US-Iran war | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగు తూనే ఉన్నాయి. ఇజ్రాయిల్ సహ అమెరికా దాడులకు భయపడని ఇరాన్ గట్టిగానే స్పందిస్తోంది. తాజాగా బుషేహర్‌లోని న్యూక్లియర్ US-పవర్ ప్లాంట్ లక్ష్యంగా అగ్రరాజ్యం క్షిపణి దాడులకు పాల్పడగా.. యూఎస్ కు చెందిన కీలక యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేస్తూ ధీటుగా బదిలిస్తుంది.హోర్మజ్ జలసంధి విషయంలో ‘మరో 48 గంటల సమయమే ఉందని.. స్పందించకుంటే ప్రళయం తప్పదు’ అంటూ తాజాగా ట్రంప్ చేసిన హెచ్చరికలను సైతం డోంట్ కేర్ అంటుంది ఇరాన్. ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన వంతెనను టార్గెట్ చేయడాన్ని ఇరాన్ సీరియస్ గా తీసుకుంది. తమ సత్తా కూడా చూపిస్తామని ప్రకటించింది. గల్ఫ్ దేశాల లక్ష్యంగా దాడులు ఉంటాయని వెల్లడించింది.
టేక్ కంపెనీలపై దృష్టి..
ప్రపంచ దేశాలకు తమ సత్తా చూపాలని భావించిన ఇరాన్ ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఇప్పటికే హార్మోజ్ జలసంధి పై పూర్తి ఆధిపత్యం సాధించి.. అగ్ర రాజ్యానికి ముచ్చెమటలు పట్టించింది. తాజాగా ఇజ్రాయిల్, అమెరికా లోని ప్రముఖ టెక్ కంపెనీలపై దాడులకు సిద్ధమైంది. 18 సంస్థలను లక్ష్యంగా చేసుకుంది. అంతేకాకుండా యూఎస్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని భావిస్తూ ఆ దేశానికి చెందిన కొన్ని బ్యాంకులను కూడా ఇందులో చేర్చింది.
యుద్ధం తీవ్రమైతే
యుద్ధం విషయంలో అమెరికాలో ఓవైపు నిరసనలు వెలువెత్తుతున్నా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు వార్ కు ముందు ఆ దేశంలో కొంత వ్యతిరేకత ఉన్నా అగ్రరాజ్యం దాడుల నేపథ్యంలో ఇరానీయులు ప్రస్తుతం ఒక్కటిగా గళమెత్తుతున్నారు. తమను తక్కువ అంచనా వేసిన యుఎస్ కు సత్తా చూపిస్తామని.. ప్రతి దాడులతో ఆ దేశం డ్రోన్లతో విరుచుకుపడుతుంది ఈ క్రమంలో అంతర్జాతీయ క్రూడాయిల్ వర్తకానికి కీలక రవాణా మార్గమైన హార్మోజ్ ను వజ్రాయుధంగా వాడుకుంటోంది. ఈ ప్రభావం గల్ఫ్ తో పాటు మిగతా దేశాలపై తీవ్రంగా చూపుతుంది. ఇప్పటికే పలు దేశాల్లో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల పైనా ఎఫెక్ట్ చూపుతుండడంతో మునుముందు ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి : యుద్ధం..ఇంకెంతకాలం.. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ మధ్యలో ట్రంప్..




