ట్రింగ్ ట్రింగ్.. హలో అమ్మ. ఏం చేస్తన్నవే.. అన్నం తిన్నవా.. బాపేంజేస్తండు.. తమ్ముడు షాప్‌కు పోయిండా.. అని అపర్ణ అనంగనే అంత మంచే బిడ్డా.. మీరెట్లున్నరు.. పిల్లలు స్కూ్ల్‌కు పోయిన్రా.. అంటూ బిడ్డను కుషల సమాచారం అడిగింది తల్లి సావిత్రి. అమ్మా మొన్న పండక్కి వచ్చినప్పుడు బంగారం కొందమని అంటివి కదే.. ఏమైంది తీసుకున్నవా.. యే.. ఏం కొనేటట్టు ఉంది బిడ్డా.. తులం రెండు లక్షలంటున్నరు.. మొన్నటి దాకా లక్ష కూడా లేకుండే.. మూడు, నాలుగు నెలల్నే డబుల్ అయిందట.. తగ్గుతదంటండ్రు.. అందుకే ఆగినం. బిడ్డా నీ పెండ్లప్పుడైతే పది వేలకు తులముండే. లక్షకు పది తులాలు తీసుకున్నమ్. అదే ఇప్పుడు తులం కూడా రావట్లేదు. అవునమ్మా.. అందరూ గోల్డ్‌పైనే పెట్టుబడి పెడుతున్రట. అందుకే ఇట్లా పెరుగుతున్నయటున్రు. మొన్న బడ్జెట్ కానుంచి కొంచెం దిగచ్చినయ్.. లక్షన్నర దాకా వచ్చింది. రెండు, మూడు రోజుల నుంచి మళ్లా పెరుగుతంది. ఈ ముచ్చట చెప్పుదామనే ఫోన్ చేసిన. ముందు పెండ్లిళ్ల సీజన్.. బాగా పెరుగుతదంటుడ్రు. బాపు కూడా మొన్న బ్యాంకుల పైసలు ఉన్నయ్ అనే కదా.. తక్కువున్నప్పుడు ఓ మూడు తులాలు తీసుకోపోయిన్రే అని బిడ్డ అనుడితోనే గా పైసలా బిడ్డా.. మొన్న బయట ఉంటే ఖర్చయితనయ్ అని ఫిక్స్ చేసిండు బాపు. అవునా బ్యాంకుల మిత్తి తక్కువ కదే.. అదే బంగారం చూడు ఏడాది తిరగకుండా డబుల్ అయే. మీ అల్లుడు మొన్న చిట్టి పైసలు వస్తే తులం తీసుకున్నడు.. వారం రోజులకే పదిహేను వేలు పెరిగింది. తమ్ముని పెండ్లి వరకు మళ్లా రెండు లక్షలు దాటేటట్టు ఉంది. పిరమైనంక కొనబుద్ధి కాదు. అప్పుడే కొంటే మంచిగుండు అనిపిస్తది. ఇప్పుడు మూడు తులాలు వచ్చేది అప్పుడు రెండు కూడా రాదు. లేట్ చేయకుండా కొంటెనే బెటరనిపిస్తంది నాకు. సాయంత్రం బాపుకు చెప్పుతా ఆగు అని బై అంటూ ఫోన్ కట్ చేసింది అపర్ణ. బిడ్డ చెప్పింది నిజమే అనిపిస్తుంది అంటూ ఆలోచనలో పడింది సావిత్రి.
==================
పాతికేళ్లలో బంగారం ధరలు
సంవత్సరం ధర (10 గ్రాములు)
2000 రూ.4,400
2005 రూ.7,000
2010 రూ.18,000
2015 రూ.26,000
2020 రూ.48,000
2024 రూ.75,000
2025 రూ.1,02,000
2026(జనవరి29) రూ.1,83,000
ఫిబ్రవరి 10 రూ.1,57,000
================
అమ్మా.. బంగారం ధర మళ్లా పెరుగుతందట.. తీసుకోపొయిన్రే!
RELATED ARTICLES
Recent Comments
on Hello world!




