కవిత కొత్త పార్టీ ముహూర్తం ఈ నెల 25న ఖరారైన విషయం తెలిసిందే. ఈ మేరకు విధివిధానాల ఖరారుపై ఆమె పూర్తి దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మేధావులు, ఆయా రంగాల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించి అన్ని వర్గాలను కలుపుకొని పోయే దిశగా ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.
వరుస సమావేశాలు
గతంలో టిఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా కేసీఆర్ ఆయా రంగాల ప్రముఖులు, నిపుణులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్లుగానే జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా అలాగే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా పార్టీ విధి విధానాలు, చేరికలపై ఆమె ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా నెరవేరని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సమస్యలు, మెజారిటీ వర్గాల శ్రేయస్సు వంటి వాటిపై ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. విద్య, వైద్యం, నిరుద్యోగం, నీటి పారుదల వంటి కీలక అంశాలతో పాటు సబ్బండ వర్గాలకు మేలు జరిగే కార్యక్రమాల రూపకల్పనపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే చేరికల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రానున్న జీహెచ్ఎంసీ, పరిషత్ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పాటు తనకు పట్టున్న ఉత్తర తెలంగాణలో కీలక ప్రాంతాలపై గురి పెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది.
యువత, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ల పై ఫోకస్
యువతరం తో పాటు ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారులను పార్టీలో కి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మిగతా పార్టీల కంటే భిన్నంగా మహిళలకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తుంది
ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్
నవమి రోజున ప్రకటించిన విధంగా ప్రజల నుంచి కూడా కవిత ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. తన తండ్రి మాదిరిగా పార్టీ విషయంలో పూర్తిస్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.
ఇది కూడా చదవండి : తెలం’గానం’.. కలిసొచ్చేనా ‘జాగృతి’కి జనం హారతిచ్చేనా?




