనంత దూరమాయే! తండ్రి ఆజ్ఞ.. బిడ్డ ప్రతిజ్ఞ..ఆ తల్లికి మాత్రం తప్పని క్షోభ!

Even though they are in front of our eyes..

ఖుల్లంఖుల్లా : Kavitha new party |ఆ తండ్రికి గారాల పట్టి.. బిడ్డకు కూడా డాడీ అంటే అంతే ప్రాణం. ఏమయిందో ఏమో.. వారి మధ్య ఎడబాటు పెరిగింది. అగాధంగా మారింది. దగ్గరే ఉన్నా కదలని పెదవులు. తప్పని మౌనం. ఆ కనురెప్పల మాటున దాగిన కన్నీటి సంద్రం వారికి మాత్రమే తెలుసు. ఆ పెద్దాయన బీఆర్ఎస్ అధినేత కాగా ఆమె కల్వకుంట్ల కవిత.
Kavitha new party | అసలు ఏమైంది
ఉద్యమ నేత కేసీఆర్ (kcr)కు కవిత అంటే పంచ ప్రాణాలు. స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో ప్రకటించిన విషయం విధితమే. ఆమె కూడా అంతే. పెళ్లయినా ఇంటిపేరు మార్చుకోకుండా తన తండ్రి పై ఉన్న మమకారాన్ని ‘కల్వకుంట్ల’గా సుస్థిరపరుచుకున్నారు. నాన్న ఆశీర్వాదంతో బతుకమ్మతో మొదలైన ఆమె ప్రస్థానం తొలి ప్రయత్నంలోనే పార్లమెంటులోకి అడుగులు పడ్డాయి. తన వాగ్దాటితో తెలంగాణ గోడు వినిపించడమే కాదు.. నిధులు రాబట్టడంలోనూ సక్సెస్ అయ్యారు. తండ్రికి తగ్గ తనయురాలుగా అందరి మన్ననలూ అందుకున్నారు. అయితే మలి ప్రయత్నం.. ‘కలిసి’ రాలే. ఒంటరిగా మారిన ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు ఉద్యమ నేత.
Kavitha new party | రాజకీయ కక్షలకు బలి?
సీన్ కట్ చేస్తే.. దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలనే భావనతో 2022 డిసెంబర్ 22న బీఆర్ఎస్ గా మారిన గులాబీ పార్టీకి అప్పటి నుంచే రాజకీయ ఇబ్బందులు మొదలయ్యాని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర సర్కారు పావులు కదిపిందనే విమర్శలున్నాయి. రాజకీయ కక్షలో భాగంగానే తన బిడ్డపై లిక్కర్ కేసు తెరపైకి తెచ్చారని స్వయంగా కేసీఆరే ప్రకటించిన విషయం తెలిసిందే. తన బిడ్డ కడిగిన ముత్యం వలే త్వరలోనే వస్తుందని చెప్పిన ఆయన మాట ఇటీవలే అక్షరసత్యం అయింది కూడా.
Kavitha new party | మూడోసారి చేజారిన అధికారం
దాదాపు పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఆ పార్టీకి సాధారణంగా కొంత వ్యతిరేకత ఉండడం మామూలే. అయితే అభ్యర్థులను ఎక్కువగా మార్చకుండా బరిలో నిలవడం, ప్రత్యర్థుల హామీలను పట్టించుకోకపోవడం తదితర కారణాలతో మూడోసారి గులాబీ పార్టీకి కొంత ప్రతికూల ఫలితాలు వచ్చాయి. 2023లో అధికారం కోల్పోయాక అందరిలో ఒక్కసారిగా నిస్తేజం. వెంటనే వచ్చిన పార్లమెంట్ లోనూ ఊహించని ఫలితాలు వారిని మరింత నిరాశకు గురి చేశాయి. ఈ క్రమంలోనే కవిత రాసిన లేఖ లీకై రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ‘తన తండ్రి దేవుడని.. చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ’ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. ఇలా మొదలైన గ్యాప్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. చివరకు క్రమశిక్షణ పేరిట తండ్రి ఆజ్ఞగా.. సస్పెన్షన్ వేటుకు దారి తీసింది. అయితే కవిత కూడా అంతే దీటుగా స్పందిస్తూ రాజీనామాస్త్రాన్ని సంధించారు. రాజకీయ శక్తిగా తిరిగి వస్తానంటూ సాక్షాత్తు పెద్దల సభలో ప్రతిన భూని జనం బాట పట్టారు. ప్రజల గొంతుక గా మారి బాధితుల పక్షాన పిడికిలెత్తుతున్నారు.
Kavitha new party | కొత్త పార్టీ వైపు అడుగులు
సామాజిక తెలంగాణ లక్ష్యంగా కొత్త పార్టీ వైపు తన అడుగులు ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేసిన కవిత (kavitha) తాజాగా నిజామాబాద్ వేదికగా ఆ ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ 25పైనే ఉంది.
Kavitha new party | ఎదుగుతున్నట్లా…ఎదురు తిరిగినట్లా?
కన్నబిడ్డ ఓ పార్టీ పెట్టే స్థాయికి ఎదిగిందని సంతోషపడాలా.. తండ్రి ఆజ్ఞను దిక్కరించిందని బాధపడాలో తెలియని విచిత్ర పరిస్థితి ఆ అమ్మది. గుండెల్లో దాగిన ప్రేమను చూపలేక ఆ తండ్రి మౌనంగా రోదిస్తున్నారా.. తనను బహిష్కరించిన కన్న ప్రేమను నిత్యం గుర్తుకు చేసుకుంటూ ఆ బిడ్డ క్షణక్షణం కన్నీటి పర్యంతమవుతుందా.. అనేది ఆ ముగ్గురికే తెలుసు. కాలం కరుణిస్తే మళ్లీ అందరూ ఒక్క చోటుకు చేరుతారా.. లేదా ఎప్పటికీ ప్రత్యర్థులుగానే ఉండిపోతారా వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి : ‘క’దిలే.. ‘వి’రాటంలో.. ‘త’పోవనమై

