పశ్చిమాసియా..21 రోజులుగా యుద్ధంతో కంపిస్తుంది. క్షణక్షణం బాంబుల మోతతో మారుమోగుతోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. లక్షలాది మంది గాయాల పాలయ్యారు.. కోలుకోలేకుండా ఆస్తి నష్టమూ వాటిల్లింది. అయినా ఎవరూ వెనక్కి తగ్గట్లేదు. ట్రంప్ సహకారంతో దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయిల్ ను ఇరాన్ అంతే దీటుగా ఎదుర్కొంటుంది. అమెరికాకు మద్దతుగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేస్తూ సత్తా చాటుతోంది. అంతర్జాతీయ జల రవాణాలో కీలకమైన హోర్ముజ్ జల సంధిని మూసివేసి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది.
- ఫిబ్రవరి 28 నుంచి..
2026 ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తో పాటు మరికొందరు కీలక అధికారులు మరణించారు. ఒకసారిగా రగిలిపోయిన ఇరాన్ అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు ప్రారంభించింది. - ఇప్పటివరకు 2500 మందికి పైగా మృతి..
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2500 మంది మరణించినట్లుగా అధికారికంగా లెక్కలు చెబుతున్నా అనధికారికంగా ఈ మొత్తం దాదాపు 20 రెట్ల వరకు అధికంగా ఉండవచ్చని అంచనా. మృతులు ఎక్కువగా ఇరాన్, లేబనాన్ లలో ఉండడం గమనార్హం. మరోవైపు 13 మంది అమెరికన్ సైనికులు కూడా మరణించారని ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. ఇందులో భారతీయులు కూడా ఐదుగురు ఉన్నట్లుగా తెలిసింది - ప్రపంచంపై ప్రభావం..
యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం, సరఫరా గొలుసులో ఆటంకాలు ఏర్పడటం వంటి ఆర్థిక సంక్షోభాలు మొదలయ్యాయి. భారత్ పై కూడా ఈ ప్రభావం చూపుతోంది. - ట్రంప్ కు షాక్ లు..
* ఇరాన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ చీఫ్ జోసెఫ్ కెంట్ తన పదవికి తాజాగా రాజీనామా చేశారు.
* స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ (straight of Hormuz)వద్ద అమెరికా యుద్ధనౌకలకు మద్దతుగా నిలవాలని ట్రంప్ చేసిన పిలుపును కెనడా, ఆస్ట్రేలియా వంటి సుమారు ఏడు మిత్రదేశాలు తిరస్కరించాయి.
* యుద్ధం విషయంలో నాటో దేశాలు తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశాయి.
* యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం ట్రంప్ ప్రభుత్వానికి ఆర్థికంగా సవాలుగా మారింది.
* ఇరాన్‌తో నెలకొన్న ప్రస్తుత పరిస్థితికి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే కారణమని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతుండడం గమనార్హం
* యుద్ధం కారణంగా ఈ నెలాఖరులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరగాల్సిన సమావేశాన్ని ట్రంప్ వాయిదా వేశారు.



