Special Offer | మండే వేసవిలో షాపింగ్ చేయాలనుకుంటున్నారా.. అయితే మిమ్మల్ని కూల్‌గా మార్చే ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ముందుకు వస్తుంది. సాసా లేలే సేల్(SASA LELE SALE) పేరిట ఈనెల 9 నుంచి స్పెషల్ డిస్కౌంట్లతో అందుబాటులోకి రానుంది. ప్లస్/బ్లాక్ మెంబర్స్ కు 24 గంటల ముందగానే యాక్సిస్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే తన ప్లాట్‌ఫాంపై ప్రకటించింది. డబుల్ డిస్కౌంట్, ఎక్చ్సేంజ్ బోనస్ వంటి వాటితో పాటు బ్యాంకు ఆఫర్లతో ఆకట్టుకుంటుంది. అయితే ఎంతకాలం వరకు ఉంటుందనేది ఇంకా స్పష్టం చేయలేదు.
ఆఫర్లలో కొన్ని ఇలా..
- మొబైల్, టీవీ అప్‌గ్రేడ్ కావాలనుకునే వారికి డబుల్ సేల్ పేరిట తీపి కబురు అందించింది. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25, ఇతర ఫ్లాగ్‌షిప్ మోడళ్లపై భారీ తగ్గింపులు అందించనున్నట్లగా వెల్లడించింది.
- ఇక 55 ఇంచెస్ 4కే టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఏసీలపై కూడా కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది.
- వీటితో పాటు సమ్మర్ స్పెషల్ ఐటమ్స్ పై 85శాతం వరకు, వంటసామగ్రిపై 70శాతం వరకు, పూమా, అడిడాస్ వంటి టాప్‌లెవల్ ఫ్యాషన్ బ్రాండ్‌లపై 65శాతం వరకు తగ్గింపులు ఉంటాయని పేర్కొంది.
- అదనంగా SBI క్రెడిట్ కార్డ్‌పై 10శాతం స్పెషల్ డిస్కౌంట్ ను ప్రకటించింది.
- “డబుల్ సేల్స్ ” పేరిట మరింత ఎక్కువ తగ్గింపులుంటాయని వెల్లడించింది. ప్రతీ గంటకు ట్రెండీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. మరిన్ని ఆఫర్ల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో సందర్శించవచ్చు.
ఇది కూడా చదవండి.. తల్లులూ.. మీ పిల్లలు జాగ్రత్త..! ఈ ఫుడ్ కు కాస్త దూరంగా ఉంచండి




