Wednesday, September 30, 2026

Big billion days | బిగ్ బిలియ‌న్ ఆఫ‌ర్లు వ‌చ్చేశాయి.. బ్రో!

Big billion days | కొత్త టీవీ.. ల్యాప్‌టాప్‌.. మొబైల్‌.. ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మిష‌న్‌.. డ్రెసెస్ వంటి ఆన్‌లైన్ షాపింగ్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి ఫ్లిప్ కార్ట్ (Flipkart) శుభ‌వార్త అందించింది. ఎప్ప‌టిలాగే ద‌స‌రా డ‌మాకా ఆఫ‌ర్స్ తో ఈ సారి కూడా రానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే త‌న అధికారిక ప్లాట్‌ఫాంపై బిగ్ బిలియ‌న్ సేల్ తేదీల‌ను వెల్ల‌డించింది. అక్టోబ‌ర్ 9 నుంచి ప్రారంభం కానున్న‌ట్లు ది. తన ఖాతాదారుల కోసం ఎర్లీ ఆక్సెస్ పేరిట‌ ఒక రోజు ముందుగా అందుబాటులో ఉంటుంద‌ని వివ‌రించింది. ఈ ప్రత్యేక సేల్స్ అక్టోబ‌ర్ 18 వ‌ర‌కు ఉండ‌నున్న‌ట్లు స్ప‌ష్టంచేసింది.
ప్ర‌త్యేక డిస్కౌంట్లు..
ఈ సారి ఆక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల‌కు 10శాతం స్పెష‌ల్ డిస్కౌంట్ అందుబాటులో ఉండ‌నుంది. అలాగే ప్రైజ్ క్రాష్‌, బీబీడి స్పెష‌ల్స్‌, టిక్‌టాక్ డీల్స్‌, బ్రాండ్ అవ‌ర్స్, డ‌బుల్ డిస్కౌంట్‌, ర‌ష్ అవ‌ర్స్ పేర‌ట ప్ర‌త్యేక ఆఫ‌ర్లను తీసుకువ‌స్తుంది.
వీటిపైనే ఎక్కువ‌గా..
యూత్ ఎక్కువ‌గా ఆస‌క్తి చూపే మొబైల్స్ ధ‌ర‌లు ఇటీవ‌ల భారీగా పెరిగిన నేప‌థ్యంలో ఈ ఫెస్టివ‌ల్ సేల్స్ కోసం అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొంది. ఏయే మోడ‌ళ్ల‌పై ఎంత డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందో అని ఆరా తీస్తున్నారు. ఓపెన్ మార్కెట్ రేట్ల‌తో పోల్చుతూ కొనుగోలుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఐఫోన్ వంటి ప్రీమియం మొబైల్స్‌, ల్యాప్‌టాప్ వంటివి ఈ సారి కీల‌కం కానున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ప్ర‌స్తుతం ఎల్‌నినో ప్ర‌భావంతో వ‌ర్షాలు లేక‌పోవ‌డం, ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువగా ఉన్న‌నేప‌థ్యంలో చాలామంది ఈ సారి ఏసీల‌పై దృష్టి సారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. స‌మ్మ‌ర్‌లో మాత్ర‌మే గిరాకీ ఉండే వీటిపై ఈ సారి ఎక్కువ మంది ఫోక‌స్ పెట్టే అవ‌కాశం లేక‌పోలేదు. ఇప్ప‌టికే చాలా మంది ఆయా కంపెనీల ఆఫ‌ర్ల‌పై ఆరా తీస్తున్న‌ట్లు తెలుస్తోంది.
విభాగాల వారీగా ..
రూ.20వేల నుంచి రూ.ల‌క్ష వ‌ర‌కు కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్ వ‌స్తువుల‌పై రూ.2వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటాయ‌ని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. అలాగే హోం ఫెస్టివ్ పేరిట 20 శాతం అద‌నపు త‌గ్గింపు, స్పోర్ట్స్, ఫిట్‌నెస్ సామ‌గ్రిపై రూ.500వ‌ర‌కు ఫ్లాట్ డిస్కౌంట్‌, అప్లియ‌న్స్‌పై రూ. 1000 వ‌ర‌కు అద‌న‌పు త‌గ్గింపు ఉంటాయ‌ని వెల్ల‌డించింది. ఫ్యాష‌న్, ఫ‌ర్నిచ‌ర్‌, టాయ్స్‌పై కూడా భారీ డిస్కౌంట్లను ప్ర‌క‌టించింది.

ఇదికూడా చ‌దవండి..: ఓవ‌ర్ టు ఖైర‌తాబాద్‌.. అంద‌రి దృష్టి అటువైపే

Hot Topics

Related Articles