ఈ ఐపీఎల్ లో వీరు చాలా హాట్ గురూ..
ఐపీఎల్ వచ్చేసింది. మరో వారం రోజుల్లో కొత్త సీజన్ షురూ కాబోతుంది. ఇప్పటికే ఆయా జట్లు సిద్ధమవుతున్నాయి. ఆటగాళ్లను ఏటా యాజమాన్యాలు వేలం ద్వారా కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ సారి అత్యధిక రేటు పలికిన ఆటగాళ్లను ఓ సారి చూద్దామా మరి.
- రిషబ్ పంత్(LSG) : కీపర్ కం బ్యాటర్. రూ.27 కోట్లకు లక్నో జట్టు కొనుగోలు చేసింది.
- శ్రేయాస్ అయ్యర్(PBKS): ఆల్ రౌండర్. పంజాబ్ కింగ్స్ జట్టు రూ.26.75 కోట్లకు కైవసం చేసుకుంది.
- కామెరన్ గ్రీన్(KKR): ఆల్ రౌండర్ అయిన గ్రీన్ ను రూ.25.20 కోట్లకు కోల్ కతా జట్టు కొనుగోలు చేసింది.
- హెన్రిచ్ క్లాసిన్(SRH): బ్యాటర్, వికెట్ కీపర్. రూ.23కోట్లకు హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది.
- విరాట్ కోహ్లీ(RCB): కుడి చేతి బ్యాటర్. అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న క్రీడాకారుడు. బెంగళూరు జట్టు కింగ్ కోహ్లీని రూ.21కోట్లకు కొనుగోలు చేసింది.
- మతీశ పతి రాణా(KKR): ఫాస్ట్ బౌలర్. ఈయన ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది.
- రుతురాజ్ గైక్వాడ్ (CSK): రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఇతడిని రూ.18కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
- సంజు శాంసన్ (RR): కీపర్, టాప్ ఆర్డర్ బ్యాటర్. ఇతడిని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.18 కోట్లతో కొనుగోలు చేసింది.
- రషీద్ ఖాన్ (GT): స్పిన్ బౌలర్ . ఈయనను గుజరాత్ టైటన్స్ జట్టు రూ.18 కోట్లతో కైవసం చేసుకుంది.
- హార్దిక్ పాండ్యా (MI): ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన హార్దిక్ ను రూ.16.35 కోట్లతో ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది.