హోర్ముజ్(straight of Hormuz ).. పశ్చిమాసియాలోని ఇరాన్ ఒమాన్ ల మధ్య ఉన్న ఇరుకైన జల సంధి. ఇప్పుడిది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దాదాపు నాలుగు వారాలుగా కొనసాగుతున్న యుద్ధానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. ఇజ్రాయిల్, అమెరికా దాడులను దీటుగా ఎదుర్కొంటున్న ఇరాన్ ఈ ప్రాంతాన్ని మాత్రం తనకు ఆయువు పట్టుగా మార్చుకుంది. క్రూడాయిల్ రవాణా వ్యవస్థను శాసిస్తుంది. యావత్ ప్రపంచాన్ని హెచ్చరిస్తుంది.
జలసంది విశేషాలివి..
- పర్షియన్ ఒమన్, గల్ఫ్ ఒమన్ ను కలుపుతూ హిందూ మహాసముద్రానికి అనుసంధానించే కీలక మార్గం.
- పొడవు సుమారు 167 కిలోమీటర్లు. అత్యంత ఇరుకైన వెడల్పు 33 కిలోమీటర్లు.
- ఈ మార్గం గుండా నిరంతరం వందలాది నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. లోనికి, బయటకు వెళ్లేందుకు రెండు ప్రత్యేక మార్గాలు ఉంటాయి. ప్రతీ రూట్ వెడల్పు దాదాపు రెండు నాటికల్ మైళ్ళు. వీటి మధ్య బఫర్ జోన్ మరో రెండు నాటికల్ మైళ్ళు ఇలా మొత్తంగా 10 కిలోమీటర్ల మేర మార్గం రూపొందించబడింది.
- ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇక్కడ టీఎస్ఎస్(ట్రాఫిక్ సపరేషన్ స్కీం)ను అమలు చేస్తారు.
- ఈ మార్గంలో ప్రతిరోజు సగటున 21 మిలియన్ బ్యారెల్స్ (అంటే సుమారు 334 కోట్ల లీటర్లు) క్రూడాయిల్ సరఫరా అవుతుంది.
- ప్రపంచ చమురు వినియోగంలో సుమారు 20శాతం ద్రవీకృత సహజ వాయువు (LNG)లో అధిక భాగం ఈ మార్గం గుండానే వెళుతుంది.
- 1980లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఈ జలసంధిపై దాడి జరిగింది. ఆ ఫలితంగా రవాణాను రక్షించడానికి భారీ నౌకాదళ కాన్వాయ్‌లు చేపట్టబడ్డాయి.
తాజా పరిస్థితి - అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేసింది. నౌకా రవాణాను పరిమితం చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో మార్గాన్ని పునరుద్ధరించాలని అంతర్జాతీయంగా పలు దేశాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి.
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపి తీవ్రమైన ద్రవ్యోల్బణం దిశగా సాగుతోంది.




