War breake | డెడ్‌లైన్ ముగిసింది.. ఇక యుద్ధం తప్పదనే సమయంలో ఎంట్రీ ఇచ్చింది పాకిస్తాన్. మధ్యవర్తిత్వం జరిపి సీజ్ ఫైర్(కాల్పుల విరమణ)కు కారణమైంది. ఇరాన్, యూఎస్ మధ్య రెండు వారాల చర్చలకు అవకాశం కల్పించింది. హోర్మజ్ జలసంధి విషయంలో అంగీకరించిన ఇరాన్ తాను పెట్టిన షరతులు.. ట్రంప్(trump) ఇచ్చిన హామీలపై త్వరలోనే ఇరుదేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.
చివరి నిమిషంలో..
ఫిబ్రవరి 28న యుద్దం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇజ్రాయిల్ అగ్రరాజ్యం సహకారంతో ఇరాన్‌పై దాడులకు పాల్పడుతుండగా అంతే ధీటుగా ఇరాన్ కూడా స్పందిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటున్న క్రమంలో ట్రంప్ ఓ గడువు విధించారు. అప్పటి వరకు హోర్మజ్ జలసంధి ఓపెన్ చేయాల్సిందే అని ఇరాన్‌కు అల్టీమెటం జారీ చేశారు. లేకుంటే నరకం చూపిస్తామని.. నాగరికతను అంతం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటల వరకు ఆ గడువు ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చి రెండు వారాల కాల్పుల విరమణ పాటించాలని అమెరికాకు, జలసంధి తెరవాలని ఇరాన్‌కు ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. అయితే తాము పెట్టిన పది షరతులకు అంగీకరిస్తేనే ఓకే అంటూ ఇరాన్ ప్రకటించగా.. ట్రంప్ సుముఖత వ్యక్తం చేస్తూ కాల్పుల విరమణకు సానుకూలమని చెప్పారు.
సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత పరిణామాలు..
- పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ నెల 10 నుంచి ఇరు దేశాలతో పాకిస్తాన్ వేదికగా ప్రత్యక్ష చర్చలు ఉంటాయని ప్రకటించారు.
- ఇజ్రాయిల్ ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లుగా ప్రకటించినా లెబనాన్‌పై తమ దాడులు కొనసాగుతాయని పేర్కొనడం గమనార్హం.
- ఇరాన్ సుప్రిం నేత మొజ్తాబా ఖమేని ప్రకటనలో స్పందిస్తూ.. కాల్పుల విరమణ మాత్రమే అని.. యుద్ధం విరమించలేదని పేర్కొన్నారు. అలాగే 14 రోజుల పాటు హోర్మజ్ జలసంధి వద్ద భద్రత దళాలు పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు.
- ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు 50శాతం సుంకాలు విదిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
- ఇరాన్‌తో యుద్దంలో తాము విజయం సాధించామని, తమ ఆపరేషన్ సక్సెస్ అయినట్లుగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. ఇరాన్ ప్రాధేయపడడంతో ట్రంప్ దయచూపినట్లుగా పేర్కొన్నారు.
- ఇది కూడా చదవండి : హోర్ముజ్.. ‘సంధి’ చిన్నది.. రవాణా పెద్దది




