Friday, April 3, 2026
spot_img

AAP is angry with Raghava |రాఘవపై ఆప్ గుర్రు.. ఆయ‌న‌కు మైక్ ఇవ్వొద్దంటూ ‘రాజ్య‌స‌భ’ కు అధిష్టానం లేఖ‌!

రాజ్య‌స‌భలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఎలుగెత్తి సామాన్యుని గొంతుక‌గా నిలిచిన ఆప్‌ ఎంపీ రాఘ‌వ చ‌డ్డా ఇటీవ‌ల వార్త‌ల్లోకెక్కి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆయ‌న‌పై సొంత పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ లైన్ కాకుండా సొంత ఇమేజ్ కోసం వ్య‌వ‌హరిస్తున్న‌ట్లుగా భావించిన అధిష్టానం అత‌డిపై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ ప‌ద‌విని తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాదు అత‌డికి స‌భ‌లో పార్టీ త‌ర‌ఫున మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని చైర్మ‌న్‌కు పంపిన లేఖ‌లో పేర్కొంది. ఆ స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిఠ‌ల్‌ను నియ‌మించాల‌ని కోరింది.
అస‌లేమైంది..
ఆప్ ప్రారంభం నుంచి కేజ్రీవాల్ వెంట న‌డిచారు రాహుల్‌. 2012 నుంచి క్రీయాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఢిల్లీ ఎమ్మెల్యేగానూ ప‌నిచేశారు. తాజాగా పంజాబ్ రాష్ట్ర కో ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూనే అక్క‌డి నుంచి రాజ్య‌స‌భ ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తు న్నారు. అయితే కేజ్రీవాల్ అరెస్టు, జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత రాహుల్ పార్టీ కార్య‌కలాపాల్లో అంటీముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం కొంత ఆస‌క్తిక‌రంగా మారింది. పార్టీ లైన్ కాకుండా సొంతంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స‌భ‌లో ప్ర‌స్తావించ‌డం వంటి అంశాల‌ను అధిష్టానం సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌నపై వేటుకు రంగం సిద్ధం చేసిన‌ట్లుగా సమాచారం. ఇందులో భాగంగా తొలుత ఫ్లోర్ లీడ‌ర్‌గా తొల‌గింపు అంశం తెర‌పైకి తెచ్చిన‌ట్లు తెలుస్తోంది.
వేటు ప‌డితే రాహుల్ అడుగులు ఎటువైపు
ఒక‌వేళ పార్టీ అత‌డిపై వేటు వేస్తే అత‌డి అడుగులు ఎటువైపు ఉంటాయ‌నేది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది. కొత్త పార్టీ పెడ‌తారా.. లేదా జాతీయ పార్టీల వైపు వెళ‌త‌రా అనేది ప్ర‌స్త‌తం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది.
ఓడిపోలేదు..: రాహుల్ చ‌డ్డా
పార్టీ త‌న‌పై తీసుకున్న చ‌ర్య‌ల నేప‌థ్యంలో రాహుల్ చ‌డ్డా తాజాగా స్పందించారు. తాను ప్ర‌జ‌ల మ‌నిషిని.. వారి స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌డం త‌ప్పేంట‌ని.. త‌న గొంతు ఎందుకు నొక్క‌తున్నార‌ని పార్టీ అధిష్టానాన్ని ఆయ‌న మెసేజ్ ద్వారా ప్ర‌శ్నించారు. తన మౌనం ఓట‌మి కాదంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తాను ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడుతూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి : పార్లమెంటులో ‘సామాన్య’ గొంతుక.. రాఘవ

spot_imgspot_img

Hot Topics

Related Articles