Friday, May 1, 2026
spot_img

Gas price hike | వినియోగ‌దారుల‌కు షాక్‌ .. గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పెరిగిందండోయ్

Gas price hike | అవును మీరు వింటున్న‌ది నిజ‌మే. అనుకున్న‌ట్లుగానే గ్యాస్ ధ‌ర పెరిగింది. క‌మ‌ర్షియ‌ల్(commercial) సిలిండ‌ర్‌పై ఏకంగా రూ.993ల‌కు పెంచుతూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. గృహ అవ‌స‌రాల‌కు వినియోగించే సిలిండ‌ర్‌కు మాత్రం ప్ర‌స్తుతానికి మిన‌హాయింపు ఇచ్చింది.
క‌మ‌ర్షియ‌ల్‌పై రూ.వెయ్యి బాదుడు
ప‌శ్చిమాసియాలో యుద్ధ ప్ర‌భావం అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ స‌ర‌ఫ‌రాపై ప‌డింది. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇంధ‌న ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి. తాజాగా భార‌త్‌లోనూ ఆ ప్ర‌భావం ప‌డింది. ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన గ్యాస్ ధ‌ర‌ల‌ను కేంద్రం స‌మీక్షిస్తోంది. ఇందులో భాగంగా శుక్ర‌వారం క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్‌పై పెంపు నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 19 కిలోల వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర‌ రూ.2,076 (హైద‌రాబాద్‌లో) ఉండ‌గా ప్ర‌స్తుతం రూ.993 పెంచడంతో రూ.3,069కు చేరింది. దేశంలోని ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే ఇలా ఉన్నాయి. ఢిల్లీలో రూ.3,071 కాగా.. మంబాయిలో రూ. 3,024, బెంగ‌ళూర్‌లో రూ. 3152, అహ్మ‌దాబాద్‌లో రూ.3,091, కోల్‌క‌తాలో రూ.3,202, చెన్న‌య్‌లో రూ.3,237ల‌కు చేరాయి. ఇక 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండ‌ర్ ధ‌ర‌లో మాత్రం మార్పు లేద‌ని ప్ర‌క‌టించింది.
ప్ర‌భావం ఇలా..
గ్యాస్ ధ‌ర పెంపుతో ఇక హోటళ్లు, టిఫిన్ సెంట‌ర్ల నిర్వాహ‌కులు ఇక తినుబండారాల ధ‌ర‌లు పెంచ‌నున్నారు. ఈ మేర‌కు సామాన్యుల జేబుకు చిల్లు ప‌డ‌నుంది.

ఇది కూడా చ‌ద‌వండి.. చిల్‌ న్యూన్ మామ‌.. ఫ్లిప్‌కార్ట్‌లో స‌మ్మ‌ర్ సేల్‌ వ‌చ్చేసింది

spot_img

Hot Topics

Related Articles