Wednesday, May 13, 2026
spot_img

PK Politics | ఆ ‘విజయం’ రాజకీయ పాఠం.. తెలంగాణ‌లో ఆస‌క్తిక‌రం

PK Politics | తమిళనాట పార్టీ పెట్టి కేవలం రెండున్న‌రేళ్లకే ప్రభంజనం సృష్టించిన ఆ ‘విజయ’మ్ ఎందరికో పాఠంగా మారింది. రాజకీయాల్లో ఆ విజిల్ ఒక్కసారిగా ప్రతి ధ్వనించింది. ఎన్టీఆర్.. ఎంజీఆర్ సరసన చేర్చిన ఆ గెలుపు ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.  చాలా మందిని ఆలోచింప‌జేస్తుంది. తెలంగాణలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
తెర వెనక పీకే మంత్రాంగం
టీవీకే విజయం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashnth kishore) స్ట్రాటజీ కీలకంగా పని చేసిందని తెలుస్తుంది. ఏడాది క్రితం స్వయంగా పార్టీ సభలో పీకే చేసిన కామెంట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 2026 ఫలితాల తర్వాత తమిళనాడులో ఈ బిహారి తప్పకుండా పాపులర్ అవుతాడంటూ.. పార్టీ విజయంపై ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయ‌న‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కేవ‌లం 12 మంది మినహా మిగ‌తా అంతా కొత్త వారితోనే ఎన్నికల బరిలో దిగిన విజిల్ పార్టీకి ఆయన తెర వెనుక దిక్సూచిగా నిలిచారు. దశాబ్దాల చరిత్ర కల త‌మిళ పార్టీల బలాబలాలను అంచనా వేయ‌డంతో పాటు విజయ్ కి ప్రత్యర్ధులు అడుగడుగునా సృష్టించిన అడ్డంకులనూ సైతం తొలగిస్తూ తనదైన శైలిలో మంత్రాంగం నడిపారు ఈ స్ట్రాట‌జిస్టు. ఎట్టకేలకు తన టాస్కును సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడు. తాజాగా ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మ్యాజిక్ ఫిగ‌ర్‌కు చేరువ‌య్యేలా త‌న వంతు పాత్ర పోషిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కు సైతం అందని ప్ర‌శాంత‌మైన వ్యూహాలు అద్భుతమని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తుడంగా.. తాజాగా మరో టాస్క్‌పై దృష్టి సారిస్తున్నారు పీకే. తెలంగాణలో కొత్తగా రూపుదిద్దుకున్న పార్టీకి ఈయ‌న ఇప్ప‌టికే సలహాదారుడిగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కవిత పార్టీతో సంప్రదింపులు..?
ఇటీవల తెలంగాణలో కల్వకుంట్ల కవిత సారధ్యంలో కొత్త పార్టీగా రూపుదిద్దుకున్నటీఆర్ఎస్‌(Trs)కు ఆయన ఇప్పటికే సలహాదారుడిగా నియామకమైనట్లుగా తెలుస్తుంది. పలుమార్లు ఆయన కవితతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు మరో రెండున్నర సంవత్సరాలు ఉండడం.. తెలంగాణ ర‌క్ష‌ణ సేన కొత్త పార్టీ కావడం.. పేరున్న లీడర్లు ఇప్పటివరకు లేకపోవడం.. అంతా టీవీకే పార్టీని పోలి ఉండడం సారుప్య ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. 2028 ఫ‌లితం కూడా అలాగే ఉంటుంద‌ని టీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్య‌క్తం చేస్తుండం ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారిది.

ఇది కూడా చ‌ద‌వండి ..  బెంగాల్‌లో విక‌సించిన క‌మ‌లం.. త‌మ‌ళ‌నాట ఫ‌లించిన పీకే వ్యూహాం.. కేర‌ళంలో హ‌స్తం హ‌వా.. పుదుచ్చేరి, అస్సాంను కాపాడుకున్న‌ బీజేపీ..

spot_img

Hot Topics

Related Articles