Thirumala information | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం పూర్తిస్థాయిలో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. ఉదయం 8 తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు దాదాపు 24-30 గంటల సమయం పడుతుంది. ఇక రూ.300 ల శీఘ్రదర్శనంకు 3–5 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ భక్తులకు సుమారు 5 నుంచి 7 గంటల సమయం పడుతుంది.
గురువారం..
స్వామివారిని 63,556 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 35,900 మంది. హుండీ ద్వారా సమకూరిన ఆదాయం రూ.5.31 కోట్లు. మొత్తం లడ్డూల విక్రయాలు 4.12 లక్షలు.
17 నుంచి సాక్షాత్కార వైభవోత్సవాలు..
ఈనెల17 నుంచి 19వరకు జరగనున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాల సందర్భంగా శ్రీనివాసమంగాపురంలోని ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు.
మూడు రోజుల పాటు దివ్య వాహన సేవలు
ఉత్సవాల్లో భాగంగా 17న పెద్దశేష వాహనం, 18న హనుమంత వాహనం, 19న గరుడ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించనున్నారు.
స్వామివారికి పరదాల విరాళం
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా తిరుపతికి చెందిన భక్తుడు శ్రీ నరసింహులు స్వామివారికి పరదాలను విరాళంగా సమర్పించారు. ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపీనాథ్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి.. మహువాకు వాహ్‌వా అనాల్సిందే..