సీట్లు పెరుగుతున్నాయోచ్.. ఎమ్మెల్యే,ఎంపీ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్..!

0
assembly and parliament Seats are increasing.. 

రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా.. అయితే మీకో శుభవార్త.. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న లోక్ సభ స్థానాలు 543 నుంచి 816కు పెరగనున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6185కు పెరగనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

  • తెలంగాణలో ప్రస్తుతం17 లోకసభ స్థానాలు ఉండగా కొత్తగా మరో తొమ్మిది పెరగనున్నాయి. వీటితో కలిపి 26కు చేరే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న 119 స్థానాలకు మరో 60 జతకానున్నాయి. దీంతో మొత్తం 179కి పెరగనున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే.. ఇక్కడ లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం 25 ఉన్నాయి. కొత్తగా 13 పెరిగే అవకాశం ఉంది. దీంతో మొత్తం స్థానాల సంఖ్య 38కి చేరనుంది. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ప్రస్తుతం 175 ఉండగా కొత్తగా మరో 85 పెరగనున్నాయి. వాటితో కలిపితే మొత్తం స్థానాలు 263కు చేరువకానున్నాయి.
    వారిలో ఆశలు
  • ఇప్పటివరకు టికెట్ దక్కని వారు, పొలిటికల్ రంగప్రవేశం చేయాలనుకునేవారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా ప్రకటనతో అలాంటి వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. అప్పుడే తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాలపై ఫోకస్ పెడుతున్నారు. పార్టీల ముఖ్య నేతల టచ్ లోకి వెళ్తున్నారు. ఈసారి తమను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని విన్నవించుకుంటున్నారు. స్థానాలు పెరిగితే ఒక్క అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

పార్లమెంటులో ‘సామాన్య’ గొంతుక.. రాఘవ

0
రాఘవ చడ్డా.. ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతుంది. పార్లమెంటులో సామాన్య గొంతుకగా ప్రతిధ్వనిస్తోంది. చిన్న వయసులోనే రాజకీయ అరంగేట్రం చేసి అందరి మన్ననలు అందుకుంటున్న ఆప్ ఎంపీపై లుక్కేద్దామా మరి. 

