Tuesday, March 24, 2026
spot_img

పార్లమెంటులో ‘సామాన్య’ గొంతుక.. రాఘవ

రాఘవ చడ్డా.. ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతుంది. పార్లమెంటులో సామాన్య గొంతుకగా ప్రతిధ్వనిస్తోంది. చిన్న వయసులోనే రాజకీయ అరంగేట్రం చేసి అందరి మన్ననలు అందుకుంటున్న ఆప్ ఎంపీపై లుక్కేద్దామా మరి. 

విద్య..రాజకీయ అరంగేట్రం

  • ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందిన ఈయన వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ (CA).
  • ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.
  •  2015లో పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితుడయ్యారు.
  • 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
  • 2020లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో రాజిందర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
  • 2020 మార్చి 2న ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యారు.
  • 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల ఇన్చార్జిగా పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో పార్టీ ఈయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. 2022 మార్చి 21నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.
  • అత్యంత పిన్న వయస్కుడైన పార్లమెంటేరియన్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.

సామాన్యుని గొంతుకగా ప్రశ్నలు సంధిస్తూ..

  • పార్లమెంటులో సామాన్యుడు గొంతుకగా పన్ను మినహాయింపులు, టెలికాం డేటా క్యారీ-ఫార్వర్డ్ వంటి ప్రజా సమస్యలను లేవనెత్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. అందులో కొన్ని ప్రశ్నలు ..
  • 28 రోజుల వ్యాలిడిటీపై..: టెలికాం కంపెనీలు తమ ప్లాన్లను ‘మంత్లీ’ అని చెప్పి కేవలం 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఇస్తున్నాయి. దీంతో వినియోగదారులు సంవత్సరానికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇది సామాన్యులపై భారం కాదా అని ప్రశ్నించారు.
  • డేటా క్యారీ ఫార్వర్డ్: ఒక రోజులో వాడకుండా మిగిలిన డేటాను తర్వాత రోజుకు బదిలీ చేసే సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
  • ఇన్ కమింగ్ కాల్స్ కొనసాగింపుపై: రీఛార్జ్ గడువు ముగిసిన తర్వాత కూడా కనీసం ఏడాది పాటు ఇన్కమింగ్ కాల్స్ ఎస్ఎంఎస్ వంటి సదుపాయం ఉండాలని సూచించారు.
  • టోల్ టాక్స్ రద్దుపై: వాహనం కొనేటప్పుడే రోడ్ టాక్స్, ఇతర పన్నులు చెల్లిస్తున్న వాహనదారుల నుంచి మళ్లీ టోల్ టాక్స్ పేరిట వసూలు సరికాదన్నారు. ఈ విషయంలో మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
  • ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు ఉన్నప్పుడు, రాజకీయ నాయకులకు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించి చర్చకు తెర లేపారు.
  • ప్రజాప్రతినిధులు పనిచేయకుంటే పదవీకాలం ముగియకముందే తొలగించే హక్కు(right to recall) ఓటర్లకు ఉండాలని ప్రతిపాదించారు.

స్టాండింగ్ కమిటీ సభ్యడిగా..

రాజ్యసభలో ఆర్థిక శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

అవార్డులు..

  • ప్రపంచ ఆర్థిక వేదిక WEF నుంచి ‘యంగ్ గ్లోబల్ లీడర్’గా గుర్తింపు.
  • ఇండియా-UK అవుట్‌స్టాండింగ్ అచీవర్ అవార్డు.
spot_imgspot_img

Hot Topics

Related Articles