Thursday, July 16, 2026

Civils coaching | సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Civils coaching | తెలంగాణ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సివిల్స్–2027(ప్రిలిమ్స్–కమ్–మెయిన్స్) ఉచిత శిక్షణకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కేంద్రం కరీంనగర్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కేంద్రం, హైదరాబాద్ వారి నేతృత్వంలో నిర్వ‌హించే శిక్ష‌ణ‌కు ఏదైనా డిగ్రీ అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ,ఈబీసీ నిరుద్యోగులు అర్హుల‌ని పేర్కొన్నారు. అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి అయితే రూ. 1.50ల‌క్ష‌ల‌ లోపు, పట్ట‌ణ ప్రాంతాల వారికి అయితే రూ. 2ల‌క్ష‌ల‌ లోపు ఉండాలి. ఆస‌క్తి క‌ల కరీంనగర్‌, జ‌గిత్యాల, పెద్దపల్లి జిల్లాల‌కు చెందిన యువత ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న అభ్యర్ధులు, ఏదైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారు, బీసీ స్టడీ సర్కిల్లో ఇంతకు ముందు శిక్షణ పొందిన వారు ఈ శిక్షణ కు అర్హులు కారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఆగ‌స్టు 7 తుదిగ‌డువు. ఆగస్టు 16న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. అదే నెల 19న ఫలితాలు ప్ర‌క‌టిస్తారు. ఆగస్టు 21న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ పరిశీలన ఉంటుంది. ఆగస్టు 24 నుంచి మొత్తం 150 మందికి హైదరాబాద్లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. ఎంపికైన వారికి నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్, పుస్తకాల కోసం మరో రూ.5 వేలు ఇవ్వ‌నున్న‌ట్లు డైరెక్ట‌ర్ తెలిపారు. మరిన్ని వివరాలకు 040-24071178, 7780359322 నంబర్ లో లేదా బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఆఫీస్ వేళల్లో నేరుగా సంప్రదించాలని సూచించారు.

రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్ధులు సంప్రదించవలసిన వెబ్ సైట్ : www.tgbcstudycircles.cgg.gov.in

ఇది కూడా చ‌ద‌వండి.. ఎల‌క్షన్‌కు సన్నద్ధం.. కేడ‌ర్‌కు దిశానిర్దేశం

Hot Topics

Related Articles