Wednesday, April 15, 2026
spot_img

paadayatra | తెలంగాణలో పాదయాత్రలకు వేళాయే

paadayatra |  తెలంగాణలో ఎన్నికలకు రాజకీయ పార్టీల సిద్ధమవుతున్నాయా.. అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2027లో తన పాదయాత్ర ఉంటుందని పేర్కొనగా.. తాజాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఈ ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పాదయాత్ర ప్రారంభించనున్నట్లు పేర్కొనడం గమనార్హం.
కేటీఆర్ పాదయాత్ర ఎప్పుడంటే
* ఇటీవల మంచిర్యాల జిల్లాలో పర్యటించిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ వర్గాలకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో పాదయాత్ర రూపంలో  ప్రజల వద్దకు వెళ్లాలని భావిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
జూన్ 2 నుంచి తీన్మార్ మల్లన్న
బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించాయి. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైందని త్వరలోనే అన్ని వివరాలు ప్రకటిస్తామని స్పష్టం చేశాయి.

ఇది కూడా చదవండి :  టెట్ సరే.. డీఎస్సీ ఎప్పుడు?

spot_img

Hot Topics

Related Articles