రాజకీయ అరంగేట్రం

  • ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.
  •  2015లో పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితుడయ్యారు.
  • 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
  • 2020లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో రాజిందర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
  • 2020 మార్చి 2న ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యారు.
  • 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల ఇన్చార్జిగా పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో పార్టీ ఈయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. 2022 మార్చి 21నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.
  • అత్యంత పిన్న వయస్కుడైన పార్లమెంటేరియన్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.

సామాన్యుని గొంతుకగా ప్రశ్నలు సంధిస్తూ..

  • పార్లమెంటులో సామాన్యుడు గొంతుకగా పన్ను మినహాయింపులు, టెలికాం డేటా క్యారీ-ఫార్వర్డ్ వంటి ప్రజా సమస్యలను లేవనెత్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. అందులో కొన్ని ప్రశ్నలు ..
  • 28 రోజుల వ్యాలిడిటీపై..: టెలికాం కంపెనీలు తమ ప్లాన్లను ‘మంత్లీ’ అని చెప్పి కేవలం 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఇస్తున్నాయి. దీంతో వినియోగదారులు సంవత్సరానికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇది సామాన్యులపై భారం కాదా అని ప్రశ్నించారు.
  • డేటా క్యారీ ఫార్వర్డ్: ఒక రోజులో వాడకుండా మిగిలిన డేటాను తర్వాత రోజుకు బదిలీ చేసే సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
  • ఇన్ కమింగ్ కాల్స్ కొనసాగింపుపై: రీఛార్జ్ గడువు ముగిసిన తర్వాత కూడా కనీసం ఏడాది పాటు ఇన్కమింగ్ కాల్స్ ఎస్ఎంఎస్ వంటి సదుపాయం ఉండాలని సూచించారు.
  • టోల్ టాక్స్ రద్దుపై: వాహనం కొనేటప్పుడే రోడ్ టాక్స్, ఇతర పన్నులు చెల్లిస్తున్న వాహనదారుల నుంచి మళ్లీ టోల్ టాక్స్ పేరిట వసూలు సరికాదన్నారు. ఈ విషయంలో మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
  • ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు ఉన్నప్పుడు, రాజకీయ నాయకులకు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించి చర్చకు తెర లేపారు.
  • ప్రజాప్రతినిధులు పనిచేయకుంటే పదవీకాలం ముగియకముందే తొలగించే హక్కు(right to recall) ఓటర్లకు ఉండాలని ప్రతిపాదించారు.

స్టాండింగ్ కమిటీ సభ్యడిగా..

రాజ్యసభలో ఆర్థిక శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

అవార్డులు..

  • ప్రపంచ ఆర్థిక వేదిక WEF నుంచి ‘యంగ్ గ్లోబల్ లీడర్’గా గుర్తింపు.
  • ఇండియా-UK అవుట్‌స్టాండింగ్ అచీవర్ అవార్డు.

‘బంగారు’ మాట.. ఇదే మంచి సమయయా.. మించినా దొరకదా!

