Tuesday, March 31, 2026
spot_img

surya vamshi | రికార్డులతో మెరుస్తున్న సూర్యవంశి

ఖుల్లంఖుల్లా: surya vamshi | వైభవ్ సూర్యవంశి.. ప్రస్తుతం క్రికెట్లో మారుమోగుతున్న పేరిది. ఐపీఎల్ సీజన్ ప్రారంభంలోనే తన సత్తా చేటాడు ఈ బుగ్గ చెంపల బుడ్డోడు. మొన్ననే 15 ఏట అడుగుపెట్టిన ఈ యువబాల క్రికెటర్ పై ఓ లుక్కేద్దామా మరి.
surya vamshi | కుటుంబ నేపథ్యం..
సూర్యవంశి 2011 మార్చి 27న బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లా తాజ్పూర్ లో జన్మించాడు. తండ్రి సంజీవ్, తల్లి ఆర్తి. తాను కాకపోయినా తన కుమారుడిని ఎలాగైనా క్రికెటర్ చేయాలన్నది ఆ తండ్రి ఆకాంక్ష. ఈ క్రమంలో నాలుగేళ్ల వయసులోనే సూర్యవంశికి క్రికెట్ ఓనమాలు నేర్పించాడు. తొమ్మిదవ ఏట అకాడమీలో జాయిన్ చేశాడు. ఇందుకోసం తన భూమిని సైతం అమ్మాడు. నాన్న ఆశయానికి అనుగుణంగా 12 ఏళ్ల వయసులోనే బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగు పెట్టాడు సూర్య వంశీ.
surya vamshi | ఐపీఎల్ అరంగేట్రం..

  • సూర్య వంశీ ఎడమచేతి బ్యాటర్. బంతి ఎలా వచ్చినా బౌండరీ దాటించడమే తన లక్ష్యం. కళ్ళు చెదిరే సిక్సర్లతో విరుచుక పడడం తన నైజం.14 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ లోకి అడుగు పెట్టాడు ఈ చిన్నోడు. అతి చిన్న వయస్కుడిగా(14 ఏళ్ల 23 రోజుల) రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లో శతకం (సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ) సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం విధితమే. 2025 సీజన్ లో మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 252( 24 సిక్సులు, 18 ఫోర్లు) పరుగులు సాధించాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ(century), ఒక సెంచరీ ఉన్నాయి. మొత్తం 36 సగటుతో 206.56 స్ట్రైక్ రేట్ ఉండడం గమనార్హం.
  • ప్రస్తుత ఐపీఎల్ (ipl)సీజన్లో చెన్నై తో జరిగిన తొలి మ్యాచ్లోనే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి తన విధ్వంసకర బ్యాటింగ్ తీరును మరోసారి చాటాడు. మునుమందు మరిన్ని రికార్డులు సొంతం చేసుకునేందుకు ఉవ్విల్లూరుతున్నాడు. మనం కూడా ఆల్ ద బెస్ట్ చెబుదామా మరి.
spot_imgspot_img

Hot Topics

Related Articles