Gold rate down | బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే మీకు ఇది మంచి సమయం. ఈ ఏడాది మొదట్లో రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ రేట్(gold rate) ప్రస్తుతం నేల చూపులు చూస్తుంది. గడిచిన వారం రోజులుగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా మంగళవారంతో పోల్చితే బుధవారం ఏకంగా 10 గ్రాములపై రూ. 4వేలకు పైగా పడిపోయింది. కొనుగోలుకు ఇది అనుకూలమని నిపుణులు సూచిస్తున్నారు.
ఇటీవల పెరిగిన సుంకాలు..
ఇటీవల ప్రధాని మోదీ ఏడాది పాటు బంగారం కొనుగోలుకు దూరంగా ఉండాలని ప్రకటన చేసిన తర్వాత కేంద్రప్రభుత్వం బంగారం, వెండి ధరలపై సుంకాలు పెంచిన విషయం తెలిసిందే. దీంతో పసిడిధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల నేపథ్యంలో మళ్లీ తగ్గుమఖం పడుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో గోల్డ్ తులానికి రూ.8వేలకు పైగా పడిపోయింది. అలాగే వెండి కిలో రూ.25వేల వరకు తగ్గింది. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం 10 గ్రాముల (24 క్యారెట్) ధర రూ. 1,48,860 ఉండగా.. వెండి కిలో రూ. 2లక్షల 60వేలుగా ఉంది. ముందు రోజుతో పోల్చితే బంగారం రూ. 4వేలు, వెండి రూ. 10వేల వరకు తగ్గడం విశేషం.
ఈ ఏడాది పరిస్థితి..
ఈ ఏడాది బంగారం ధరలు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. జనవరి 29, 2026న పుత్తడి 10 గ్రాములకు రూ.1,93,096ల రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుత ధరతో పోల్చితే ఏకంగా రూ. 44వేలు తగ్గింది. మరోవైపు ఈ ఏడాది జనవరి 29న కిలో వెండి ధర రూ.4.25 లక్షలు పలికింది. ప్రస్తుత ధరతో పోల్చితే కిలోకు ఏకంగా రూ.లక్ష65వేలు తగ్గింది. ఈ లెక్కన దాదాపు 40శాతం వరకు తగ్గుదల నమోదవడం గమనార్హం.
బంగారం,వెండి ధరలు జూన్1 నుంచి ఇలా.. (10గ్రాముల ధర)
తేదీ 24 క్యారెట్ 22 క్యారెట్ వెండి(కిలో)
10రూ.1,48,860 రూ.1,36,450 రూ.2,60,000
9 రూ.1,53,160 రూ.1,40,400 రూ.2,70,000
8 రూ.1,51,690 రూ.1,39,050 రూ.2,70,000
7 రూ.1,52,730 రూ.1,40,000 రూ.2,70,000
6 రూ.1,52,730 రూ.1,40,000 రూ.2,70,000
5 రూ.1,55,730 రూ.1,42,750 రూ.2,80,000
4 రూ.1,56,110 రూ.1,43,100 రూ.2,85,000
ఇదికూడా చదవండి.. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు వేళాయె


