- హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ పోరాటంతోనే సింగరేణిలో మెడికల్ బోర్డు
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
Singareni | సింగరేణి లో డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఈనెల 17, 18 తేదీల్లో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం కార్మికుల విజయమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన గాంధేయమార్గంలో జరిపిన పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చిందనిఎక్స్ లో పోస్ట్ చేశారు. ఐతే తాత్కాలికంగా మాత్రమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయటం కాకుండా కచ్చితంగా నెలకొకసారి మెడికల్ బోర్డు నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల చట్టబద్ధమైన హక్కు అని చెప్పారు. వేలాది మంది కార్మికులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇన్నాళ్లు ప్రభుత్వం పట్టించుకోకపోవడం కారణంగా వారంతా తీవ్ర మనో వేదనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెలా తప్పనిసరిగా మెడికల్ బోర్డు ఏర్పాటు తో పాటు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్‌ఫిట్ చేయాలన్నారు.
బోనాల పండుగ శుభాకాంక్షలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. హైదరాబాద్ నగర ప్రజల ఐక్యతకు చిహ్నమైన ఆషాఢ బోనాల ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు కవిత. ఆ జగన్మాత కరుణా కటాక్షాలు మనందరిపై నిండుగా ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి.. సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


