petro hyke | పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నేపథ్యంలో దేశంలో పెట్రో ధరల మంట కొనసాగుతుంది. 10 రోజుల వ్యవధిలో కేంద్రం నాలుగు సార్లు ఇంధన చార్జీల మోత మోగించింది. సోమవారం మరో సారి భారీగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై రూ.2.84లు, డీజిల్‌పై రూ.2.86 లను పెంచాయి. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.
లీటర్‌కు రూ.8లకు పైగానే పెంపు..
దేశంలో పెట్రో ధరలు రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. ఈనెల 15న లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 3చొప్పున పెంచిన విషయం తెలిసిందే. 19న మరోసారి పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంపుదల చేశాయి. 23న లీటర్‌కు దాదాపు రూ.చొప్పున బాదేశాయి. రెండు రోజులకే దాదాపు మరో రూ.3ల వరకు పెంచేశాయి. 10 రోజుల వ్యవధిలో ఇతర చార్జీలతో కలిపి లీటర్‌పై ఏకంగా రూ.8లకు పైగా పెరగడం గమనార్హం. ఈ ప్రభావం నిత్యావసరాల ధరలపై తీవ్రంగా చూపుతుండగా.. సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్నాయి. పేద, మధ్యతరగతి తరగతి బడ్జెట్ అంచనాలు తప్పుతుంది.
పెరుగుదల కొనసాగే అవకాశం
పెట్రో ధరలు మున్ముందు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే రూ. 110 మార్కు దాటిన ధరలు రూ.120 దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపు ఎంత వరకు వెళుతుందో అని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి.
నగరం పెట్రోల్ డీజిల్
ఢిల్లీ రూ. 102.12 రూ.95.20
హైదరాబాద్ రూ.115.62 రూ.103.76
వరంగల్ రూ.114.53 రూ.103.50
కరీంనగర్ రూ.115.44 రూ.103.79
విజయవాడ రూ.117.16 రూ.104.89
విశాఖలో రూ.116.39 రూ.104.11
తిరుపతి రూ.117.08 రూ.104.75 `
ఇది కూడా చదవండి.. తెలంగాణలో ఇంజినీరింగ్ కళాశాలల ఫీజులు ఎంతో తెలుసా..




