caste Names change | తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితాలో పలు మార్పులు చేపట్టంది. సామాజికంగా అభ్యంతరకరమైన పదాలతో కూడిన పలు కులాల పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సిఫారసుల మేరకు సమాజ గౌరవాన్ని కాపాడేందుకు ఈ మార్పులు చేసినట్లు వెల్లడించింది.
- దొమ్మర : ఈ కులం పేరును ప్రస్తుతం గడవంశీయగా మార్చారు.
- పిచ్చిగుంట్ల : బీసీ జాబితా నుంచి ఈ పదాన్ని పూర్తిగా తొలగించేశారు. ఆ స్థానంలో వంశరాజ్‌గా చేర్చారు.
- తమ్మాలి : శూద్ర కులం అనే అవమానకరమైన పదాన్ని పూర్తిగా తొలగించారు. ఈ వర్గాన్ని ఇప్పుడు అధికారికంగా తమ్మాలి (బ్రాహ్మణేతర)గా పేర్కొన్నారు .
- బుడబుక్కల: శివక్షత్రియను అధికారిక పర్యాయపదంగా చేర్చారు .
- చాకలి: అధికారిక పర్యాయపదంగాధోబీని జోడించారు .
- మేరా: మేరును అధికారిక పర్యాయపదంగా చేర్చారు .
- వీరముష్టి :వీరభద్రీయ అనే ప్రాధాన్యత పేరుతో తిరిగి ఆర్డర్ చేశారు.
- వన్నార్: ఈ పదాన్ని తొలగించారు. ధోబీ అనే పర్యాయపదం చేర్చారు. `
- ఇది కూడా చదవండి.. తెలంగాణలో ఇంజినీరింగ్ కళాశాలల ఫీజులు ఎంతో తెలుసా..