  • The word ‘golden’… is this a good time?… పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతోంది. వరుసగా తొమ్మిది రోజు తగ్గడం పరిస్థితికి అద్దం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్‌ ధర సోమవారం నాలుగు నెలల కనిష్టానికి చేరువైంది. తాజాగా 4,138 డాలర్లకు దిగివచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 1,36,650 పలికింది. ముందు రోజుతో పోల్చితే రూ.10,320 మేర తగ్గింది. మరోవైపు వెండి ధర కూడా కిలో రూ.2.30లక్షలకు చేరింది. ముందు రోజుతో పోల్చితే రూ.20వేలు తగ్గడం గమనార్హం.
    రికార్డు స్థాయి నుంచి కిందికు..
    ఈ ఏడాది జనవరి 29, 2026న పుత్తడి 10 గ్రాములకు రూ.1,93,096 రికార్డు స్థాయి పలికింది. తాజా ధరతో పోల్చితే 33శాతం పైగా పడిపోవడం గమనార్హం. వెండి ధర ఈ ఏడాది జనవరి 29న కిలో రూ.4.25 లక్షలు పలకగా ప్రస్తుత ధరతో పోల్చితే ఏకంగా 45శాతం పైగా తగ్గంది.
    యుద్ధ విరమణ ప్రకటనతో ..
    అయితే సాయంత్రం యుద్ధానికి ఐదు రోజులపాటు బ్రేక్ వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన నేపథ్యంలో రాత్రి 8 గంటల సమయంలో మళ్లీ ధర పెరగడం గమనార్హం. పది గ్రామ పుత్తడి ఏకంగా రూ. 10 వేల వరకు పెరిగి రూ.1.46 లక్షలకు చేరువైనది. వెండి కూడా కిలో మరో రూ.2వేలు పెరిగి రూ.2.32లక్షలకు ఎగబాకింది. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

చేతులు జోడించి చెబుతున్నా.. దయచేసి ఆ నూనెలు.. చక్కెర వాడకండి.. ఓ డాక్టర్ ఆవేదన

 

  • తన దగ్గరకు వచ్చిన పేషంట్లతో ఓ డాక్టర్ కన్నీటి పర్యంతమైన ఘటన ఇది. ఆరోగ్యానికి హాని చేసే రిఫండ్ ఆయిల్, చక్కెర వంటివి వాడకూడదని క్యాన్సర్ వంటి రోగాలను కొనితెచ్చుకోవద్దంటూ చేతులు జోడించి చెప్పిన వైద్యుని గురించి ఓ సారి తెలుసుకుందాం పదండి.
    ఎక్కడంటే..
    * కరీంనగర్ లోని టైం న్యూరో కేర్ కు చెందిన వైద్యుడు విక్రమ్ సింగ్ ఠాకూర్ తన వద్దకు వచ్చిన పేషంట్లతో ఇటీవల కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో రిఫండ్ ఆయిల్,షుగర్ వాడకంతో వచ్చే దుష్పరిణామాలను వివరించాడు. తాను చూసిన పేషెంట్స్ లో ఎక్కువగా కనిపించిన సమస్యలను వారి ముందు ఉంచాడు. ఆ కష్టాలు పగవారికి కూడా రావొద్దంటూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురి అయ్యాడు. కన్నీటిని ఆపుకోలేకపోయాడు. ఇకనైనా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ద వహించాలన్నాడు. గానుగ నూనె , నెయ్యి వాడాలని.. పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు, ఫోన్లు ఇవ్వవద్దని.. బయట ఫుడ్ కు దూరంగా ఉండాలని సూచనలిచ్చాడు. అలాగే ఎప్పుడూ తినడం కూడా ఓ రోగమని అందుకే పొట్టలు వస్తున్నయని.. మిత ఆహారం శ్రేయస్కరమని పేర్కొన్నాడు.
  • సోషల్ మీడియాలో చక్కర్లు..
    * ఆరోగ్యం పై అప్రమత్తంగా ఉండాలంటూ ఈ వైద్యుడి సూచనలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

‘వేరా’యే!

0

ప్రకృతిలో ఎన్నో చిత్రాలు దర్శనమిస్తాయి. చూసే కోణంలో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. సాధారణంగా చెట్టు వేర్లు భూమి అంతరభాగంలో ఉంటాయి. ఇక్కడ మాత్రం బాహ్యంగా కనిపిస్తున్నాయి. చుట్టూ పచ్చదనం, గుట్టలు తోడవడంతో మరింత ఆకర్షణీయంగా మారాయి. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ లో గల ఓ పొలం వద్ద కనిపించిన ఈ దృశ్యం ‘వేరు’గా ఉంది కదూ.

