Thursday, April 2, 2026
spot_img

oracle dangerbells| డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఒరాకిల్ ! టేకిల్లో గుబులు రేపుతున్న మెయిల్స్

oracle dangerbells| నిన్నటిదాకా సాఫ్ట్వేర్ కొలువంటే ఓ క్రేజ్. ఆరంకెల ప్యాకేజీలు అందరినీ ఆలోచింపజేసేవి. ప్రస్తుతం సీన్ రివర్స్ అవుతుంది. ఇప్పటికే ఒరాకిల్ లే-ఆఫ్ ప్రకటించి 30 వేల ఉద్యోగులను ఇంటి బాట పట్టించింది. త్వరలో మరికొందరు కూడా ఉంటారని డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఇది ఒక్కటే కాదు.. మరిన్ని కంపెనీలు ఇదే బాట పడుతున్నట్లుగా తెలుస్తుంది.
టేకిల్లో గుబులు
ఇంజినీరింగ్ పూర్తి కాగానే క్యాంపస్ కొలువులు కొట్టిన యువత మంచి ప్యాకేజీలతో భవితకు బంగారు బాటలు వేసుకున్నారు. పెళ్లిళ్లు కాగానే సిటీలో సొంతిల్లు..కారు.. వంటివి కామన్ గా మారాయి. వేతనానికి తగ్గట్లు ఈఎంఐల ఖాతాలో చేరారు. పిల్లలకు మంచి విద్య అందిస్తున్నారు. సీన్ కట్ చేస్తే.. ఏఐ రాకతో పలు కంపెనీలు లే ఆఫ్ బాట పట్టాయి. ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టాయి. ప్రస్తుతం ఒరాకిల్ 30 వేల మందిని తొలగించింది. ఇందులో భారతీయులు 12వేల మంది వరకు ఉన్నారు.త్వరలో మరికొందరికి కూడా ఉధ్వంసం ఉంటుందని మెయిల్స్ ద్వారా హెచ్చరికలు పంపుతుంది. ఉన్నఫలంగా కొలువులు పోవడంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తం అవుతుండగా.. ఉన్నవారిలోనూ ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వెంటాడుతుంది. మిగతా కంపెనీల పరిస్థితి కూడా ఇలాగే ఉండడంతో ప్రత్యామ్నాయం పై దృష్టి సారిస్తున్నారు.
ఐటీ రంగం బెంబేలు
దాదాపు 15 ఏళ్ల సీనియర్లను సైతం ప్యాకేజీలు ఇచ్చి వదులుకుంటుండడంతో ఉద్యోగుల్లో ఒక్కసారిగా ఆందోళన కనిపిస్తుంది. ఓరాకిల్ తో మొదలైన ఈ ముప్పు ఎక్కడికి దారితీస్తుందో అనే చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న 60 లక్షల ఉద్యోగుల్లో వాట్ నెక్స్ట్ అనే ఆలోచన వినిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎన్ని పొట్టలు కొడుతుందో వేచి చూడాల్సిందే మరి.

ఇది కూడా చ‌ద‌వండి : పని లేకుంటే జీతం తీసుకోలేను.. రాజీనామా ఆమోదించండి.. రాష్ట్రపతికి ఓ ఐఏఎస్ నివేదన!

spot_imgspot_img

Hot Topics

Related Articles