పశ్చిమాసియా యుద్ధ సెగలు భారత్ కు తాకుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధర మంట మొదలైంది. గృహావసర సిలిండర్ ధర పెరగగా.. కమర్షియల్ కు పూర్తిగా బ్రేక్ పడింది. సామాన్యులకు బుకింగ్ ఇక్కట్లు మొదలవగా వ్యాపార, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రీమియం పెట్రోల్ వంతయింది.
- లీటరుకు రూ.2.26 పెంపు
* ప్రీమియం పెట్రోల్ దిగుమతి సరిపడా లేక ఆయిల్ కంపెనీలు ధర పెంచాయి. లీటర్ కు రూ.2.26 పెంచడంతో రూ.115 కు చేరువైంది. త్వరలోనే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. - మూతపడుతున్న బంకులు
* రాష్ట్ర రాజధానితో పాటు పలు ప్రాంతాల్లో బంకుల్లో స్టాక్ కొరత కనిపిస్తుంది. హైదరాబాద్ శివారులో చాలా చోట్ల దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. అందుబాటులో ఉన్నచోట ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.