హోర్ముజ్.. ‘సంధి’ చిన్నది.. రవాణా పెద్దది



హోర్ముజ్(straight of Hormuz ).. పశ్చిమాసియాలోని ఇరాన్ ఒమాన్ ల మధ్య ఉన్న ఇరుకైన జల సంధి. ఇప్పుడిది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దాదాపు నాలుగు వారాలుగా కొనసాగుతున్న యుద్ధానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. ఇజ్రాయిల్, అమెరికా దాడులను దీటుగా ఎదుర్కొంటున్న ఇరాన్ ఈ ప్రాంతాన్ని మాత్రం తనకు ఆయువు పట్టుగా మార్చుకుంది. క్రూడాయిల్ రవాణా వ్యవస్థను శాసిస్తుంది. యావత్ ప్రపంచాన్ని హెచ్చరిస్తుంది.

జలసంది విశేషాలివి..

  • పర్షియన్ ఒమన్, గల్ఫ్ ఒమన్ ను కలుపుతూ హిందూ మహాసముద్రానికి అనుసంధానించే కీలక మార్గం.
  • పొడవు సుమారు 167 కిలోమీటర్లు. అత్యంత ఇరుకైన వెడల్పు 33 కిలోమీటర్లు.
  • ఈ మార్గం గుండా నిరంతరం వందలాది నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. లోనికి, బయటకు వెళ్లేందుకు రెండు ప్రత్యేక మార్గాలు ఉంటాయి. ప్రతీ రూట్ వెడల్పు దాదాపు రెండు నాటికల్ మైళ్ళు. వీటి మధ్య బఫర్ జోన్ మరో రెండు నాటికల్ మైళ్ళు  ఇలా మొత్తంగా 10 కిలోమీటర్ల మేర మార్గం రూపొందించబడింది.
  • ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇక్కడ టీఎస్ఎస్(ట్రాఫిక్ సపరేషన్ స్కీం)ను అమలు చేస్తారు.
  • ఈ మార్గంలో ప్రతిరోజు సగటున 21 మిలియన్ బ్యారెల్స్ (అంటే సుమారు 334 కోట్ల లీటర్లు) క్రూడాయిల్ సరఫరా అవుతుంది.
  • ప్రపంచ చమురు వినియోగంలో సుమారు 20శాతం ద్రవీకృత సహజ వాయువు (LNG)లో అధిక భాగం ఈ మార్గం గుండానే వెళుతుంది.
  •  1980లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఈ జలసంధిపై దాడి జరిగింది. ఆ ఫలితంగా రవాణాను రక్షించడానికి భారీ నౌకాదళ కాన్వాయ్‌లు చేపట్టబడ్డాయి.
    తాజా పరిస్థితి
  • అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేసింది. నౌకా రవాణాను పరిమితం చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో మార్గాన్ని పునరుద్ధరించాలని అంతర్జాతీయంగా పలు దేశాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి.
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపి తీవ్రమైన ద్రవ్యోల్బణం దిశగా సాగుతోంది.

ఈ ఐపీఎల్ లో వీరు చాలా హాట్ గురూ..

ఐపీఎల్ వచ్చేసింది. మరో వారం రోజుల్లో కొత్త సీజన్ షురూ కాబోతుంది. ఇప్పటికే ఆయా జట్లు సిద్ధమవుతున్నాయి. ఆటగాళ్లను ఏటా యాజమాన్యాలు వేలం ద్వారా కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ సారి అత్యధిక రేటు పలికిన ఆటగాళ్లను ఓ సారి చూద్దామా మరి.
  • రిషబ్ పంత్(LSG) : కీపర్ కం బ్యాటర్. రూ.27 కోట్లకు లక్నో జట్టు కొనుగోలు చేసింది.
  • శ్రేయాస్ అయ్యర్(PBKS): ఆల్ రౌండర్. పంజాబ్ కింగ్స్ జట్టు రూ.26.75 కోట్లకు కైవసం చేసుకుంది.
  • కామెరన్ గ్రీన్(KKR): ఆల్ రౌండర్ అయిన గ్రీన్ ను రూ.25.20 కోట్లకు కోల్ కతా జట్టు కొనుగోలు చేసింది.
  • హెన్రిచ్ క్లాసిన్(SRH): బ్యాటర్, వికెట్ కీపర్. రూ.23కోట్లకు హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది.
  • విరాట్ కోహ్లీ(RCB): కుడి చేతి బ్యాటర్. అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న క్రీడాకారుడు. బెంగళూరు జట్టు కింగ్ కోహ్లీని రూ.21కోట్లకు కొనుగోలు చేసింది.
  • మతీశ పతి రాణా(KKR): ఫాస్ట్ బౌలర్. ఈయన ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది.
  • రుతురాజ్ గైక్వాడ్ (CSK): రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఇతడిని రూ.18కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
  • సంజు శాంసన్ (RR): కీపర్, టాప్ ఆర్డర్ బ్యాటర్. ఇతడిని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.18 కోట్లతో కొనుగోలు చేసింది.
  • రషీద్ ఖాన్ (GT): స్పిన్ బౌలర్ . ఈయనను గుజరాత్ టైటన్స్ జట్టు రూ.18 కోట్లతో కైవసం చేసుకుంది.
  • హార్దిక్ పాండ్యా (MI): ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన హార్దిక్ ను రూ.16.35 కోట్లతో ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది.

తీపి..చేదుల బడ్జెట్

షడ్రుచుల పండుగ మరుసటి రోజు వచ్చిన బడ్జెట్ ఎవరిని ఎలా ఒప్పించింది..తన రుచులతో ఏ రంగాలను మెప్పించింది.. ఎవరికి తీపి.. చేదనిపించేదెవరికో.. చూసోద్దాం పదండి.

బూరెలివే..

  • ఇందిరమ్మ కుటుంబ బీమా..: రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సౌకర్యం. ఇది ఈ ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2)నుంచి అమలులోకి రానుంది.
  •  చేయూత పథకం ద్వారా కొత్తగా రెండు లక్షల నూతన పెన్షన్లు మంజూరు.
  •  ఐటీఐలు, ఏటీసీల్లో చేరే వారికి ఇకనుంచి నెలకు రెండువేల ఉపకార వేతనం.
  • బ్రేక్ ఫాస్ట్ : రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఇకనుంచి అల్పాహారంతో పలు అందనున్నాయి.
  • మధ్యాహ్న భోజనం: నూతన విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నారు.
  • ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత వైద్యం: ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించేందుకు 1,050 కోట్లు కేటాయింపు.
  • ప్రమాద బీమా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కోటి 20 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
  • దివ్యాంగ విద్యార్థులకు మోటరైస్డ్ వాహనాల పంపిణీ.
  • యువతకు: వివిధ రంగాల్లో తగిన నైపుణ్య శిక్షణ అందించడానికి వివిధ దేశాల భాషను నేర్పించడానికి సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్ ను కొత్తగా ప్రకటించింది.
  • అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.5కోట్లు కేటాయించింది.
  • చేదనిపించే..! 
  • గతంతో పోల్చితే చేనేత విభాగానికి కేటాయింపులు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరంలో 371 కోట్లు కేటాయించగా ఈసారి కేవలం రూ. 258 కోట్లతోనే సరిపెట్టారు.
  • ఈ బడ్జెట్ లో పింఛన్ పెంపు ఎంతో కొంత ఉంటుందని ఆశపడ్డ లబ్ధిదారులకు నిరాశే మిగిలింది.
  • 56% ఉన్న బీసీల జనాభాకు కేవలం రూ.12,511 కోట్లు(3.8 శాతం) కేటాయించడంపై ఆ వర్గాల నుంచి పెదవి విరుపు కనిపిస్తోంది.