Water Purity | ఆరోగ్యానికి నీరు ఎంతో అవసరం. అయితే మనం తీసుకునే నీటిలో ఏది మంచిదో తెలుసా.. అందులో ఏ లవణాలు ఉండాలి.. దానిని ఎలా గుర్తించాలో ఓ సారి తెలుసుకుందామా మరి.
నీటి నాణ్యతను TDS (Total Dissolved Solids) ద్వారా గుర్తించవచ్చు. అందులోని ఖనిజాలు, లవణాల స్థాయిని TDS మీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంటుంది. ధర సుమారు రూ.200 నుంచి రూ.300 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
- తాగే నీటిలో TDS స్థాయిలు..
0 -50 mg/L : మినరల్స్ అత్యల్పం, తాగేందుకు అంత అనుకూలం కాదు
50 -150 mg/L : అత్యుత్తమ నాణ్యత గల నీరు
150 – 300 mg/L : మంచి నీరు
300 – 600 mg/L : లవణాలు ఎక్కువ, అంత అనుకూలం కాదు
600 – 900 mg/L : తక్కువ నాణ్యత
900+ mg/L: తాగడానికి యోగ్యం కాదు (కఠినమైన నీరు)
- WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ప్రకారం 50 – 300 mg/L వరకు ఉన్న నీరు శ్రేయస్కరమని సూచిస్తుంది.
- కొందరికి ఆర్వో, మినరల్ వాటర్‌తో జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. అలాంటి వారు మున్సిపల్ వాటర్‌ను ఇలా తాగవచ్చని వైద్య నిపుణలు పేర్కొంటున్నారు. సాధారణంగా మున్సిపల్ వాటర్ లో TDS స్థాయి 50 – 300 mg/L వరకు ఉంటుంది. ఈ నీటిని వేడిచేసి చల్లార్చిన తర్వాత రాగి బిందెలో లేదా మట్టి కుండలో నిల్వ చేసుకుని తాగితే మంచిదని సూచిస్తున్నారు.
- ప్రతి రోజు ఆరోగ్యకర జీవనానికి 2-3 లీటర్లు సరిపోతాయి. శరీర బరువు కేజీకి 30మి.లీ నుంచి 35 మి.లీ చొప్పున అవసరం. ఈలెక్కన 70 కిలోల బరువు ఉంటే 2.1 నుంచి 2.5 లీటర్ల వరకు తాగవచ్చు. అతిగా తాగితే ‘హైపోనాట్రేమియా’ (శరీరంలో సోడియం తగ్గడం) కు దారితీస్తుంది.
- భోజనానికి, నీరు తాగడానికి మధ్య కనీసం 30-45 నిమిషాల గ్యాప్ ఉండాలి.
- రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీరు తాగడం గుండె ఆరోగ్యానికి మంచిది.
నోట్ : మీకు కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే, వైద్యుల సలహా మేరకు మాత్రమే నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.
ఇది కూడా చదవండి ..తల్లులూ.. మీ పిల్లలు జాగ్రత్త..! ఈ ఫుడ్ కు కాస్త దూరంగా ఉంచండి




